For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒంటరి జీవితంలో ఎదురైన నష్టాలేంటి?పొందే లాభాలేంటి...

By Super
|

పెళ్ళి చేసుకోవాలా లేదా జీవితాంతం ఒంటరిగానే ఉండాలా అనేది ఒక వ్యక్తి యొక్క ఎంపిక.జీవితం లో కొంత కాలమయినా మనలో చాలా మంది ఒంటరిగా ఉండాలనుకుంటారు.ఒంటరిగా ఉండటం వల్ల లాభ నష్టాలు రెండూ ఉంటాయి. వాటిలో కొన్ని ఇచ్చాము చూడండి.

1.అనుకూలత-స్వాతంత్ర్యము, బాధ్యత తెలియడం

1.అనుకూలత-స్వాతంత్ర్యము, బాధ్యత తెలియడం

ఒంటరిగా ఉండటం మీకు బాధ్యత ని నేర్పి స్వాతంత్రాన్ని కూడా ఇస్తుంది.ఇంకొకరితో కలిసి ఉండటం వల్లా చాలా విషయాలని మీరు టేకిట్ గ్రాంటెడ్ గా తీసుకుంటారు.అదే మీరొక్కరే ఉంటే మీ ఆరోగ్యం గురించి మీరే శ్రద్ధ తీసుకోవాలి. అది గుర్తు చెయ్యడానికి ఎవరూ ఉండరు.మీ గది మీరే శుభ్రం చేసుకుని టైముకి బిల్లులు అవీ కట్టాలి.

2. అనుకూలత-ఫ్యామిలీ గొడవలుండవు

2. అనుకూలత-ఫ్యామిలీ గొడవలుండవు

మీరొంటరి గా జీవిస్తుంటే కనుక అమ్మ,నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముళ్ళతో పోట్లాదటం గురించి మర్చిపోవచ్చు.మీ ఇంట్లో మీరొక్కరే ఉండటం వల్ల అనవసర అపార్ధాలు గొడవలూ ఉండవు.కానీ చాలా మంది ఇలాంటి గొడవల వల్లే కుటుంబ సభ్యుల మధ్య బంధం గట్టి పడుతుందని అంటారు కానీ ఇలాంటి వాటిని నివారించడం ముఖ్యం.

3.ప్రతికూలత-తోడు లేకపోవడం

3.ప్రతికూలత-తోడు లేకపోవడం

ఒంటరి గా ఉండటం లో ముఖ్యమైన ప్రతికూలత తోడు లేకపోవడం,స్నేహితులు ముఖ్యమే కానీ మనకి తల్లి తండ్రులూ, తోబుట్టువులు, జీవిత భాగస్వాములు కూడా అవసరమే.ఒంటరి గా ఉంటే మీకు ఏ బంధాలూ ఉండవు.మీరు మీ తల్లి తండ్రులనీ, తోబుట్టువులనీ,లేదా తాతా బామ్మ లేదా అమ్మమ్మ లని పిలిచినా కొంతసేపు లేదా కొన్ని రోజులు మాత్రమే కదా. ఒకోసారి ఎవరైనా తోడు ఉంటే చక్కటి డిన్నర్ చెయ్యాలనో ఓ మంచి సినిమా చూస్తే బాగుంటుందనో అనిపించవచ్చు.

4.అనుకూలత-నో రూల్స్

4.అనుకూలత-నో రూల్స్

మీరు ఒంటరిగా ఉంటే ఏ నియమాలనీ పాటించక్కర్లేదు.జీవితం లో క్రమ శిక్షణ ముఖ్యమే కానీ ఒకళ్ళు పెట్టిన నియమాలు పాటించి జీవించడం సుఖం కాదు.ఇంటికి ఫలానా సమయానికి రావాలనే నియమాలు లాంటివి ఉండవు మీరు ఒంటరిగా ఉంటే.మీ ఇష్టానుసారం మీకు నచ్చిన నియమాలు పెట్టుకుని జీవించవచ్చు.

5.అనుకూలత-కావల్సినన్ని సేవింగ్స్

5.అనుకూలత-కావల్సినన్ని సేవింగ్స్

మీరొంటరి గా ఉంటే డబ్బు తక్కువ ఖర్చు పెడతారు.మీ మీద ఖర్చు పెట్టుకోవడం తప్ప మీకు వేరొక ఖర్చు ఉండదు.అందువల్ల మీరు బోలెడు డబ్బు ని దాచుకోగలరు.మీ పిల్లలకో లేదా మీతో ఉండే ఇతర కుటుంబ సభ్యులకో డబ్బు ఇవ్వాల్సిన అవసరం ఉండదు.అంటే మీ భవిష్యత్తు కోసం డబ్బు పొదుపు చేసుకోవచ్చు.

6.అనుకూలత-హద్దులు లేని వినోదం

6.అనుకూలత-హద్దులు లేని వినోదం

మీరు కనుక ఒంటరిగా జీవిస్తోంటే టీవీ కట్టెయ్యమని బలవంత పెట్టేవారెవరూ ఉండరు.హాయిగా సోఫా లో కూర్చుని రోజంతా పుస్తకాలు చదువుకోవచ్చు,సౌండ్ ఎక్కువ పెట్టి మీకిష్టమైన సంగీతం వినచ్చు లేదా అర్ధ రాత్రి వరకూ తాగచ్చు.ఒంటరి గా ఉంటున్నారంటే హద్దులు లేని వినోదం అన్నమాటే.

7.ప్రతికూలత-బోరింగ్ జీవితం

7.ప్రతికూలత-బోరింగ్ జీవితం

ఒంటరి గా ఉండటం చాలా సరదాగానే ఉంటుంది కానీ మీకు ఏ వ్యాపకాలూ లేకపోతే జీవితం నిస్సారం గా అనిపిస్తుంది.ఒక్కోసారి మీకు మంచి భోజనం తినాలనిపించొచ్చు లేదా అలా బయటకి వెళ్ళి నడవాలనిపించవచ్చు. కానీ ఒంటరి గా ఉండటం వల్ల మీలో ఉత్సాహం నీరు గారిపోతుంది.

ఒంటరి గా ఉండటంలో ప్రతికూలతలు ఎన్ని ఉన్నప్పటికీ పెళ్ళి చేసుకుంటే జీవితం బాగుంటుందన్న గ్యారంటీ ఏమీ లేదు.ఒంటరి గా ఉండాలా వదా అనేది వ్యక్తిగతమైన నిర్ణయం.మీరొంటరిగా ఉంటారా?? సంతోషం గా ఉన్నారా?? మీ ఆలోచనలని దయచేసి మాతో పంచుకోండి.

English summary

Disadvantages and Advantages of Living Alone

It is absolutely a person’s choice whether to marry or to spend the rest of her/his life alone. Many of us prefer to live alone, even if it’s for some period of our lives. Living alone has its disadvantages and advantages. Here are some of them.
Story first published: Saturday, October 31, 2015, 10:59 [IST]
Desktop Bottom Promotion