For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహిళలు తమ పెళ్ళి విషయంలో ఎందుకు భయపడుతారు

By Super
|

ఇదివరకు రోజులు వేరు. అప్పట్లో 20 ఏళ్ళు వచ్చీ రాగానే అమ్మాయికి పెళ్లి చేసేయడానికి సిద్ధపడేవారు. ఆడపిల్ల పెళ్లిని పెద్ద బాధ్యతగా చూసేవారు. ఇప్పటికీ కొన్ని భారతీయ చిత్రాలలో భారతీయ యువతికి పెళ్ళనేదే జీవితాశయంగా చిత్రీకరించడాన్ని గమనిస్తూనే ఉన్నాం. ఇప్పటి తరం భారతీయ యువతులు మాత్రం పెళ్లనే ప్రాసెస్ ని వీలైనంత వరకూ పోస్ట్ పోన్ చేయడానికే ప్రయత్నిస్తున్నారు.

పెళ్ళనే ప్రక్రియని పోస్ట్ పోన్ చేయాలని నేటి తరం యువతులు ఆలోచించడం వెనుక ఎన్నో కారణాలున్నాయి. వారి ఆలోచనా తీరుపై ఆయా కారణాలు అత్యంత ప్రభావం చూపుతున్నాయి. ఆర్ధిక స్వేచ్చ, లిబరల్ సొసైటీ వంటి అంశాలెన్నో వారిపై ప్రభావం చూపుతున్నాయి. మీరు మాతో అంగీకరించరా? అయితే, మీకు నేటి భారతీయ యువత ఎందుకు పెళ్లిని పోస్ట్ పోన్ చేయడానికి ప్రయత్నిస్తోందో కారణాల్ని విశ్లేషిద్దాం.

1. స్వేచ్చని కోల్పోవడం

1. స్వేచ్చని కోల్పోవడం

సింగిల్ గా ఉన్నంత కాలం తమకు నచ్చినట్టుగా స్వేచ్చగా ఉండవచ్చని దాదాపు చాలా మంది యువతుల ఆలోచన. పెళ్ళైన తరువాత స్వేచ్చగా ఉండలేమని వారు భావిస్తున్నారు. భర్త, అత్తమామలు తమ స్వేచ్చకు అడ్డుగా ఉంటారన్న భావనతో వారు పెళ్లిని వీలైనంత వరకు పోస్ట్ పోన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అందువల్ల వీరిలో పెళ్ళన్న ఆలోచనకు వ్యతిరేకంగా ఆలోచనలు వస్తున్నాయి.

2. అతిపెద్ద మార్పు

2. అతిపెద్ద మార్పు

చాలా మందికి మార్పును అంగీకరించడమనేది ఎంతో కష్టమైన విషయం. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడానికి ఎవరు అంగీకరిస్తారు చెప్పండి. ఈ విషయంలో నేటి యువతులు మినహాయింపు కాదు. అందుకే పెళ్లి వల్ల ఇల్లు, సిటీ వంటి మార్పులు కూడా చోటుచెసుకుంటాయి కాబట్టి అటువంటి మార్పుకు సిద్ధంగా ఉండట్లేదు. లైఫ్ స్టైల్, కుటుంబం మొదలగు విషయాల్లో కలిగే మార్పులకు భయపడి యువతులు పెళ్ళంటే నిరాసక్తత ప్రదర్శిస్తున్నారు.

3. ప్రేమ ఆప్యాయతలు

3. ప్రేమ ఆప్యాయతలు

తల్లిదండ్రుల దగ్గరి నుంచి, అన్నదమ్ముల దగ్గరనుంచి, అక్కచెల్లెల్ల దగ్గరనుంచి లభించే ప్రేమ ఆప్యాయతలు కొత్తగా వెళ్ళే ప్రదేశంలో లభిస్తాయో లేదోనన్న భయం వల్ల పెళ్లి మీద అయిష్టత ఏర్పడుతుంది. పెళ్లి వల్ల వీటన్నిటికీ దూరం అవ్వాల్సి వస్తుందన్న ఆలోచన పెళ్ళనే ప్రక్రియపై సదభిప్రాయం కలిగించదు. అపుడప్పుడూ ఇంట్లో తల్లులు పిల్లలను 'ఇక్కడ ప్రవర్తించినట్లే అత్తవారింట్లో ప్రవర్తిస్తే మీ అత్తగారు ఊరుకోదు' వంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల కూడా అత్తవారింటిపై భయం ఏర్పడుతుంది. అత్తవారింట్లో భయంకరమైన వాతావరణం ఉంటుందేమోనని ఊహించుకోవడం వల్ల కూడా పెళ్ళంటే భయపడతారు. తల్లి దగ్గర లభించే స్వేచ్చ అత్తగారి వద్ద లభించదన్న విషయం కూడా పెళ్లిపై అయిష్టతకు కారణం.

4. మ్యారేజ్ ప్రోటోకోల్

4. మ్యారేజ్ ప్రోటోకోల్

పెళ్లి తరువాత జీవితం ఎలా ఉండబోతోంది అనే విషయంపై సహజంగా యువతులలో కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. పెళ్లి, పిల్లలు, పిల్లల చదువులు వంటి ఆలోచనలెన్నో ఉంటాయి. కాని ఈ ఆలోచనావిధానానికి ఇప్పటి యువతులలో 'నేను నా ఇష్టం' అనే ఆలోచన కూడా తోడయింది. కాబట్టి వీరికి పెళ్లి అనేది అవసరమా అనే సందేహం కూడా వస్తుంది.

