For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ పార్ట్ నర్ తో ఇలాంటి విషయాలు అస్సలు చెప్పడకూడదట...

సీక్రెట్స్ లేనప్పుడే ఇద్దరి మధ్య బంధం బలంగా ఉంటుంది అని సూచిస్తుంటారు. కానీ కొన్ని సున్నితమైన టాపిక్స్ ని బయటకు చెప్పకపోవడమే మంచిది. మీ భాగస్వామి ముందు మాట్లాడకపోవడమే మంచిది.

By Swathi
|

భాగస్వామితో అన్ని పంచుకోవాలని చెబుతుంటారు. సీక్రెట్స్ లేనప్పుడే ఇద్దరి మధ్య బంధం బలంగా ఉంటుంది అని సూచిస్తుంటారు. కానీ కొన్ని సున్నితమైన టాపిక్స్ ని బయటకు చెప్పకపోవడమే మంచిది. మీ భాగస్వామి ముందు మాట్లాడకపోవడమే మంచిది.

Things You Dont Need To Tell Your Partner

మీ జీవితం గురించి ప్రతి విషయాన్ని తెలుసుకునే హక్కు మీ భాగస్వామికి ఉందనుకోండి. కానీ కొన్ని విషయాలను పంచుకోవడం వల్ల ఎలాంటి హాని జరగదు. అలాగే ఒకరిపై ఒకరికి నమ్మకం కుదరడానికి కూడా సహాయపడుతుంది.

కానీ అవసరం లేకుండానే కొన్ని విషయాలను మాట్లాడాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాలను పదే పదే మాట్లాడటం వల్ల మీ భాగస్వామిలో అభిప్రాయం మారే అవకాశం ఉంటుంది. కాబట్టి పార్ట్ నర్ తో మాట్లాడాల్సిన అవసరం లేని విషయాలేంటి ?

గతంలోని ఆరోగ్య పరిస్థితులు

గతంలోని ఆరోగ్య పరిస్థితులు

మీకు గతంలో ఉన్న ఆరోగ్య పరిస్థితుల గురించి మీ భాగస్వామితో పంచుకోవాల్సిన అవసరం లేదు. మానసిక అనారోగ్యం, శారీరక అనారోగ్యం ఏదైనా గతంలో జరిగినది అవసరం లేదు. అయితే మీ భాగస్వామి మీ గురించి ప్రతి ఒక్కటీ తెలుసుకోవాలి అనుకున్నప్పుడు చెప్పవచ్చు.

నిందలు

నిందలు

జీవితంలో ఎదురైన కొన్ని నిందలను మరిచిపోవడం బెటర్. ఒకవేళ మీరు జీవితంలో అనుభవించిన ఇలాంటి సంఘటనలు తెలుసుకోవాలని మీ పార్ట్ నర్ కోరితే.. అప్పుడు ఒక ఐడియా లేదా క్లూ ఇవ్వడం మంచిది. లేదంటే ఇలాంటి ఇబ్బందికరమైన సంఘటనలు మళ్లీ గుర్తుచేసుకోకపోవడమే మంచిది.

ప్రతి రాత్రి

ప్రతి రాత్రి

ప్రతిరోజూ రాత్రి మీ ఊహలలో వచ్చే సెలబ్రెటీ లేదా మీ ఆఫీస్ లోని వ్యక్తి గురించి.. మీ భాగస్వామికి చెప్పాల్సిన అవసరం లేదు. మీ కలలో మరో వ్యక్తి ఊహించుకోవడం మీ భాగస్వామికి చాలా కోపం తెప్పిస్తుంది, మీ రిలేషన్ కి హాని తెస్తుంది. కాబట్టి అలాంటివి చెప్పకూడదు.

మీ ఇమేజ్

మీ ఇమేజ్

మనలో అందరూ పర్ఫెక్ట్ కాదు. మనకు విచిత్రమైన, భయంకరమై ముద్దు పేర్లు, స్కూల్ లేదా కాలేజ్ లో కాస్త విభిన్నమైన ఇమేజ్ ఉంటుంది. కాబట్టి.. వాటన్నింటినీ, ఆ స్టోరీస్ అన్నింటినీ మీ భాగస్వామికి చెప్పాల్సిన అవసరం లేదు.

 క్రష్

క్రష్

మీ భాగస్వామి తెలుసుకోవాలి అనుకుంటే తప్ప.. మీకు ఆఫీస్ లో ఉన్న క్రష్ గురించి రివీల్ చేయకండి. ఆమె లేదా అతడు మీతో ఉండటానికి ఇష్టపడకపోవచ్చు. కాబట్టి అలాంటివి చెప్పాల్సిన అవసరం లేదు.

ఫ్యామిలీ డ్రామా

ఫ్యామిలీ డ్రామా

అన్ని కుటుంబాల్లో గొడవలు ఉంటాయి. కానీ అలాంటివన్నీ మీ పార్ట్ నర్ కి ప్రతిరోజూ చెబితే.. కాస్త అసహ్యంగా ఫీలయ్యే అవకాశం ఉంటుంది. కానీ.. మీ భాగస్వామి మీ ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలి అనుకుంటే చెప్పడంలో తప్పులేదు.

గతంలో శారీరక సంబంధం

గతంలో శారీరక సంబంధం

ఒకవేళ మీ భాగస్వామి మీకు గతంలో ఉన్న శారీరక సంబంధం గురించి తెలుసుకోవాలి అనుకుంటే.. నిజం చెప్పండి. అది కూడా ఒక వాక్యంలో చెప్పేయండి. మరి వివరాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఎలా ఎంజాయ్ చేశారో వివరించడం వల్ల.. వాళ్లు అసహ్యించుకోవడం, ఇబ్బందిపడే అవకాశాలుంటాయి.

English summary

Things You Don't Need To Tell Your Partner

Things You Don't Need To Tell Your Partner. When it comes to certain sensitive topics, it is better to be tight lipped at least in front of your partner. What are those sensitive topics? read on to know.
Desktop Bottom Promotion