For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రిలేషన్ షిప్ పై ఇంటర్నెట్ దుష్ప్రభావాలు

By Super
|

ఇంటర్నెట్ రెండు వైపులా పదునున్న కత్తి వంటిది. ఇంటర్నెట్ ప్రభావం, రిలేషన్ షిప్స్ పై ప్రతికూలంగా కచ్చితంగా ఉంటుందనడంలో సందేహం లేదు. కొన్ని సార్లు, రొమాంటిక్ రిలేషన్ షిప్స్ పై ఇంటర్నెట్ ప్రభావాన్ని శాపంగా పరిగణించవచ్చు.

రిలేషన్ షిప్ పై ఇంటర్నెట్ ప్రభావాలు వివిధ రకాలుగా ఉంటాయి. టెక్నాలజీకి చెందిన విషయాల వల్ల ఎన్నో రిలేషన్ షిప్స్ బ్రేక్ అప్ అవడం సాధారణమయింది. మీరు చేస్తున్నది సరైనదా కాదానన్న విషయాన్ని ఎప్పటికప్పుడు మీరు గమనించుకోవాలి. ఇద్దరి మధ్య సమస్య ప్రారంభమైందన్న విషయం అర్థమయినప్పుడు ఇద్దరూ కలిసి చర్చించుకుని కొన్ని సర్దుబాట్లు చేసుకుని బాంధవ్యం పదిలంగా సాగేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇంటర్నెట్ పై ఎక్కువ సమయాన్ని గడపడం మీ బాంధవ్యాన్ని ఇబ్బందుల పాలు చేస్తుంది. రిలేషన్ షిప్ పై ఇంటర్నెట్ ఎన్ని రకాలుగా విపరీత ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Harmful Effects Of Internet On Your Relationship

సమయం
మీరు అందరితో టచ్ లో ఉండడానికి ఇంటర్నెట్ తో ఎక్కువ సమయం గడుపుతుంటే అదే పెద్ద సమస్యగా మారుతుంది. మీ భాగస్వామితో కాకుండా ఎక్కువ సమయం ఇంటర్నెట్ పై గడిపితే రిలేషన్ షిప్ దెబ్బతినే ఆస్కారాలు ఎక్కువ. పెద్ద పెద్ద సమస్యలు తలెత్తుతాయి. రిలేషన్ షిప్ పై ఇంటర్నెట్ చూపించే ప్రతికూల ప్రభావాలలో ఇది ముఖ్యమైనది.

రొమాంటిక్ జెలసీ
బాంధవ్యాలలో జెలసీ అనేది కచ్చితంగా ఉంటుంది. హానీ కలగనంత వరకు సోషల్ నెట్వర్కింగ్ ను మీరు పరిమితంగా వాడితే ఇబ్బందేం ఉండదు. కాని, ఎప్పుడైతే పరిమితులు దాటతాయో భార్యాభర్తల మధ్య అపార్థాలు చోటుచేసుకుంటాయి. అనవసర అపోహలు ఇబ్బందులను కలిగిస్తాయి. ఈ విషయాన్ని గ్రహించి ఇంటర్నెట్ వాడకానికి పరిమితులను ఎవరికి వారు ఇచ్చుకుంటే మంచిది.

Harmful Effects Of Internet On Your Relationship

భాగస్వామి పర్యవేక్షణ
సోషల్ నెట్ వర్క్ లో నున్న వివిధ ఫీచర్స్ ద్వారా రొమాంటిక్ పార్టనర్ ను పర్యవేక్షించే సౌలభ్యాలు ఎన్నో ఉన్నాయి. వీటిని వాడుకుని భాగస్వామిని పర్యవేక్షించాలని అనుకోవడం ఇబ్బందులను కలిగిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన విధానం కాదు. ఇద్దరి మధ్య నమ్మకం ప్రధాన పాత్ర పోషించాలి. నమ్మకం పోయినప్పుడు రిలేషన్ షిప్ లో నుండడం అర్థం లేని వ్యవహారం.

ట్వీటింగ్
ఒకరితో ఒకరు కమ్యునికేట్ చేసుకోవడానికి త్వీటింగ్ ని వేదికగా చేసుకునే జంటలు కూడా ఉన్నారు. ఇది సరైన పద్దతి కాదు. మీ మధ్యనున్న పెర్సనల్ కాన్వర్సేషన్ ను పబ్లిక్ గా చేయడం వల్ల ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలా పబ్లిక్ ట్వీటింగ్ వల్ల విడాకులు కూడా తీసుకున్న జంటలున్నాయని అధ్యయనాలు చెప్తున్నాయి. ఇది కూడా రిలేషన్ షిప్ పై ఇంటర్నెట్ చూపించే ప్రతికూల ప్రభావం.

మాజీ
టెక్నాలజీ వల్ల కమ్యునికేషన్ సమస్య తీరిపోయింది. మాజీ ప్రేమికులతో కూడా కమ్యునికేట్ చేయడం సులభమవుతుంది. మీ మాజీలు ఏం చేస్తున్నారో ట్రాక్ చేయడం సులభం. కాబట్టి మాజీలను డిస్కనెక్ట్ చేయడం మంచిది. తద్వారా మీ ప్రస్తుత బాంధవ్యం పదిలంగా ఉంటుంది.

కొత్త స్నేహితులు
సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో కొత్తవారిని కూడా ఫ్రెండ్ గా యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాని తెలియని వారిని ఫ్రెండ్స్ గా యాడ్ చేసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. మీ పెర్సనల్ ఇన్ఫర్మేషన్ ను వారు మిస్ యూస్ చెసే అవకాశాలు ఉంటాయి.

English summary

Harmful Effects Of Internet On Your Relationship

Internet has a lot of pros and cons. But, when it comes to relationships, there is no doubt that internet can have a bad influence on it. Sometimes, for a romantic relationship, the internet can not be considered a boon.
Story first published: Tuesday, January 20, 2015, 16:15 [IST]
Desktop Bottom Promotion