For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాయ్ ఫ్రెండ్ తో షాపింగ్ కు ఎందుకు వెళ్ళకూడదు...!?

|

సాధారణంగా అమ్మాయిలకు బాయ్ ఫ్రెండ్స్ ఉంటే చాలు ఎక్కువగా షాపింగ్స్ చుట్టేస్తుంటారు ? బాయ్ ఫ్రెండ్ తో షాపింగ్ అంటే ఒక సారి ఆలోచించండి. షాపింగ్ కు అతన్ని తీసుకెళ్ళడం బ్యాడ్ ఐడియా. అబ్బాయిల ముందు అమ్మాయిలు షాపింగ్ చేయడం ఎలా...?

అమ్మాయిల సంగతేంటో కానీ, అబ్బాయిలు మాత్రం అమ్మాయిలతో షాపింగ్ అంటే ఏదో ఒక రీజన్ చెప్పి తప్పించుకుంటుంటారు . అమ్మాయిలతో షాపింగ్ అంటే 90శాతం అబ్బాయిలకు ఇష్టం ఉండదు. అలాంటి అబ్బాయిలను షాపింగ్ కు వస్తారా ? లేదా తీసుకెళతారా అని అడగడం కూడా వేస్ట్. ఎందుకంటే ఇష్టం లేకుండా వారు షాపింగ్ కు వస్తే..మన ఇష్టాలను వారు గౌరవించరు కాదు కదా...అమ్మాయిల్ని షాపింగ్ కూడా చేసుకోనివ్వురు. అలాంటప్పుడు షాపింగ్ కు బాయ్ ఫ్రెండ్స్ కంటే గర్ల్ ఫ్రెండ్సే సేఫ్ అనిపిస్తుంది.

ఇష్టమొచ్చినవి కొనడానికి, ఎక్కువ సమయం గడపడానికి అమ్మాయిలకు గర్ల్ ఫ్రెండ్సే ఫర్ఫెక్ట్ . గర్ల్ ఫ్రెండ్ ను వెంట తీసుకెళ్ళడం వల్ల ఆమె మీకు తోడుగా, సహాయంగా ఉండటమే కాదు, మీరు కొనే వాటి మీద వారి అభిప్రాయాన్ని కూడా తెలుసుకోవచ్చు. అదే బాయ్ ఫ్రెండ్స్ ను అడిగితే మీ ఇష్టం నీకు నచ్చితే నాకు నచ్చినట్లే అని ఒక ఉచిత సలహా పడేస్తుంటారు. అంత మాత్రానికి వారి అవసం ఎందుకు?

సో, లేడీ ఇప్పుడు అర్థమైందా మీరు మీ బాయ్ ఫ్రెండ్స్ తో ఎందుకు షాపింగ్ కు వెళ్లకూడదు అన్న విషయం. ఇదొక్కటే కాదు బాయ్ ఫ్రెండ్ తో షాపింగ్ కు వెళ్ళకపోవడానికి మరికొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి. ఈ ఆర్టికల్ చదివిన తర్వాత ఖచ్చితంగా మీ బాయ్ ఫ్రెండ్ ను మీరు షాపింగ్ కు తీసుకెళ్ళరు. మరి ఆరీజన్స్ ఏంటో తెలుసుకుందాం...

1. మీతో షాపింగ్ కు వచ్చినప్పుడు అతను సహనం కోల్పోతాడు:

1. మీతో షాపింగ్ కు వచ్చినప్పుడు అతను సహనం కోల్పోతాడు:

షాపింగ్ చేయడంలో గర్ల్స్ బిజీగా ఉంటే అబ్బాయిలు సహనం కోల్పోయి, తిరగలేక, ఇక వెళ్తామని వేధిస్తుంటారు. లేదంటే మీరు చూసుకు రండి నేను వెళతానని తరచూ చెబుతుంటాడు. అలాగే ఆమె సెలక్ట్ చేసే మేకప్ మరియు దుస్తుల మీద అవగాహన లేకపోవడం వల్ల కూడా అతని షాపింగ్ చేయాలానే ఇంట్రెస్ట్ ఉండదు.

