For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ రిలేషన్ ఇంతటితో ముగిసిపోయిందని తెలుసుకోవడం ఎలాగ??

By Super
|

ఎవరైనా తమ బంధం కలకాలం నిలవాలనే కోరుకుంటారు. కానీ కొన్ని బంధాలు మధ్యలో ముగిసిపోతాయి, ఆ బంధాన్ని కాపాడుకోవాలని మీరెంత ప్రయత్నించినా కానీ.అలాంటప్పుడు ఇక ఆ బంధాన్ని పట్టుకు వ్రేళాడ్డంలో అర్ధం లేదు.

మీ బంధం బలహీన పడింది అనడానికి మీరు గమనించాల్సిన సంకేతాలు, ఇక మీ ఇద్దరి మధ్యా గత సాన్నిహిత్యం లేదనీ కానీ మీరే ఆ బంధాన్ని పట్టుకు వ్రేళ్ళాడుతున్నారనీ మీరు తెలుసుకోవడం ఎలాగో ఈ ఆర్టికిల్‌లో మేము ఈరోజు క్రింద ఇచ్చాము. మీ బంధం మిమ్మల్ని మరింత బాధ పెట్టకమునుపే దాని నుండి బయటకి రావడం చాలా ముఖ్యం. అలాంటి బంధాలనుండి బయటకి వస్తే మీ కోసం మరింత మంచి వ్యక్తులు బయట ఎదురు చూస్తుంటారు అని మర్చిపోవద్దు.

మీరు కనుక బలహీన పడ్డ బాంధవ్యాన్ని పట్టుకుని ఇంకా వ్రేళ్ళాడితే మిమ్మల్ని మీరు మరింత బాధించుకోవడం తప్ప ఏమీ ఒరగదు.అసలు మీ బంధం బీటలు వారిని అనడానికి గల సంకేతాలు ఏమిటో తెలుసుకున్నాకా కూడా ఇంకా అక్కడే ఉండే కంటే ఆ బంధం నుండి బయటకి రావడం అంత ఉత్తమం ఇంకోటి ఉండదు.

మీ మదిలో సుళ్ళు తిరిగే ప్రశ్నలకి జవాబులే ఈ టిప్స్.

మీరు ఫోర్స్ చేస్తేనే వచ్చి కలవడం:

మీరు ఫోర్స్ చేస్తేనే వచ్చి కలవడం:

ఒక్కోసారి జీవితం యాంత్రికంగా మారినప్పుడు మీరు తెలుసుకుంటారు, ఎప్పుడు మీ ఇద్దరు బయటకి వెళ్ళాలన్నా మీరే ప్లాన్ చేస్తున్నారనై. మీ ప్లాన్స్ కి అవతల వ్యక్తి ఏ మాత్రం ఆసక్తి చూపకపోయినా లేదా తరచూ బిజీ అని తప్పించుకుంటున్నా మీ బంధం త్వరలో కూలిపోతోందనడానికి సంకేతాలు ఇవన్నీ.

మిమ్మల్ని తన కుటుంబానికి పరిచయం చెయ్యకపోవడం:

మిమ్మల్ని తన కుటుంబానికి పరిచయం చెయ్యకపోవడం:

మీ భాగస్వామి యొక్క కుటుంబ సభ్యులకి మీ గురించి తెలిసినా కానీ ఒక్కోసారి మీ భాగస్వామి తన కుటుంబ సభ్యుల నుండి మిమ్మల్ని దూరం పెడుతుంటారు లేదా వారి కుటుంబ విషయాలలో మీ జోక్యం అనవసరం అని భావించినా మీ బంధం పెటాకులవుతోందనడానికి గుర్తులు.

పరిష్కారాలు లేని గొడవలు:

పరిష్కారాలు లేని గొడవలు:

మీ భాగస్వామి మీ గొడవలకి పరిష్కారాలు కనుగొనడానికి కనుక ఆసక్తి చూపించకపోతే వారు ఆ వాదనలో ఇక పాలుపంచుకోదలచుకోలేదనీ లేదా అసలు వాదనకి పరిష్కారం కనుగొనడానికి సుముఖంగా లేరనీ అర్ధం.

సాన్నిహిత్యం లోపిస్తుంది:

సాన్నిహిత్యం లోపిస్తుంది:

కొత్తలో మీ ఇద్దరి మధ్యా బంధం అంతా చాలా అందంగా అనిపిస్తుంది.ఒకళ్ళని ఒకళ్ళు ముట్టుకోవడానికి అప్పట్లో మీకొక కారణం కావల్సి వచ్చేది అంతే,కానీ ఈ మధ్య కనుక ఒకరితో ఒకరు గడపడానికి ఇద్దరూ ఆసక్తి చూపనట్లయితే మీ బంధం బలహీన పడిందనే అర్ధం.

వారి స్నేహితులు మిమ్మల్ని పట్టించుకోరు:

వారి స్నేహితులు మిమ్మల్ని పట్టించుకోరు:

ఇలా కనుక జరుగుతోంటే మీ బంధం సరైన పంధాలో సాగట్లేదని గుర్తు.మీ ప్రియుడు/ప్రియురాలి స్నేహితులు మిమ్మల్ని తప్పించుకుని తిరుగుతారు.అసలు మీ విషయాల మీద ఏమీ కామెంట్ చెయ్యకుండా వారు దూరంగా ఉండటానికి కనుక ప్రయత్నిస్తున్నట్లయితే మీ బంధానికి సంబంధించిన తాజా సమాచారం వారికి తెలిసిందనే అర్ధం.

అబద్ధాలు:

అబద్ధాలు:

మీరు కనుక వారి గురించి అడిగినప్పుడు ఏవేవో కుంటి సాకులు చెప్తారు లేదా తమ గురించి చెప్పడానికి పెద్దగా ఇష్టపడరు.మీరు తన సొంత వ్యవహారాల్లో ఎక్కువ తలదూరుస్తున్నారని భావించి గొడవకి దిగే ఆస్కారం ఉంది. ఇలా కనుక తరచూ జరుగుతుంటే ఇక మీ మధ్య బంధం అంతటితో ముగిసినట్లే అని భావించి ముందుకు సాగిపోవడం మంచిది.

English summary

Signs To Show That It Is All Over

Everybody looks forward to have an everlasting relationship. However, there are a few relationships that do end, no matter how hard you try to save it, it is just not worth holding on to the relationship anymore. In this article, we are here to share some of the tips that make you realise that the relationship is completely over and you are just hanging on to it. It is best to remove the thorn off than allow it to hurt you even more.
Story first published:Saturday, May 21, 2016, 17:36 [IST]
Desktop Bottom Promotion