అందమైన అమ్మాయిలకు యావరేజ్ అబ్బాయిలు నచ్చడానికి కారణాలేంటి ?

చాలా సందర్భాల్లో మనం గమనిస్తూ ఉంటాం.. కొంతమంది అందమైన అమ్మాయిలు.. యావరేజ్ గా ఉన్న అబ్బాయిలను లైఫ్ పార్ట్ నర్స్ గా పొందుతారు. అందమైన అమ్మాయిలు యావరేజ్ గా ఉండే అబ్బాయిలకే ఎక్కువ ఎట్రాక్ట్ అవుతారు.

Posted By:
Subscribe to Boldsky

చాలా సందర్భాల్లో మనం గమనిస్తూ ఉంటాం.. కొంతమంది అందమైన అమ్మాయిలు.. యావరేజ్ గా ఉన్న అబ్బాయిలను లైఫ్ పార్ట్ నర్స్ గా పొందుతారు. సాధారణంగా.. మగవాళ్లు యుక్తవయసులో ఉన్నప్పుడు.. చాలా ఎట్రాక్టివ్ గా కనిపిస్తారు. కానీ అప్పుడు అందమైన అమ్మాయిలు యావరేజ్ గా ఉండే అబ్బాయిలకే ఎక్కువ ఎట్రాక్ట్ అవుతారు.

ugly men

ఇది గమనించిన అబ్బాయిలు షాక్ అవుతూ ఉంటారు. అసలు అమ్మాయిలకు ఏం కావాలి ? అని ప్రశ్నించుకుంటారు. అందంగా ఉన్నవాళ్లను వదిలేసి.. యావరేజ్ గా ఉండే అబ్బాయిలనే ఎందుకు ఇష్టపడతారని ఆలోచిస్తుంటారు.

నిజమే అమ్మాయిలకు ఏం కావాలో అర్థం చేసుకోవడం అంత తేలిక కాదు. అలాగే.. అందరూ మహిళలూ ఒకటే కోరుకుంటారని కూడా చెప్పలేం. కానీ మీరు బీచ్ లో గమనించారంటే.. అక్కడికి వచ్చే కపుల్స్ లో.. అందమైన అమ్మాయి.. స్మార్ట్ గా ఉండే అబ్బాయి జోడిగా కనిపించేది చాలా తక్కువ. అసలు అందంగా ఉన్న అమ్మాయిలు, యావరేజ్ గా ఉన్న అబ్బాయిలనే ఇష్టపడటానికి కారణాలేంటి ? దీనివెనక ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటో తెలుసుకుందాం..

ముఖ్యమైనవి

మహిళలు.. ఆకర్షణను అంతగా పట్టించుకోరని.. తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఆడవాళ్లు మగవాళ్లలో అందం కాకుండా.. మరికొన్ని ముఖ్యమైన విషయాలపై శ్రద్ధ తీసుకుంటారట.

శారీరక ఆకర్షణకే

కానీ అబ్బాయిలు మాత్రం.. శారీరక ఆకర్షణకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందుకే.. చాలా మంది అబ్బాయిలు.. న్యూడ్ ఫోటోలు చూడటానికి ఎక్కువ ఆసక్తి చూపుతారని సర్వేలు చెబుతున్నాయి.

ఇతర విషయాలు

ఆడవాళ్లను ఎట్రాక్ట్ చేసే విషయాలు.. చాలా విభిన్నంగా ఉంటాయట. మగవాళ్లు ఇష్టపడినట్టు.. శారీరక ఆకర్షణపై ఆసక్తి చూపరు. ఇతర విషయాలపై ఇంట్రెస్ట్ చూపిస్తారు.

వ్యక్తిత్వం

ఆడవాళ్లు శారీరక ఆకర్షణ కంటే.. వాళ్లు వ్యక్తిత్వానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని.. చాలా అధ్యయనాలు నిరూపిస్తున్నాయి.

క్యారెక్టర్ ముఖ్యం

అయితే అమ్మాయిలు హ్యాండ్ సమ్ అబ్బాయిలను ఇష్టపడరా అన్న డౌట్ రావచ్చు. కానీ.. అబ్బాయి అందంగా ఉండటమే కాదు.. పర్సనాలిటీ, క్యారెక్టర్ కూడా బాగుంటే.. వాళ్లను ఖచ్చితంగా ఇష్టపడతారు. స్మార్ట్, ఇంటెలిజెంట్ గా ఉండే అబ్బాయిలకు అమ్మాయిలు ఎట్రాక్ట్ అవుతారు.

యావరేజ్ గా ఉన్నా..

ఏ అబ్బాయి అయితే.. స్మార్ట్ గా ఆలోచిస్తాడో, మానసికంగా స్ట్రాంగ్ గా ఉంటాడో, నమ్మదగిన వ్యక్తిత్వం కలిగిన అబ్బాయి చూడటానికి యావరేజ్ గా ఉన్నా.. అందమైన భార్య వస్తుందని.. అధ్యయనాలు చెబుతున్నాయి.

English summary

Why Beautiful Women Have Ugly Boyfriends

Why Beautiful Women Have Ugly Boyfriends. Men wonder why some beautiful women end up with guys with average looks. Are looks not important to women? Read on to know a few facts.
Please Wait while comments are loading...
Subscribe Newsletter