For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ వ్యక్తి గురించి మరింత ఉత్తమంగా తెలుసుకోవడం ఎలా?

By Mallikarjuna
|

ప్రతి ఒక్క స్త్రీ తన యొక్క పురుషుడు రిలేషన్ షిప్ లో ఎంత వరకూ నిలబలగలడు, ఎలా ఉండగలడు, అని ప్రతి యొక్క స్త్రీ తెలుసుకోవాలనుకుంటుంది. మీ పురుషుడి గురించి తెలుసుకోవడానికి చాలా సులభం మరియు అమాయకంగా తెలుసుకోవాలనుకుంటారు. మీ పురుషుడు గురించి తెలుసుకొనేటప్పుడు, మరింత లోతుగా ఆలోచించడం లేదా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు కానీ అంది కొంచెం క్లిష్టంగా భావిస్తారు . ఎందకంటే పురుషులు సధారణంగా వారి స్థానానికి రక్షణ కల్పించుకొంటారు మరియు వారి పవిత్రతను బయటకు చెప్పుకోవాలనకోరు , దాంతో మరింత కఠినంగా వ్యవహరిస్తారు.

ఒక వ్యక్తి గురించి తెలుసుకోవడానికి సహనం ఒక ప్రధానమైనటువంటి ఆయుధం. ఎందుకంటే అతని గురించి మరంత బెటర్ గా తెలుసుకోవడాని సహనం ఓపిక అనేది చాలా అవసరం అవుతుంది. మీ సంబంధంలో అతని గురించి మరింత లోతుగా తెలుసుకోవడానికి వివిధ మార్గాలున్నాయి. అతని గురించి తెలుసుకొనేటప్పుడు, ఏవైనా ప్రతికూల విషయాలు ఎదురైనప్పుడు ఆశ్చర్యం చెందకుండా, వెంటనే స్పంధించకుండా ఓపికగా ఉండటం చాలా అవసరం. ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం ద్వారా మరియు ఒకరి గురించి ఒకరు పూర్తిగా అర్ధం చేసుకోవడం ద్వారా మీ సంబంధం మరింత బెటర్ గా మరియు బలంగా ఉంటుంది.

అతని గురించి నిరంతరం తెలుసుకోవడం, తెలుసుకొన్న తర్వాత సాధారణంగా ఉండటం, సహనం పాటించడం చాలా అసరం. అతని గురించి ఎల్లప్పుడు మీకు తెలియని విషయాలు కూడా, కొన్ని సంవత్సరాల తర్వాత ఒకరి విషయాలు, ఒకరికి తెలియవచ్చు. అవి సర్ ప్రైజిస్ట్ , ఎక్కువ తెలియకుండా ఒంటిగా ఉండటం, బాధకరమైన గతం కలిగి ఉండవచ్చు, చాలా సందర్భాలో విషయాలు ఇచ్చిపుచ్చుకోవడంలా అనిపించవచ్చు . అతని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించేటప్పుడు, మీరు మీ గురించి కొన్ని విషయాలు అతనికి బహిర్గతం చేయడం ద్వారా, సన్నిహితంగా మరియు దగ్గరగా ఉండవచ్చు. మరి అతని గురించి తెలుసుకోవాలంటే ఈ క్రింది చిట్కాలను అనుసరించండి:

How you can get to know your man better

1. నిధానంగా ప్రారంభించాలి:

సంబంధంలో ముఖ్యంగా కావల్సింది ఒకరి మీద ఒకరికి నమ్మకం , ఒకరిగురించి మరొకరు తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి నమ్మకం అనేది బాగా పనిచేస్తుంది, ఆసమయంలోనే మీరు అతను మీ కలల రాకుమారడా లేదా అన్నవిషయం తెలుసుకోవచ్చు. అయితే, అతని గురించి వెంటనే తెలుసుకోవాలని అత్యుత్సాహం, ఆత్రుత అది మీ రిలేషన షిప్ కు మరింత ప్రమాధకరంగా మారవచ్చు. దాంతో మీరు దోషిగా నిలబడవచ్చు.

2. ప్రశ్నలు:

ఒక సారి మీ బాయ్ ఫ్రెండ్ మీకు సౌకర్యవంతంగా మాట్లాడటం మొదలు పెట్టినప్పుడు, అతని గురించి అడిగి తెలుసుకోవడం , లాజికల్ గా అతని సమాధానాలను అనుసరించడం. అతని ఫేవరెంట్ టీమ్ గురించి తెలుసుకోవడం స్టాప్ చేయకండి, అదే మార్గంలో వెళ్ళండి. అతని ఫేవరెట్ ప్లేయర్ ఎవరు అని అడిగి తెలుసుకొని, అలాగే , చిన్నచిన్న ప్రశ్నలతో ముందుకెళ్ళండి. ఈ మార్గంలో అయితేనే అతని గురించి మరంత బెటర్ గా తెలుసుకోగలుగుతారు మరియు అతని గురించి అతను ఎక్స్ ప్రెస్ చేసుకుంటూ, అతని ఇష్టా ఇష్టాలగురించి తెలుపుతాడు.

3.ఇచ్చి, పుచ్చుకోవడం

మీ బాయ్ ఫ్రెడ్ మీగురించి సాధ్యమైనంత వరకూ తెలుసుకోవాలనుకుంటాడు, అదే సమయంలో మీరు కూడా అతని గురించి తెలుసుకోవచ్చు. అతని మాత్రమే నిలపకుండా ప్రశ్నలడగడం కంటే, అతని చెప్పే వరకూ కాస్త ఓపిగ్గా ఉండండి. ఒక మంచి సంభాషణ ఇద్దరి మద్య ఉండగలిగినప్పుడే, ఆ సంబంధం మరింత బలంగా ఏర్పడుతుంది.

4.అతని స్నేహితుల గురించి తెలుసుకోండి

మీ బాయ్ ఫ్రెండ్ ను గురించి తెలుసుకోవాలంటే, అతని ద్వారా అతని స్నేహితులను తెలుసుకోవడం, లేదా అతని ద్వారా అతని స్నేహితుల కలవడం ద్వారా, అతని గురించి మరింత బెటర్ గా తెలుసుకోగలుగుతారు. స్నేహితులు, అమ్మాయిలకు కావల్సిన విషయాలను మరియు ఐడియాస్ ను పంచడంలో ఎప్పుడూ ముందుంటారు.

5. అతని పనిగురించి తెలుసుకోండి:

అతను ఏం పనిచేస్తున్నాడో మరియు అతని యొక్క అభిరుచిఏంటో తెలుసుకోవడం వల్ల మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు. అతని పనిగురించి మాట్లాడటంతో ప్రారంభించండి మరియు ఆరోజు పనిలో ఎలా ఉన్నది అడిగి తెలుసుకోండి. దాని వల్ల అతని యొక్క సహోద్యోగుల గురించి అడిగి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది .

6. మంచిగా వినండి:

అతని గురించి తెలుసుకోవడానికి ఓపిగ్గా, వినడం కంటే బెటర్ గా మరొక ఉపాయం ఉండదు. అతని మాత్రమే వినేట్లు చేయకండి, అతను మాట్లాడేటప్పుడు మీరు ఓపిగ్గా వినాలి, అతని గురించి అతని అభిరుచి గురించి మాట్లాడండి.

Desktop Bottom Promotion