For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లివిన్ రిలేషన్ షిప్: ఇది మంచి ఆలోచన?

By Super
|

వివాహం అనేది ఇద్దరి వ్యక్తుల మధ్య బంధాన్ని నిలిపే ఒక పురాతన రూపం. సంస్కృతులు మరియు కొన్ని యుగాలుగా కాలపరీక్షను దాటి అభివృద్ధిని స్వీకరించిన పురాతన సంస్థగా చెప్పవచ్చు. లివిన్ రిలేషన్ వివాహం యొక్క ఆలోచనను ఇచ్చే విధంగా యూనియన్ యొక్క కొత్త రూపం ఉంటుంది. ఇది పాశ్చాత్య సంస్కృతి నుండి ఉద్భవించింది. అయితే ప్రపంచవ్యాప్తంగా అన్ని సంస్కృతుల్లో వివాహం యొక్క పవిత్రత చొచ్చుకెళ్లింది. లివిన్ రిలేషన్ అంటే ప్రధానంగా ఒక అనధికారిక వివాహం మరియు ఇద్దరు వ్యక్తులు కలిసి నివసించటం అని అర్ధం.

లివిన్ రిలేషన్ షిప్ కి అనేక దేశాలలో గుర్తింపు ఇంకా లేదు. అంతేకాక చట్టాలలో కూడా వీటిని పరిష్కరించేందుకు ఏర్పాట్లు కూడా ఇంకా లేవు. వివాహం లేకుండా పూర్తీగా ఇద్దరు వ్యక్తులు కలిసి వారి సంబంధాన్ని కొనసాగించటం అనేది తూర్పు సంస్కృతుల్లో నిషేధంగా ఉంది. అయితే,పాశ్చాత్య సంస్కృతిలోని నిబంధనల ప్రకారం అక్కడ యువకులు ఎక్కువ మంది లివిన్ రిలేషన్ షిప్ ను అంగీకరించారు. లివిన్ రిలేషన్ షిప్ కు దాని సౌలభ్యం మరియు అవాంతరం లేని స్వేచ్ఛ కొరకు చాలా మంది ప్రాధాన్యత ఇస్తున్నారు.

వివాహం వలన సమయం మరియు అవసరమైన వనరులతో ఖరీదైన వ్యవహారం అని చెప్పవచ్చు. వివాహ వైఫల్యం అయితే చట్టబద్ధంగా మరియు ఇతరత్రా విడాకుల కోసం పరిష్కరించుకోవలసిన అవసరం ఉంది. లివిన్ రిలేషన్ షిప్ అనేది ఒక ప్రివ్యూ వంటిది. దీనిలో కలసి ఉంటె ఉండవచ్చు లేదా మనకు ఇష్టం వచ్చినప్పుడు విడిపోవచ్చు. మాకు లివిన్ రిలేషన్షిప్ గురించి వివిధ అభిప్రాయాలు మరియు దృష్టికోణాలు ఉన్నాయి.

live-in-relationship-is-it-a-good-idea

1. లివిన్ రిలేషన్ షిప్ లో స్వాతంత్రం మరియు సౌకర్యం ఉండుట వలన కొత్త తరాలను ఆకట్టుకునేలా చేస్తుంది. వివాహం యొక్క సమస్యలు చట్టపరంగా మరియు సాధారణ నిబంధనలకు లోబడి ఉండవు.

2. లివిన్ రిలేషన్ షిప్ లో ఇబ్బంది కలిగించే బంధువులు,పిల్లల ప్లానింగ్ మొదలనవి ఆధిపత్యం లేకుండా షేరింగ్ ఉంటుంది. జంటలో ఏ ఒక్కరికి మరొకరి మీద బాధ్యతగా ఉండాలనే బలవంతం ఉండదు.

3. లివిన్ రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు మీకు మీ భాగస్వామి నుండి ఆర్థిక పరమైన స్వతంత్ర ఉంటుంది. స్వతంత్రంగా మీ ఆర్ధిక ప్రణాళిక వేసుకొనే అధికారం మరియు మీ భాగస్వామితో మీ ఆదాయాలను పంచుకునేందుకు ఎటువంటి బాధ్యత లేదు.

4. లివిన్ రిలేషన్ షిప్ ను మీరు మరియు మీ భాగస్వామి మధ్య అనుకూలత పరీక్షకు ఉపయోగించవచ్చు. మీరు ఇలా కలిసి నివసించుట వల్ల మీ నిజ జీవిత పరిస్థితుల్లో మీ భాగస్వామి మిమ్మల్ని ఎంత బాగా చుసుకుంటారో చూసే అవకాశం ఉంటుంది.

5. చాలా మంది ప్రజలు శాశ్వత సంబంధంనకు ఇష్టపడతారు. కానీ కొంత మందికి ఒకే వ్యక్తీ తో ఎక్కువకాలం ఉంటే విసుగు పుడుతుంది. ఈవిధంగా విసుగు పుట్టినప్పుడు భాగస్వామిని మార్చటానికి లివిన్ రిలేషన్ షిప్ ఉపయోగపడుతుంది.

6. ఒక వివాహంతో పోలిస్తే లివిన్ రిలేషన్షిప్ లో తెగతెంపులు చేసుకోవటం అనేది చాలా సులభము. ముందుగా నెరవేర్చడానికి ఎటువంటి చట్టపరమైన బాధ్యతలు ఉండవు. మీరు ఒక విచ్ఛిన్నానికి భావోద్వేగ అంశాన్ని మాత్రమే పరిష్కరించుకోవాలి.

7. లివిన్ రిలేషన్ షిప్ లో మీ సొంత నియమాలను స్వేచ్ఛగా తీసుకోవచ్చు. సంబంధం కోసం మీ సొంత నియమాలు వ్రాయడానికి మీరు ఒక క్లీన్ స్లేట్ ఇవ్వడానికి లివిన్ రిలేషన్ షిప్ లో ఎలాంటి స్థిరమైన సామాజిక నిబంధనల లేవు.

8. లివిన్ రిలేషన్ షిప్ జంటలకు అనేక సౌలభ్యాలను అందిస్తుంది. లివిన్ రిలేషన్షిప్ కొనసాగిస్తున్న కొంతమంది జంటలు ప్రతి ఒక్కరు ఇతరులతో కలిసి బహుళ భాగస్వామ్యంతో కూడా స్వేచ్ఛగా ఉండవచ్చు.

9. లివిన్ రిలేషన్ షిప్ లో ఉన్న జంటలు త్యాగం లేదా వారి మార్గాన్ని మార్చుకొనే అవసరం ఉండదు. మీరు లివిన్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు నిజమైన స్వీయ స్వేచ్ఛ చాలా ఉంటుంది. మీ భాగస్వామి మిమ్మల్ని మీ స్వభావంను మార్చోకోమని బలవంతం చేయరు.

10. లివిన్ రిలేషన్ షిప్ లో విడాకులు లేకపోవటం అనేది ఎక్కువ మంది వ్యక్తులకు అత్యంత ఆసక్తికరమైన అంశముగా ఉన్నది. ఈ జంటలు ఎటువంటి విడాకుల ప్రసక్తి లేకుండా ఎప్పుడు కావలంటే అప్పుడు ఆధిపత్యం లేకుండా విడిపోవచ్చు.

English summary

live-in-relationship-is-it-a-good-idea

Marriage is the oldest form of bonding between people to solemnise their coming together. It is the oldest institution that has passed the test of times and adopted through the ages according to evolving cultures and times.
 
Desktop Bottom Promotion