For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక మంచి వర్కింగ్ వైఫ్ గా ఉండటం ఎలా ?

|

ఒక మంచి వర్కింగ్ వైఫ్ గా ఉండటం ఎలా?ఇది మనం అనుకున్నంత సులభం కాదు. ప్రస్తుత రోజుల్లో, చాలా మంది మహిళలు బాగా చదువుకొని, ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే, ఇంట్లో పిల్లలుండే ఇంట్లో అయితే ఒక్కరి సంపాదన సరిపోదు కాబట్టి, భార్య, భర్త ఇద్దరూ సంపాదించాల్సిందే. అప్పుడే ఎటు వంటి సమస్య లేకుండా ఉండాలంటే, భార్య కూడా ఉద్యోగం చేయాల్సిందే. ఈ మోడ్రన్ ప్రపంచంలో ఉద్యోగానికి వెళ్ళేది సమస్య కాదు, టైమ్ మేనేజ్ మెంట్ చాలా సమస్యగా ఉంది. ముఖ్యంగా మీరు పూర్తిగా ఆఫీస్ పనిలో మునిగిపోతే, ఇంటి పనులు వాయిదా పడిపోతే, ఇల్లంతా గందరగోళంగా ఉంటుంది. ఇంకా పిల్లలు కనుక ఉంటే పరిస్థితి మరింత తీవ్రతం అవుతుంది. ఈ పరిస్థితిని మీరు ఎలా ఎదుర్కొంటారు?

ఒక మంచి వర్కింగ్ వైఫ్ గా ఉండటం ఎలా ?ప్రతి ఒక్క సమస్యను సమర్థవంతంగా నిర్వర్థించడానికి మీ దినచర్యను మరింత బెటర్ గా ప్లాన్ చేసుకోవాలి. అందుకోసం ఇక్కడ కొన్ని చిట్కాలున్నాయి. ఇవి మీరు కనుక అనసరించినట్లైతే, మరింతసులభంగా ఇంట్లో, ఉద్యోగంలో సంతోషంగా గడపవచ్చు. ఆఫీస్ లో లాగే, ఇంట్లో కూడా టీమ్ వర్క్ అనేది ముఖ్యం. ఇంట్లో మీ పనుల్లో మీ భర్త కూడా టీమ్ ప్లేయర్ గా మార్చేయండి . అప్పుడే, ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ పనులను సమర్ధవంతంగా నిర్వర్థించుకోగలరు. మరి ఆ టిప్స్ ఏంటో ఒకసారి చూద్దాం...

How To Be A Good Working Wife

మీ వర్క్ లైఫ్ ను సమతుల్యం చేసుకోవడం
అవును, ఇటు ఫ్యామిలి అటు ఆఫీస్ విషయంలో పనిని, పనులను సమతుల్యం చేసుకోవడానికి మెయింటైన్ చేయాలి. మీ కెరీర్ కు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తే , మీ కుటుంబాన్నీ మీరు నిర్లక్ష్యం చేసిన వారు అవుతారు. ఒక వేళ మీరు ఫ్యామిలీ కోసం ఎక్కువ సమయం గడిపితే, మీ బాస్ మీరు వర్క్ నిర్లక్ష్యం చేస్తున్నారని, దాని వల్ల మీ పనిలో మీరు సఫర్ అవుతున్నారని అంటారు . కాబట్టి, రెండింటిని బ్యాలెన్స్ చేయాలి .

How To Be A Good Working Wife

టైమ్ మ్యానేజ్మెంట్ :
వర్క్ చేసే మహిళలు ఒక మంచి భార్యగా ఉండటం ఎలా?రోజూ మీరు పనిచేయాల్సిన పనులను టైమ్ టేబుల్ ను వ్రాసుకోవాలి. ఏఏ పనులు ఏఏ సమయంలో చేయాలో ప్లాన్ చేసుకోండం వల్ల సులభంగా ముగించగలరు, మరియు క్లియర్ గా ఉంటుంది. టైమ్ టేబుల్ ప్రకారం పనులను వేగంగా ముగించవచ్చు . ఇంట్లో చేయాల్సిన మరియు ఆఫీస్ పనులను టైమ్ టేబుల్లో చేర్చాలి . దాంతో మీరు ఏపనికి ఎంత సమయం కేటాయించాలనేది ఒక ఐడియా వస్తుంది.

How To Be A Good Working Wife

వంటలో మీ భర్త యొక్క సహాయం తీసుకోండి:
మీ భర్తను మీ వంటగదిలో సహాయం కోరడంలో తప్పులేదు. మీరు ఇంటికి కొంత ఆధాయాన్ని సమకూర్చినప్పుడు, అతను మీ వంటగదిలో సహయపడుటలో తప్పులదు. అతనితో మాట్లాడి, కొన్ని చిన్న చిన్న పనులను అతనితో చేయించుకోండి. నిజానికి చెప్పాలంటే, భర్తలు వంటగదిలోకి వస్తే ఇద్దరు కలిసి వంట చేస్తుంటే మరింత రొమాంటిక్ గా ఉంటుంది . మీ పనిలో కూడా మీరు ఎంజాయ్ చేయవచ్చు.

How To Be A Good Working Wife

వీకెండ్ లో మీ కుటుంబ సభ్యులతో గడపాలి:
ఒక మంచి వర్కింగ్ ఉహెన్ గా మరియు తల్లిగా ఉండాలంటే ఏం చేయాలి?ఒకవర్కింగ్ఉమెన్ గా , వీకెండ్స్ లో మీ విలువైన సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో ఎక్కువగా గడపాలి. మీ స్నేహితులు, ఆఫీస్ సహోద్యోగులతో గడపడం కంటే మీ భర్త మరియు పిల్లలతో ఎక్కువ సమయం గడపడం చాలా ముఖ్యం. నిజానికి మీ స్నేహితులతో కంటే, మీ కుటుంబ సబ్యులతో వీకెండ్స్ ప్లాన్ చేసుకోవడం ఉత్తమం.

English summary

How To Be A Good Working Wife

How to be a good working wife? It is not so easy. Nowadays, most of the women are in a position where they have to earn something to supplement the family's income. Out of them, some are career oriented too. This is a good trend but the only challenge that arises is time management.
Story first published: Friday, January 16, 2015, 15:59 [IST]
Desktop Bottom Promotion