For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎవరినైనా ప్రేమించకుండా ఉండటానికి 5 చిట్కాలు

By Mallikarjuna
|

సహజంగా ఒక వయస్సు వచ్చిన తర్వాత టీనేజ్ లో ఉన్నప్పుడు, స్త్రీ, పురుషులు ప్రేమకు ఆకర్షితులవుతుంటారు. అయితే కొంత మంది ప్రేమను తెలిపినప్పుడు వెంటనే స్పందిస్తారు, మరికొంత మంది కొంచెం నిధానంగా స్పందిస్తారు. కానీ కొంత మందికి అసలు ప్రేమంటనే పడదు, ప్రేమన్న, ప్రేమించడం అన్నా ఇష్టముండదు. అటువంటి వారికోసం ప్రేమలు పడకుండా ఉండటం కోసం కొన్ని చిట్కాలు ఈక్రింది విధంగా ఉన్నాయి.

ఈ చిట్కాలను అనుసరించినట్లైతే, ముందు ముందు ప్రేమలో పడకుండా మీఅంతట మీరు కంట్రోల్లో ఉండటానికి ఇవి సహాయపడుతాయి. ఈ చిట్కాలను అనుసరించడానికి కొన్ని వారాలు పట్టినా, ఆ సమయంలో మాత్రం మీ ఆలోచనల్ని మరియు మీరు కూడా స్ట్రాంగ్ గా ఉండాలని నిర్ణయించుకోవాలి. మీకు ప్రేమను తెలిపే వారి నుండి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. ఎవరితోనైనా ప్రేమలో పడకుండా ఉండటానికి కొన్ని చిట్కాలు ఈ క్రింది విధంగా.

 మీ దృష్టిని మరల్చండి:

మీ దృష్టిని మరల్చండి:

ప్ర్రేమను ఎక్స్ ప్రెస్ చేసే వ్యక్తి మీ మనస్సును కంట్రోల్ చేసే అవకాశం ఇవ్వకండి. అటువంటి వ్యక్తి గురించి ఆలోచనాలను ఆపడానికి కష్టంగా ఉంటుంది. కాబట్టి, మీ అంతట మీరు కొత్త పనులు ఏవైనా చేయడానికి వాటి మీద దృష్టి పెట్టండి. మరియు మీరు ఒంటరిగా లేదా ఖాళీగా ఉన్నట్లు అనుభూతి కలుగుతున్నా వేరే ఆలోచనల వల్ల మిమ్మల్ని మీరు సంతోషంగా ఉంచుకోగలుగుతారు.

మరీ ఎక్కువగా స్నేహంగా ఉండకూడదు

మరీ ఎక్కువగా స్నేహంగా ఉండకూడదు

అటువంటి వ్యక్తులతో మీరు కొంచెం దూరంగా ఉంటూ, వారిని దూరం పెట్టండి. మరీ ముఖ్యంగా లేట్ నైట్ మెసేజ్ లు లేదా ఫోన్ కాల్స్ తో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోవడం నివారించండి. అటువంటి సందర్భాల్లో మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సింది, అటువంటి వ్యక్తులతో మీరు మరింత స్నేహంగా మెలగకుండా ఉండాలి, మరింత లోతుగా వెళ్ళడం వల్ల అది మీకే మంచిది కాదు.

లోపాలను ఎత్తి చూపండి :

లోపాలను ఎత్తి చూపండి :

మనలో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపాలుంటాయి. మిమ్మల్ని ఎవరైనా ప్రేమించడానికి ప్రయత్నిస్తున్నా, ప్రేమను వ్యక్తపరిచినా, మీకు ఇష్టం లేకపోతే వారిలోని లోపాలను వెతికి చెప్పండి లేదా చెడుగా వారి చూడటం, పద్దతులు నచ్చలేదని చెప్పడం వంటివి చేయడం వల్ల వారు మీ మీద అయిష్టం చూపించవచ్చు. అతన్ని మీరు ఎందుకు ఇష్టపడుతుండటలేదో, మీరు లిస్ట్ రాసుకొని, వాటిని అప్పుడప్పుడు చదువుతూ గుర్తించుకోవడం ఉత్తమం.

తేడాను గ్రహించండి లేదా గుర్తించండి :

తేడాను గ్రహించండి లేదా గుర్తించండి :

ఎవరితోనైనా ప్రేమలో పడటం లేదా ఆకర్షించడం మరియు ఆసక్తిని చూపించడం వాటిని మద్య తేడాలను గ్రహించండి. కేవలం బాయ్స్ అండ్ గర్ల్స్ ఆకర్షితులవుతుంటారు, ఫన్నీగా మరియు వండర్ ఫుల్ గా ఉంటారు. అయితే అవన్నీ నిజమైన ప్రేమ కాదని గ్రహించాలి.

ఇతరుల మీద ఏకాగ్రతను పెట్టండి:

ఇతరుల మీద ఏకాగ్రతను పెట్టండి:

కొన్ని సందర్భాల్లో ఇటువంటి ట్రిక్స్ చాలా బాగా పనిచేస్తాయి. మీరు నిజంగా అతని ప్రేమను నిరాకరించాలని ఖచ్చితంగా నిర్ణయించుకొన్నప్పుడు, మీరు మీకు నచ్చిన వ్యక్తులు మీద మీ దృష్టిని మళ్ళించేందుకు ప్రయత్నించండి.

Desktop Bottom Promotion