మీ భార్యను ఎట్టిపరిస్థితుల్లో అడగకూడని ముఖ్యమైన విషయాలు..!

కొన్ని పదాలు యాసిడ్ లా పనిచేస్తాయి. కొన్ని రిలేషన్ ని నాశనం చేస్తాయి. కాబట్టి ఎదుటివాళ్లతో మాట్లాడేటప్పుడు మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా అత్యుత్సాహం ప్రదర్శించి అన్నీ మాట్లాడేయకూడదు.

Posted By:
Subscribe to Boldsky

కొన్ని పదాలు యాసిడ్ లా పనిచేస్తాయి. కొన్ని రిలేషన్ ని నాశనం చేస్తాయి. కాబట్టి ఎదుటివాళ్లతో మాట్లాడేటప్పుడు మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా అత్యుత్సాహం ప్రదర్శించి.. నోట్లో వచ్చిన మాటలు పెలాపెలా మాట్లాడేయకూడదు. ఇవి చాలా డేంజర్ ని క్రియేట్ చేస్తాయి.

What You Should Never Say To Your Girlfriend

చాలా జాగ్రత్తగా మాటలు ఉపయోగించుకోవాలి. రిలేషన్ లో చాలా సౌకర్యవంతంగా ఉన్నప్పుడు.. వచ్చే మాటల విషయంలో చాలా కేర్ లెస్ గా ఉంటారు. అలాంటి అలవాటు.. మీ రిలేషన్ ని నాశనం చేసే అవకాశం ఉంటుంది.

కాబట్టి.. మీ భాగస్వామే అయినా కూడా.. చాలా కేర్ ఫుల్ గా వ్యవహరించాలి. నోటి మాటలు లిమిట్ దాటిపోయాయంటే.. వాళ్ల ప్రేమను పొందడం చాలా కష్టమవుతుంది. కాబట్టి.. మీ భార్యను ఎట్టిపరిస్థితుల్లో అడకూడని విషయాలు, చెప్పకూడని విషయాలేంటో చూద్దాం..

స్నేహితులుగా అమ్మాయిలు

అమ్మాయిలు స్నేహితులుగా ఉండటం తప్పు కాదు. కానీ.. కొంతమంది మహిళలు.. మీకున్న గర్ల్ ఫ్రెండ్స్ గురించి చెప్పినప్పుడు ఇన్ సెక్యూర్ గా ఫీలవుతారు. కాబట్టి.. మీ భార్య మనస్తత్వాన్ని బట్టి.. చెప్పాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోండి.

నువ్వు ఎక్కువగా ఆలోచిస్తావు

ఎలాంటి అమ్మాయికైనా.. ఈ విషయం చెప్పకూడదు. అమ్మాయిలు బాధలో ఉన్నప్పుడు.. లక్షల ఆలోచనలు వాళ్ల మైండ్ లో మెదులుతాయి. కాబట్టి.. మీ పదాలు.. మీ మాటలు మరింత ఇబ్బందిపెడతాయి.

అబ్బాయితో మాట్లాడటం మానేయమని చెప్పడం

ఒకవేళ మీరు మీ భార్యకు లేదా గర్ల్ ఫ్రెండ్ తన ఆఫీస్ లో ఉండే అబ్బాయితో మాట్లాడవద్దని చెబితే.. ఆమె చాలా ఫీలవుతుంది. మీరు ఆమెను అనుమానిస్తున్నారని బాధపడుతుంది. కాబట్టి.. అలాంటి విషయాలు చెప్పకండి.

నీ ఫోన్ చూస్తానని చెప్పడం

తన ప్రపంచానికి సంబంధించిన అన్ని సీక్రెట్స్ ని తన ఫోన్ పెట్టుకుంటారు మహిళలు. కాబట్టి ఒకవేళ మీరు ఆమె ఫోన్ చూడాలనుకుంటే.. ఆమె అసహ్యంగా ఫీలవుతుంది.

పాస్ వర్డ్ అడగటం

అమ్మాయిలను పాస్ వర్డ్స్ అడకూడదు. ఆమె మీతో పాస్ వర్డ్స్ షేర్ చేసుకునే వరకు.. మీరు ఆమెను పాస్ వర్డ్ గురించి అడకపోవడం మంచిది.

నీ పొట్ట పెరుగుతోందని చెప్పడం

ఈ విషయం మీ భార్యకు చెబితే.. ఆమె మిమ్మల్ని చంపేసినా.. చంపేస్తుంది. ఆమె బరువు పెరుగుతున్నట్టు ఆమెకు తెలుస్తుంది. అందుకు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉంటుంది. కాబట్టి.. అలాంటి విషయాలు ప్రస్తావించడం మంచిది కాదు.

English summary

What You Should Never Say To Your Girlfriend

What You Should Never Say To Your Girlfriend. Some words act like acid. They burn relationships. That is why you must be careful with what you utter in front of your girlfriend.
Please Wait while comments are loading...
Subscribe Newsletter