For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆఫీసులో మీకొక బెస్ట్ ఫ్రెండ్ ఉండాలి అనడానికి 8 కారణాలు

|

రోజు ప్రారంభించే ముందు మనం చాలా విషయాల గురించి ఆలోచిస్తాము. ప్రేరణ లోపించడం,ఆఫీసులో ఒత్తిడి, ఈ ఒత్తిడిలో చాలాసేపు ఆఫీసులో పనిచేస్తే జీవితం నిస్సారం అనిపిస్తుంది. ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీతో ఉంటూ, జీవితం మీద ఉత్సాహం కోల్పోకుండా ఉండాలంటే మన చుట్టూ పాజిటివ్ ఎనర్జీయే ఉండాలి. మనందరికీ ఆఫీసులో ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నట్లయితే జీవితం ఆనందదాయకమవుతుంది.

సీటుకు అతుక్కుని పోయి గంటల తరబడి పనిచేసినప్పటికంటే హాయిగా నవ్వుతూ తుళ్ళుతూ స్నేహ పూరిత వాతావరణం లో పని చేస్తే పని కూడా సులభతరమవుతుంది, టార్గెట్లని కూడా సులభం గా చేరుకోవచ్చు. ఆఫీసులో బెస్ట్ ఫ్రెండ్ ఉంటే ఒత్తిడిని మరిచి వారితో అనేక విషయాలు పంచుకోవచ్చు.

హాయిగా బెస్ట్ ఫ్రెండుతో కలిసి పని చేస్తూ, పనిని ఆస్వాదిస్తూ ఆనందంగా ఉండటం కంటే మించినది ఉంటుందా??

ఉత్తమ సలహాలు

ఉత్తమ సలహాలు

మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం లో అసంత్రుప్తి తో ఉండి ఇతర ఉద్యోగాలకి ప్రయత్నిస్తోంటే మీ బెస్ట్ ఫ్రెండ్ నుండి ఉత్తమ సలహాలు పొందవచ్చు.మీ బెస్ట్ ఫ్రెండ్ మీలోని బలాలు, బలహీనలతలని మీకు తెలియచెప్పి ఉద్యోగ ఎంపిక సులభతరం చేస్తుంది/చేస్తాడు.

మద్దత్తుదారు:

మద్దత్తుదారు:

మీరు కనుక మీ బాస్ కి అబద్ధం చెప్పినట్లయితే పక్కనే ఉన్న మీ బెస్ట్ ఫ్రెండ్ మెల్లిగా తనలతాను నవ్వుకుంటూ ఉండచ్చు.తనతో కలిసి చేసే చిలిపి పనులు సరదాగా ఉంటాయి.

మీకు ఆఫీసులో ఎవరైనా నచ్చితే

మీకు ఆఫీసులో ఎవరైనా నచ్చితే

మీకు ఆఫీసులో ఎవరైనా నచ్చితే మీకు ఎవరైన ఆఫీసులో బాగా నచ్చేసారనుకోండి మీ బెస్ట్ ఫ్రెండుతో నిస్సంకోచంగా మీకు నచ్చిన అబ్బాయి లేదా అమ్మాయి గురించి గంటలకొద్దీ నిర్భయంగా మాట్లాడచ్చు.ఒకవేళ మీ బెస్ట్ ఫ్రెండ్ ఆఫీసులో లేకపోతే మీ భావాలని అలా అణచిపెట్టుకోవడం చాలా కష్టం కదూ?? అప్పుడు జీవితం బోరింగ్ గా ఉంటుంది

కాఫీ బ్రేక్స్

కాఫీ బ్రేక్స్

బాగా పని ఒత్తిడిలో ఉన్నప్పుడు కాసేపు అలా సీట్లో నుండి బయటకొచ్చి ఓ కప్పు కాఫీ తాగుతూ మీ బెస్ట్ ఫ్రెండ్ తో కబుర్లు చెప్తే మీ మూడ్ మళ్ళీ ఉత్సాహాన్ని పుంజుకుంటుంది. అలా కబుర్లు చెప్పి మరలా పనిచేసుకుంటే మీకు బోరింగా అనిపించదు పైగా ఇంకా ఉత్సాహంతో మీ పని పూర్తిచెయ్యాలని చూస్తారు.

లంచ్ భాగస్వామి

లంచ్ భాగస్వామి

చాలా రోజులనుండీ ఆఫీసులో మీరొక్కరే కూర్చుని లంచ్ చేస్తొంటే కనుక ఒంటరితనం చుట్టుముడుతుంది.ఏదో కోల్పోయాము అన్న భావన రావచ్చు.మీ బెస్ట్ ఫ్రెండ్ తో కనుక మంచి డిస్కషన్ పెట్తుకుని భోంచేస్తే మీ మనసు ఉత్సాహంగా మారి ఇంతకుమునుపు కంటే మీలో ఉత్పాదకత పెరుగుతుంది.

గాసిప్స్(పుకార్లు)

గాసిప్స్(పుకార్లు)

అమ్మాయిలకి పుకార్లంటే అమితాసక్తి. నిస్సారంగా పనిచేసుకుంటే మీ ఉత్పాదకత దిగజారిపోయి జీవితం బోరింగ్ గా అనిపిస్తుంది.మీ బెస్ట్ ఫ్రెండ్ తో కాసేపు అలా గాసిప్స్ పంచుకుని చూడండి, మీ మనసు ఉత్సాహం పుంజుకుంటుంది. అందువల్లే ఆఫీసులో బెస్ట్ ఫ్రెండ్ ఉండాలి అనడానికి ఇదీ ఒక కారణం.

మీ బెస్ట్ ఫ్రెండ్ చక్కగా వింటారు

మీ బెస్ట్ ఫ్రెండ్ చక్కగా వింటారు

మిమ్మల్ని మీ బాస్ కోప్పడ్డాడు లేదా మీటింగులో నుండి నిరాశతో బయటకొచ్చారు.ఎవరితో పంచుకుంటారు మీ నిస్ప్రుహని?? సందేహమెందుకు, ఖచ్చితం గా మీ బెస్ట్ ఫ్రెండ్తోనే.మీ బెస్ట్ ఫ్రెండుతో మాట్లాడి, మీ నిస్ప్రుహ ని వెళ్ళగక్కి లేదా తనివితీరా ఏడ్చేసి భారం దింపుకుంటే మళ్ళా మామూలయిపోతారు

మీ సేవియర్

మీ సేవియర్

మీరు ఆఫీసుకి సమయానికి చేరుకోలేక పోయినప్పుడు మీ బాస్ మీ మీద కారాలూ మిరియాలూ నూరుతోంటే మీకు చెప్పేది మీ బెస్ట్ ఫ్రెండే కదా.ఒక్కసారి తనకి ఫోను చేసి మీ బాస్ వచ్చారో లేదో కనుక్కుంటే మీ బాస్ నుండి వచ్చే తిట్లు స్వీకరించడానికి తయారయిపోవచ్చు.

English summary

8 Reasons Why Everyone Needs A Bestie At Work

There are many things that we all look forward to start our day with. Lack of motivation, work pressure and working for long hours makes life miserable. To stay motivated and to have positive energy within us, we need positive things around us. We all need to have at least one bestie in our office to make our life easy.
Story first published: Saturday, August 29, 2015, 12:56 [IST]
Desktop Bottom Promotion