For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ రిలేషన్ స్టైల్ మీ లవ్ లైఫ్ గురించి ఏం చెబుతోంది ?

By Swathi
|

మీరు లవ్ లో ఉన్నారా ? అయితే మీ రిలేషన్ ఎలాంటిదో తెలుసా ? అసలు రిలేషన్ లో కూడా రకాలుంటాయని మీకు తెలుసా ? అవును మీ ఇద్దరి మధ్య ఉన్న బాంధవ్యం, అండర్ స్టాండింగ్ ని బట్టి రిలేషన్ షిప్ ని ఐదు రకాలుగా చెప్పవచ్చు. మీరు మీ భాగస్వామికి ఇచ్చే ప్రాధాన్యతను, భాగస్వామిని ఎంచుకోవడంలో తీసుకున్న జాగ్రత్తలను బట్టి.. మీ రిలేషన్ స్టైల్, రిలేషన్ ని లవ్ లైఫ్ ఎంత బలమైనదో తెలుసుకోవచ్చు.

స్ట్రాంగ్ రిలేషన్ షిప్ మరియు మనస్సులను దగ్గర చేసే కపుల్ యోగా

బ్రిటీషర్స్ చేసిన తాజా అధ్యయనాల్లో రిలేషన్ షిప్ గురించి ఆసక్తికర అంశం బయటపడింది. కపుల్ స్టైల్ ని బట్టి.. మీకు పెళ్లి చేసుకునే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయో తెలుసుకోవచ్చని ఈ స్టడీస్ చెబుతున్నాయి. ఎలాంటి కపుల్స్ ప్రేమ పెళ్లి వరకు వెళ్తుంది ? ఏ కపుల్స్ ప్రేమ మధ్యలోనే ముగిసిపోతుందని ఈ స్టడీస్ రివీల్ చేశాయి ? ఇంకెందుకు ఆలస్యం మీ లవ్ రిలేషన్ ఫ్యూచర్ ఏంటో ఇప్పుడే తెలుసుకోండి.

couples

ఘర్షణ పడే కపుల్స్
తరచుగా ఘర్షణ పడటం, తిట్టుకుంటూ పోట్లాడే జంట ఈ కపుల్ స్టైల్ కిందకు వస్తారు. ఇద్దరూ తరచుగా వాదులాడుకున్నా.. వెంటనే మళ్లీ కలిసిపోతారు. ప్రేమగా, సామరస్యంగా ఉంటారు. ఇలాంటి వాళ్లు విడిపోయే ఛాన్స్ లు తక్కువ.

couples

పార్ట్ నర్ ఫోకస్
మీ భాగస్వామి సంతోషం, తను బాగుండాలనే కేర్ ఇద్దరిలో ఉంటే.. పార్ట్ నర్ ఫోకస్ కపుల్ స్టైల్ అని పిలుస్తారు. మీ ఇద్దరి అభిరుచులు చాలా వరకు ఒకేలా ఉంటాయి. ఇద్దరి కలిసి స్పెండ్ చేయడానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఒకరికొకరు సహాయపడతారు. ఇలాంటి జంట విడిపోయే అవకాశాలే లేవు. మీ సంబంధం కలకాలం ఉండాలని ప్రయత్నించడమే మీ లక్ష్యంగా పెట్టుకుంటారు. సక్సెస్ అవుతారు.

couples

స్పేస్ సెంటర్డ్
అంటే.. మీ ఇద్దరి జీవితంలో ఇది మొదటి లవ్ కాదు. గతంలోనే ఇద్దరికి వేరేవాళ్లతో రిలేషన్ ఫెయిల్యూర్ అయి ఉంటుంది. ఇద్దరూ ఒకరిని ఒకరు గౌరవించుకుంటారు. అభిప్రాయాలు, ఫీలింగ్స్ చెప్పుకునే ప్రైవసీ ఇద్దరికీ ఉంటుంది. ఇద్దరూ కలిసి ఉంటే హ్యాపీగా ఉంటాము అనుకోరు. టైం ఉన్నప్పుడు కలిస్తే చాలు అని భావిస్తారు. మీరు లైఫ్ లాంగ్ కలిసి ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.

couples

సోషియల్ కపుల్
మీ భాగస్వామిని ఎంచుకోవడానికి మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ దే మొదటి ప్రాధాన్యత అయితే.. మీరు సోషియల్ కపుల్ స్టైల్ కిందకి వస్తారు. మీ పార్ట్ నర్ మీ బెస్ట్ ఫ్రెండ్, మీ లవర్ అని భావిస్తారు. అయితే మీ లవ్ సక్సెస్ అయినట్టే. మీ భాగస్వామితో మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది.

couples

డ్రమాటిక్ కపుల్ స్టైల్
డ్రమాటిక్ కపుల్ స్టైల్ ఎక్కువ మంది ఉంటారు. మీరిద్దరూ హ్యాపీగా లేరని ఎప్పుడూ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. మీ భాగస్వామి మీతో ఎక్కువ సమయం గడపడం లేదని ఎక్కువగా ఫీలవుతూ ఉంటారు. ఇలాంటి జంట విడిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇలాంటి రిలేషన్ లో అమ్మాయిలు మంచి స్వభావం కలిగి ఉండరు.

English summary

Your couple style predict your chances of marriage

Your couple style predict your chances of marriage. A new British study has identified five types of relationship and commitment styles, and discovered which type is most likely to get married. Find out what your relationship says about your future together.
Story first published:Friday, January 29, 2016, 15:32 [IST]
Desktop Bottom Promotion