2. మీకు నచ్చిన కలర్స్ అతనికి నచ్చకపోవచ్చు:

2. మీకు నచ్చిన కలర్స్ అతనికి నచ్చకపోవచ్చు:

షాపింగ్ లో మీకు ఇష్టమైనవి మరియు మీకు నచ్చిన కలర్స్ అతనికి ఇష్టం లేకపోవచ్చు. అతనికి ఎప్పుడు బ్రైట్ గా కనిపించి పింక్, బ్లూ, రెడ్, బ్లాక్, లేదా వైట్ ఇవే చెబుతుంటారు.

3. ట్రెండింగ్ విషయంలో జీరో నాలెడ్జ్ కలిగి ఉంటారు.:

3. ట్రెండింగ్ విషయంలో జీరో నాలెడ్జ్ కలిగి ఉంటారు.:

ఫ్లవర్ ప్రింట్స్, రఫెల్ టాప్స్, బ్రైట్ నియాన్ కలర్స్ ఇలా వివిధ రకాలుగా ట్రెండింగ్ గా ఉండే విషయాలో ఏమాత్రం అతనికి అవగాహన లేకపోవడం వల్ల అతన్ని షాపింగ్ తీసుకెళ్ళీనా వేస్టే...కాబట్టి నెక్ట్స్ టైమ్ మీరు ట్రెండీగా షాపింగ్ చేయాలనుకుంటే బాయ్ ఫ్రెండ్ కు బదులు గర్ల్ ఫ్రెండ్ ను తీసుకెళ్లండి.

4. కామెంట్స్ కు సరిగా ఇవ్వరు:

4. కామెంట్స్ కు సరిగా ఇవ్వరు:

మహిళల షాపింగ్ విషయంలో అబ్బాయిలు అనవసరమైన కామెంట్స్ ఇస్తుంటారు.

5. అతను టైమ్ గుర్తు చేస్తుంటారు:

5. అతను టైమ్ గుర్తు చేస్తుంటారు:

అమ్మాయిలు షాపింగ్ కోసం గంటలు గంటలు సమయాన్ని గడుపుతారు. అబ్బాయిలు అలా కాదు, వారికి నచ్చిన స్పోర్ట్సో, మూవీసో చూడటం లేదా గంటల తరబడి నిద్రపోవడమంటే వారికి చాలా ఇష్టం.

6. మీకు నచ్చినవి అతనికి నచ్చకపోవచ్చు:

6. మీకు నచ్చినవి అతనికి నచ్చకపోవచ్చు:

మీకు నచ్చినవి అతనికి నచ్చకపోవడమో లేదా అంతకంటే మరింత అందంగా ఉన్నవాటిని చూపించి అవి బాగున్నయనడమో మీ మూడ్ ను డైవర్ట్ చేస్తుంటారు. మీరు ఎంత ఇష్టంగా సెలక్ట్ చేసుకొన్నా, వారికోసం త్యాగం చేయక తప్పదు. కొన్ని సందర్బాల్లో అబ్బాయిలకోసం కాంప్రమైజ్ అయ్యి వారికి నచ్చిన వాటిని తీసుకుంటుంటారు.

7. మీరు కొన్న వాటితో వారిని సర్ ప్రైజ్ చేయలేరు:

7. మీరు కొన్న వాటితో వారిని సర్ ప్రైజ్ చేయలేరు:

కొన్ని సందర్బాల్లో వారికి నచ్చిన వాటిని కొనాలనుకొన్నా, వారు మీ వెంట ఉండటంతో మీరు కొనలేక , వారిని సాటిస్ఫై చేయలేరు.

English summary

Here Are 7 Reasons Why You Should Not Shop With Your Boyfriend

So, do you want your man to join you on your shopping spree? Think again, as it may be a bad idea to tag him along, especially when guys and shopping are two poles apart.
Story first published:Wednesday, May 25, 2016, 14:57 [IST]
Desktop Bottom Promotion