For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెళ్లంటే కొందరు పురుషులు ఎందుకు వెనుకడుగు వేస్తారో తెలుసా...

మగవాళ్లు "పెళ్లి" అంటే భయపడటానికి కారణాలేంటి ?

By Swathi
|

చాలా మంది మహిళలు వాళ్ల లైఫ్ లో ఏదో ఒకసారి.. తమ బాయ్ ఫ్రెండ్స్ లేదా భర్తల ద్వారా సమస్యలు ఎదుర్కొంటారు. కానీ.. అలానే ఫేస్ చేస్తారు. అయితే.. అబ్బాయిలు మాత్రం మ్యారేజ్ అనే రిలేషన్ విషయానికి వస్తే.. చాలా భయపడిపోతారు. కాదు కాదు.. పారిపోతారు. ఎందుకు ?

చాలావరకు అబ్బాయిలంతా.. అమ్మాయిలకు సైట్ కొట్టడం, ప్రేమించడం, వెంటపడటం వంటి సరదాలను మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ.. పెళ్లి అనే లాంగ్ రిలేషన్ విషయానికి వస్తే.. మాత్రం ఆమడదూరం వెళ్లిపోతారు. అసలు ఎందుకు మగవాళ్లు.. పెళ్లి అనే పదం వింటే.. దాటేయడం, ఇప్పుడే వద్దు అని చెప్పడం, పెళ్లి చేసుకోను అని చెబుతుంటారు ? కారణాలేంటి ?

బాధ్యతలంటే భయం

బాధ్యతలంటే భయం

మగవాళ్లకు ముఖ్యంగా బాధ్యతలంటే భయం. ఫ్యామిలీ, పిల్లలు, భార్య వంటివన్నీ హ్యాండిల్ చేయడం చాలా సందర్భాల్లో బరువైపోతుంది. ముఖ్యంగా వీళ్లంతా అటెన్షన్, ఎమోషన్ ని కోరుకుంటారని భావిస్తారు. కానీ.. అన్ని సందర్భాల్లో ఇదే ఉండదు కదా..

ఫ్యామిలీలో భార్య

ఫ్యామిలీలో భార్య

మగవాళ్ల పెద్ద సమస్య పెళ్లి తర్వాత తన కుటుంబం గురించి. ఒకవేళ సమస్య వచ్చినప్పుడు.. తన కుటుంబానికి సపోర్ట్ చేస్తూ అభిప్రాయం చెప్పాలా, తన భార్య సపోర్ట్ చేయాలా అనేది. ఎవరికి సపోర్ట్ చేసినా.. మరొకరు ఫీలవుతారు.. కాబట్టి.. అసలు పెళ్లే వద్దన్న ఆలోచనలో ఉంటారు.

భార్యల కోరికలు తీర్చలేక

భార్యల కోరికలు తీర్చలేక

ఆడవాళ్లను అర్థం చేసుకోవడం చాలా కష్టం అన్న పదానికి పెళ్లికి ముందు మగవాళ్లు భయపడతారు. తన భార్యను సంతోషపెట్టలేనేమో అన్న భయం ఉంటుంది. ఆడవాళ్ల డిమాండ్స్ తీర్చడానికి భయపడతారు. అందుకే.. వాళ్లతో లైఫ్ లాంగ్ స్పెండ్ చేయడానికి భయపడతారు.

నిర్ణయం తీసుకోవడంలో

నిర్ణయం తీసుకోవడంలో

మ్యారేజ్ తర్వాత.. చాలా విషయాల్లో భార్య అవసరాల్లో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. నిర్ణయం తీసుకోవడంలో తన పవర్ కోల్పోయాడంటే.. తాను పవర్ లెస్ గా ఫీలవడం మొదలుపెడతాడు. ఇలా ఉండాలని మగవాళ్లు కోరుకోరు.

పోలిక ఇష్టపడరు

పోలిక ఇష్టపడరు

కొన్నిసార్లు తన భార్య ఎక్స్ పెక్టేషన్స్ ని రీచ్ అవుతామో లేదో అన్న భయం ఉంటుంది. ఇతరులతో పోల్చడాన్ని మగవాళ్లు ఇష్టపడరు. ఒకవేళ తన భార్య గతంలో తనకు నచ్చిన వ్యక్తులతో పోల్చుతుందేమో అన్న భయం ఉంటుంది.

అలవాట్లు

అలవాట్లు

వాళ్లు ఏది చేయాలనుకుంటే.. అదే చేస్తారు. వాళ్ల అలవాట్లు మార్చుకోవడాన్ని ఇష్టపడరు. బెడ్ పై ఏ సైడ్ పడుకోవాలి అనే దగ్గర నుంచి.. ఏ కలర్ షర్ట్ లో బాగా కనిపిస్తారు అనేదాని వరకు..అలాగే షేవింగ్ విషయంలోనూ అలవాట్లు మార్చుకోవాల్సి వస్తుందన్న భయం ఉంటుంది.

ఒంటరిగా ఉండటానికి కుదరకపోవడం

ఒంటరిగా ఉండటానికి కుదరకపోవడం

అప్పుడప్పుడు ఒంటరిగా ఉండాలని కోరుకుంటాడు. కూర్చోవాలని, రిలాక్స్ అవ్వాలని, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని కోరుకుంటారు. పెళ్లి తర్వాత.. ఇవన్నీ కుదరవని గట్టిగా ఫీలవుతారు. అందుకే పెళ్లంటే.. పరుగెడతారు.

భార్య అనే ట్యాగ్

భార్య అనే ట్యాగ్

పెళ్లి తర్వాత ఎక్కడికి వెళ్లినా.. తన భార్యలను వెంటతీసుకెళ్లాల్సి వస్తుందనే భయం ఉంటుంది.

గొడవలు

గొడవలు

ఒకవ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత లైఫ్ లాంగ్ వాళ్లతోనే అడ్జెస్ట్ అవ్వాలి. కమిట్ మెంట్ లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలి. చాలా విషయాల కోసం గొడవ పడాలి.. వంటివన్నీ మగవాళ్లను పెళ్లి అంటే భయపడేలా చేస్తాయి.

English summary

9 Reasons Why Men Are Scared Of The Word 'Marriage'!

9 Reasons Why Men Are Scared Of The Word 'Marriage'! Most women, at some point in their life, face a problem of their boyfriends or life partners being ‘commitment phobic.
Desktop Bottom Promotion