కపుల్స్ మధ్య శారీరక బంధాన్ని బలంగా మార్చే రొమాంటిక్ టిప్స్..!

భార్యాభర్తలిద్దరూ కనెక్ట్ అయ్యామని ఫీల్ అయ్యేవరకు, వాళ్లిద్దరినీ మరేదీ కలపలేదు. ఒకవేళ ఇద్దరి మధ్య శృంగారం చాలా థ్రిల్లింగ్ గా జరుగుతున్నా.. ఇద్దరూ కనెక్ట్ అయ్యామని భావించకపోతే.. కలిసి ఉండటం చాలా కష్టం

Posted By:
Subscribe to Boldsky

బ్రేక్ అప్స్, డైవర్స్ అనే పదాలు ఈ మధ్య చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో.. చాలామంది కపుల్స్ విడిపోతున్నారని.. అధ్యయనాలు చెబుతున్నాయి. మనుషులను కలపడం ఈ రోజుల్లో చాలా తేలికైంది. టెక్నాలజీ.. ఇందుకు బాగా సహాయపడుతోంది.

physical connections

అయితే ఎందుకు దాదాపు చాలామంది కపుల్స్ వాళ్ల రిలేషన్ కి కొంతకాలంలోనే బ్రేక్ అప్ చెబుతున్నారు ? ఎలాంటి రిలేషన్ లో అయినా.. లోతైన ప్రేమ, శారీరక బంధం వల్ల ఇద్దరి మనసులు మరింత బలంగా ప్రేమను పంచుకోగలుగుతాయి.

భార్యాభర్తలిద్దరూ కనెక్ట్ అయ్యామని ఫీల్ అయ్యేవరకు, వాళ్లిద్దరినీ మరేదీ కలపలేదు. ఒకవేళ ఇద్దరి మధ్య శృంగారం చాలా థ్రిల్లింగ్ గా జరుగుతున్నా.. ఇద్దరూ కనెక్ట్ అయ్యామని భావించకపోతే.. కలిసి ఉండటం చాలా కష్టం. రిలేషన్స్ ని బలంగా మార్చే విషయాలు, ఫ్యాక్ట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇద్దరి మధ్య ఫిజికల్ కనెక్షన్స్ ని బలంగా మార్చే ఆసక్తికర విషయాలు చూద్దాం..

టచ్

విడిపోయిన రిలేషన్స్ లో చాలా వాటిల్లో మిస్ అయిన విషయం ఒకటి స్పష్టంగా కనిపిస్తోందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. కపుల్స్ మధ్య టచ్ చేయడాన్ని ఇష్టపడకపోవడం. ఒకరినొకరు టచ్ చేసుకోవడం వల్ల వాళ్ల బంధం బలమవుతుంది.

మహిళలకు

దాదాపు 85శాతం మందికి పైగా.. మనుషులు.. తమ భాగస్వామి ముట్టుకోవడాన్ని ఇష్టపడతారు. తరచుగా తమ భాగస్వామి ముట్టుకుంటే.. మహిళల్లో చాలా హాయిగా, సెక్యూర్ ఫీలింగ్ కలిగిస్తుందట.

శృంగారం

ఇద్దరి మధ్య శారీరక బంధాన్ని బలపరచడానికి కేవలం శృంగారం సరిపోతుందని భావిస్తారు. కానీ.. అది మాత్రమే సరిపోదని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

కౌగిలింతలు

కౌగిలింతలు, దగ్గరకు తీసుకోవడం వంటి రొమాంటిక్ విషయాలు కూడా.. ఇద్దరి మధ్య ఫిజికల్ కనెక్షన్స్ ని బలంగా మారుస్తాయి. శృంగారం కంటే.. శారీరక బంధం మీ రిలేషన్ ని బలంగా మారుస్తుంది.

ప్రేమలో నిజాయితీ

కేవలం బెడ్ పై శృంగారం సమయంలో మాత్రమే తమ భాగస్వామి తమ కోరికలు తీర్చుకోవడానికి ముట్టుకుంటే.. తమకు అసహ్యంగా ఉంటుందని మహిళలు చెబతున్నట్టు అధ్యయనాలు నిరూపించాయి. ఇతర సమయాల్లో కూడా టచ్ చేయడం వల్ల.. ఆఫెక్షన్ పెరుగుతుందని, ప్రేమలో నిజాయితీ అర్థమవుతుందట.

సమస్యలకు పరిష్కారం

ఎవరి మధ్య అయితే.. ముట్టుకుంటూ, కౌగిలించుకుంటూ.. స్ట్రాంగ్ ఫిజికల్ ఇంటిమసీ ఉంటుందో వాళ్లు.. వాళ్ల రిలేషన్ లో వచ్చే సమస్యలను చాలా త్వరగా పరిష్కరించుకుంటారు.

అఫెక్షన్

ఎమోషనల్ కనెక్షన్ లేదా ఇంటెలెక్చువల్ కాంటాక్ట్ కంటే.. అఫెక్షనేట్ టచ్.. చాలా పవర్ ఫుల్ అని అనేక మంది రిలేషన్ షిప్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.

వ్యాధులు

ఎవరైతే రెగ్యులర్ గా కౌగిలించుకుంటారో.. వాళ్లలో బ్లడ్ ప్రెజర్, గుండె సంబంధిత సమస్యల రిస్క్ తగ్గుతుందని.. అధ్యయనాలు చెబుతున్నాయి. లవింగ్ టచ్.. ఆ వ్యక్తిని రిలాక్స్ చేసి, బంధాన్ని బలంగా మారుస్తుంది.

English summary

Revealed: What Strengthens Physical Connections

Revealed: What Strengthens Physical Connections. Read on to know what strengthens physical bonds...
Please Wait while comments are loading...
Subscribe Newsletter