భార్యాభర్తలు గొడవ పడిన తర్వాత చేయకూడనివి..!

రిలేషన్స్ లో వాదనలు, గొడవలు చాలా కామన్. బెస్ట్ రిలేషన్స్ లో కూడా గొడవలు చాలా కామన్. కానీ.. కొంతమందికి వాళ్ల మధ్య వచ్చే గొడవలు ఎలా పరిష్కరించుకోవాలో తెలుసుకోవాలి.

Posted By:
Subscribe to Boldsky

వాదనలు మనల్ని ఎమోషన్ కి గురిచేస్తాయి. కొన్నిసార్లు మనం చాలా డిస్ట్రబ్ అయినట్టు ఫీలవుతుంటాం. మనల్ని పట్టించుకోవడం లేదని కూడా అనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువైతే.. అహం దెబ్బతింటుంది, ఆత్మగౌరవం దెబ్బతింటుంది.

after quarrels

రిలేషన్స్ లో వాదనలు, గొడవలు చాలా కామన్. బెస్ట్ రిలేషన్స్ లో కూడా గొడవలు చాలా కామన్. కానీ.. కొంతమందికి వాళ్ల మధ్య వచ్చే గొడవలు ఎలా పరిష్కరించుకోవాలో తెలుసుకోవాలి. అప్పుడే.. వాళ్ల రిలేషన్ హెల్తీగా, అన్యోన్యంగా ఉంటుంది.

అయితే ఇద్దరి మధ్య గొడవ వచ్చినప్పుడు, చాలా కలహాలు ఏర్పడినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాల్లో అలర్ట్ గా ఉంటే.. తర్వాత.. వాటిని మరిచిపోవడం తేలికవుతుంది. రిలేషన్ హెల్తీగా ఉంటుంది. మరి గొడవ తర్వాత చర్చించకూడని విషయాలేంటో చూద్దాం..

పదే పదే గుర్తుచేసుకోవడం

గొడవ జరిగిన తర్వాత ఆ విషయాన్ని మరిచిపోవడం చాలా అవసరం. కానీ సాధారణంగా.. ఆ సందర్భాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటారు. దీనివల్ల వాళ్లపై ఎక్కువ నెగటివ్ ఫీలింగ్ ఏర్పడి.. పదే పదే బాధపడుతూ ఉంటారు.

విడదీసి మాట్లాడటం

చాలా పెద్దగా ఇద్దరూ గొడవ పడిన తర్వాత.. పదే పదే దాని గురించి ఆలోచించి.. ఇద్దరినీ విడదీసినట్టు, ప్రతి విషయాన్ని వేరు చేసి మాట్లాడుతుంటారు. చిన్న తప్పులను కూడా.. అద్దంలో పెట్టి చూడకూడదు.

ఒత్తిడికి గురవడం

నెగటివ్ ఆలోచలు.. చాలా ఒత్తిడికి గురిచేస్తాయి. వాదించుకున్న తర్వాత.. కొన్ని గంటలపాటు మీరు ఒత్తిడిగా ఫీలవుతారు. ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనే విషయాన్ని వదిలేసి.. పదే పదే ఆలోచిస్తూ ఉంటే.. ఒత్తిడి పెరుగుతుంది.

అందరికీ చెప్పడం

ఇంట్లో, భర్తతో జరిగి కలహాల గురించి.. ఫ్రెండ్స్ తో చెప్పుకుంటూ ఉంటారు. ఒకవేళ మీ స్నేహితులు మెచ్యూర్డ్ గా ఆలోచించేవాళ్లు కాకపోతే.. మరింత ఎక్కువ ఫైట్ చేయమని ఎంకరేజ్ చేస్తారు. మీ రిలేషన్ నాశనం అయ్యేలా ఐడియా ఇస్తారు. కాబట్టి.. ఎవరితో షేర్ చేసుకోకపోతే.. మీ రిలేషన్ డ్యామేజ్ అవకుండా ుంటుంది.

రివెంజ్ ప్లాన్ చేయడం

పాత గొడవలను గుర్తు చేసుకుంటే.. రివెంజ్ తీర్చుకోవాలనే ఆలోచన మీలో పెరుగుతుంది. ఇలాంటివి మీ రిలేషన్ కి పాయిజన్ లాంటివి. కాబట్టి.. ఈ ఆలోచనలు పక్కనపెట్టి.. ఇద్దరి మధ్య సఖ్యత పెరిగే మార్గాలు ఆలోచించాలి.

మరో గొడవ కోసం ఎదురుచూడటం

రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటే.. సాధారణంగా.. మరో గొడవ కోసం ఎదురుచూస్తారు. మీ భాగస్వామిపై మాటలతోనే ఎటాక్ మొదలుపెడతారు. కాబట్టి.. వాదించుకున్న తర్వాత, గొడవ జరిగిన తర్వాత ఇలాంటి ఆలోచనలు పక్కడ పెడితే.. మీ రిలేషన్ హెల్తీగా ఉంటుంది.

English summary

6 Things Not To Do After Quarrels

6 Things Not To Do After Quarrels. Even the best couples have arguments. An argument stirs us emotionally. Sometimes, we may feel disturbed and threatened. So, read on to know about things not to do after arguments...
Please Wait while comments are loading...
Subscribe Newsletter