For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వివాహానికి ముందు మెహంది వేడుక ఎందుకు జరుపుకుంటారు

By Super
|

భారతదేశంలో వివాహాలను చాలా పవిత్రమైన, పవిత్రమైన పనిగా పరిగణిస్తారు. వాటిలో వివాహానికి ముందు, వివాహంలో, వివాహం తరువాత చేయాల్సిన సాంప్రదాయ పనులు విస్తృతంగా ఉన్నాయి. మెహంది వేడుక వివాహానికి ముందు జరిగే సంప్రదాయంలో అతి ముఖ్యమైన వాటిలో ఒకటి.

ఇది చాలా సరదాతో కూడిన సంప్రదాయం, ఇది ప్రధానంగా పెళ్ళికూతురు కుటుంబం వారు జరుపుకుంటారు. వివిధ ప్రాంతాల వారు వారి వారి వివాహ పద్ధతులు, సంప్రదాయాలు, సంస్కృతిల ఆధారంగా వివిధ రకాలుగా ఈ వేడుకను జరుపుకుంటారు. ఈ వేడుక ఆ వ్యక్తుల సంపద, స్టేటస్ మీద కూడా ఆధారపడి ఉంటుంది.

 Mehendi Celebration before marriage

పెళ్ళికూతురు కుటుంబం వారు ఏర్పాటుచేసే ఈ మెహంది వేడుకకు పెళ్ళికూతురు స్నేహితులు, చుట్టాలు వినోదం కోసం అదేవిధంగా పెల్లికుతురుని ఆశీర్వదించడానికి ఈ వేడుకను నిర్వహిస్తారు. ఈ వేడుకను ఎక్కువగా పెళ్ళికూతురు ఇంట్లో నిర్వహిస్తారు లేదా కొన్నిసార్లు పెళ్ళికి కొన్ని రోజుల ముందు లేదా వివాహ వేడుక సమయంలో సమావేశ మందిరాలలో ఏర్పాటు చేస్తారు.
 Mehendi Celebration before marriage

ఈ వేడుకలో వృత్తిపరమైన హెన్న డిజైనర్ లేదా కొంతమంది చుట్టాలు మెహంది ని పెళ్ళికూతురు చేతులకు, పాదాలకు పెడతారు. భారతదేశంలోని కొన్ని ప్రదేశాలలో మెహంది వేడుక మొదటి వేడుకగా నిర్వహిస్తారు లేదా కొన్ని ప్రదేశాలలో అయితే మెహంది వధువు ఆడపడుచుకు పెడతారు, కొన్ని ప్రదేశాలలో మెహంది ని వధువు తల్లికి పెట్టడం పవిత్రంగా భావిస్తారు.

 Mehendi Celebration before marriage

మెహంది లేదా హెన్న వధువు ప్రేమకు మూలమే కాకుండా ఆమె తన ప్రవర్తనతో తన భర్తను ఎలా ఆకర్షిస్తుందో కూడా తెలియచేస్తుంది. కామసూత్ర ప్రకారం, హెన్న స్త్రీలలోని అరవైనాలుగు కళలలో ఒకటి. వధువు మెహంది మూలాంశం శంఖం, పూలు, కలశం, నెమలి, డోలి, బారాత్ నమూనాలు.

 Mehendi Celebration before marriage

ఈ వధువుకు పెట్టె హెన్న లో భర్తపేరు దాగి ఉంటుంది. వధువు చేతిలోని వరుడి పేరును అబ్బాయి గుర్తిస్తే అతని కళ్ళు చురుకైనవిగా, చురుకైన మెదడుతో ఆ అమ్మాయిని ఆకర్షిస్తాడని చెప్తారు. ఈ మెహంది వేడుకను సాధారణంగా సంగీత్ వేడుకలో జరుపుకుంటారు. అందువల్ల, స్త్రీలు ఈ మెహంది సంప్రదాయంలో నృత్యాలు చేస్తారు,సాంప్రదాయ పాటలు పడతారు.

 Mehendi Celebration before marriage


వధువు తేలికైన ఆభారణాలతో లేతరంగు దుస్తులు ధరిస్తుంది. సంప్రదాయం ప్రకారం వధువు మెహంది క్రతువు అయిన తరువాత వివాహం అయ్యేంతవరకు బైటికి వెళ్ళాడు. ఈ హెన్న ఎంత బాగా ఎర్రగా పండితే అంతకన్నా ఎక్కువ తన భర్త, వారి అత్తమామలు ఆమెను అంతబాగా చూసుకుంటారని నమ్ముతారు.

 Mehendi Celebration before marriage

ఈ మెహంది వేడుక వివాహ బంధంలోని ప్రేమ ఎంత గట్టితో, శక్తివంతమైనదో తెలియచేస్తుంది, అది వధువుకు మంచి శకునంగా భావించబడుతుంది. వధువు మెహంది ఎన్ని ఎక్కువరోజులు ఉంటె, ఆమె భవిష్యత్తు అంతకంటే ఎక్కువ శుభప్రదంగా ఉంటుంది.

English summary

Mehendi Celebration before marriage

Weddings in India are considered to be a sacred and sanctified ritual. They are long ritualistic and elaborate affair with lots of pre-wedding, wedding, post wedding ritual. The occasion of Mehendi is one of the most important pre-wedding rituals.
Desktop Bottom Promotion