For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెళ్లి చేసుకునే ముందు ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయాలు !!

By Super
|

పెళ్లి ఎవరి జీవితంలోనైనా చాలా ముఖ్యమైన నిర్ణయమే కాక, ఒక కొత్త ఆరంభానికి తొలి మెట్టు. కాబట్టి పెళ్లి చేసుకునే ముందు మీరు స్పష్టంగా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు వున్నాయి. ఇవి చాలా ముఖ్యమైనవి, ఎందుకంటే ఇవి మీ భాగస్వాములతో అనవసరమైన మనస్పర్ధలను, అపోహలను దూరం చేస్తాయి.

ఈరోజుల్లో విడాకులకు ప్రధానమైన కారణాలు ఏమిటంటే, నమ్మకం లేకపోవడం లేదా అహంకారానికి సంబంధించిన సమస్యలు. ఇవి మీరు ఈ మెట్టు ఎక్కడానికి సిద్ధంగా లేరని మీకు తెలియచేస్తాయి. అందుకే ఇలాంటి గందరగోళం నివారించాలంటే కొన్ని నిర్ణయాల పట్ల మీరు చాలా స్పష్టంగా వుండాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పరస్పర కెరీర్ లక్ష్యాలు

పరస్పర కెరీర్ లక్ష్యాలు

పరస్పర కెరీర్ లక్ష్యాలు అర్ధం చేసుకోవడం ఏ జంటకైనా పునాది లాంటిది. మీ భాగస్వామి లక్ష్యాన్ని అర్ధం చేసుకుని, తెలుసుకుంటే, వారిని మరింత బాగా అర్ధం చేసుకోగలుగుతారు.

పిల్లలు

పిల్లలు

మీ భాగస్వామి నిజంగా పిల్లల్ని కనాలనుకుంటున్నారా లేక మీరు వారిని పెంచడానికి తగినంత పరిణతి చెందారా అన్నది మీరు తెలుసుకోవాలి. ఇలా అయితే, మీ కొత్త బంధం తెచ్చే కొత్త బాధ్యతలను మీరు మరింత చక్కగా అర్ధం చేసుకోగలుగుతారు.

నివసించే ప్రదేశం

నివసించే ప్రదేశం

మీకు పెళ్ళైతే మీరు ఎక్కడ సెటిల్ అవ్వాలనుకుంటున్నారో మీకు స్పష్టంగా తెలియాలి. మీ తల్లిదండ్రులకు దగ్గరగా వుండే మీ ఊళ్లోనో లేక మీ భాగస్వామి సౌకర్యంగా ఉండగలిగే చోట కానీ కావచ్చు.

మతం

మతం

మీరు కులాంతర వివాహం చేసుకుంటుంటే, మీ భాగస్వామి పుట్టిన దగ్గరి నుంచి ఏమి అనుసరిస్తున్నారో అదే చేయనివ్వడం గురించి మీరు స్పష్టంగా వుండాలి. వారిలో ఇది మార్చడానికి మనకు హక్కు వుండదు, ఈ నిజం మీరు అంగీకరించగలిగితే మీరు ముందడుగు వేయవచ్చు.

మీ కలల ఇల్లు

మీ కలల ఇల్లు

ఇది చాలా పెద్ద విషయం. దీని గురించి మీరు మీ భాగస్వామితో చాలా స్పష్టంగా వుండాలి. కొంత మందికి తమ సొంత ఇల్లు ఏర్పరుచుకోవాలని వుంటుంది, మరి కొంత మంది అటూ ఇటూ తిరుగుతూ కొత్త స్థలాలు చూడాలనుకుంటారు. మీరిద్దరూ ఈ విషయంలో ఏకాభిప్రాయంతో లేకపోతే, దీని గురించి ఆలస్యం కాక ముందే మీ భాగస్వామితో చర్చించండి.

ఇంటి పనుల పంపకం

ఇంటి పనుల పంపకం

కేవలం ఇంటి పనుల గురించి మీరు పెళ్లి చేసుకోవడం లేదు కనుక, ఇది మీరు ఇద్దరూ ఖచ్చితంగా పెళ్లికి ముందే స్పష్టంగా తెచ్చుకోవాల్సిన విషయం. అది ఇద్దరికీ సమాన బాధ్యత. ఈ ఆలోచన మీకు నచ్చకపోతే, మీరు పెళ్లికి బదులు ఒక పని మనిషి కోసం వెతుక్కోవడం మంచిది !

English summary

Things To Think About Before Getting Married

Things To Think About Before Getting Married. Marriage is a very important decision in anyone's life as well as it is a stepping stone to a new beginning. Before you take the plunge, there are certain things that you'll need to be clear on.
Story first published: Monday, May 2, 2016, 14:08 [IST]
Desktop Bottom Promotion