5. కమిట్మెంట్ ఫోబియా

5. కమిట్మెంట్ ఫోబియా

అవును కమిట్ మెంట్ అంటే కేవలం పురుషులే కాదు మహిళలు కూడా భయపడుతున్నారు. మహిళలకు కూడా రిలేషన్ షిప్ ఫియర్స్ ఉన్నాయట. "ఇది కేవలం వ్యామోహమా", "ఒకవేళ వర్క్ అవుట్ కాకపోతే ఎలా?", ఇలా ప్రశ్నలు తలెత్తుతాయి. వీటితో పాటు "ఒకవేళ ఇలా అయితే" వంటి మరెన్నో ప్రశ్నలు వారిని పెళ్లి నుంచి దూరంగా ఉంచుతున్నాయి.

6. కెరీర్ డైలమా

6. కెరీర్ డైలమా

పెళ్లి చేసుకోవడం వల్ల తమ కెరీర్ కు ఫుల్ స్టాప్ పడిపోతుందని, తమ ఆశయాలు మరుగునపడిపోతాయని యువతులు భావిస్తున్నారు. పెళ్లి వల్ల కొత్త ప్రాంతానికి వెళ్ళడం కూడా ఇందుకు కారణం. అలాగే, కెరీర్ లో బ్రేక్ రావడాన్ని ఎవరూ ఇష్టపడరు. ఎంతో కష్టపడి తీర్చిదిద్దుకున్న కెరీర్ ను పోగొట్టుకోవడానికి ఎవరు ఇష్టపడతారు చెప్పండి.

7. అదనపు బాధ్యతలు

7. అదనపు బాధ్యతలు

పెళ్ళితో అదనపు బాధ్యతలు వస్తాయి. పెళ్లితో వచ్చే అదనపు బాధ్యతలను జాగ్రత్తగా చేపట్టాలన్న భయం కూడా నేటి యువతులలో పెళ్ళంటే భయం ఏర్పడడానికి ముఖ్య కారణం. వంట చేయడం, ఇల్లు శుభ్రం చేయడంతో పాటు మిగతా బాధ్యతలు ఎన్నో పెళ్ళితో పాటే వస్తాయి. తన కొడుకుకు పెళ్ళాన్ని తీసుకురావడంతో పాటు తమకు పనిలో సహాయంగా ఉండే కోడల్ని తెచ్చుకోవచ్చన్న ఆలోచనున్న అత్తవారు ఈ కాలంలో కూడా ఉన్నారు. వీటన్నిటి వల్ల పెళ్ళంటే భయం ఏర్పడుతోంది.

8. కొత్త కుటుంబంతో కలవడం

8. కొత్త కుటుంబంతో కలవడం

ఇండియాలో పెళ్ళంటే కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక కాదు రెండు కుటుంబాల కలయిక. సాధారణంగా, పెళ్లి తరువాత ఏర్పడే కొత్త బందుత్వంతో కొత్త కోడలు మెలగడం నేర్చుకోవాల్సి రావడం యువతులకు కొంచెం అసౌకర్యంగా ఉండే అంశం. వారికి అసౌకర్యంగా ఉన్నా, ఎంతో సంతోషంగా, ఆనందంగా కనిపించడం వంటి అంశాలు కష్టసాధ్యంగా ఉంటాయి. వదినగా, కోడలిగా ఇలా కొత్త పాత్రలతో అందరినీ ఆకట్టుకోవాలి. కేవలం ఇవే కాదు, ఆయా పాత్రలకు కలిగిన బాధ్యతలు యువతులకు పెళ్ళంటే భయాన్ని కలిగిస్తాయి.

9. ఐడెంటిటీ మారడం

9. ఐడెంటిటీ మారడం

ఇండియాలో పెళ్ళితో పాటు యువతుల ఇంటి పేరు కూడా మారుతుంది. కొన్ని కమ్మునిటీలలో యువతులు తమ పేరును కూడా మార్చుకోవాలి. దీనిని చాలా పెద్ద ప్రాబ్లెం గా కొంత మంది యువతులు భావిస్తారు. పెళ్ళితో తమ ఐడెంటిటీని మార్చుకోవడం వారికి పెద్ద ఇష్యూగా కనిపిస్తుంది. అందువల్ల పెళ్ళంటే అయిష్టత ఏర్పడుతుంది.

ఈ అంశాలన్నిటినీ మీలో చాలా మంది రిలేట్ చేసుకుని ఉండుంటారు. మీకు మేమిచ్చే సలహా ఏంటంటే, దేని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. ఒకవేళ మీరు ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలని అనుకోకపోతే, కొంత కాలం రిలాక్స్డ్ గా ఉండండి.

English summary

9 Reasons Why Young Indian Women Are Scared Of Marriage

Gone are the days when getting married used to be one of the biggest concerns for Indian women as soon as they reached early 20s. Unlike what most Indian movies still show us, not many Indian women have "getting married" as the only objective of their lives.
Story first published: Saturday, January 17, 2015, 16:46 [IST]
Desktop Bottom Promotion