For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లవ్ మ్యారేజ్ కి పేరెంట్స్ ని ఒప్పించే అమేజింగ్ ఐడియాస్.. !!

By Swathi
|

మీరు ప్రేమలో ఉన్నారా ? మీ పెళ్లికి పేరెంట్స్ ని ఎలా ఒప్పించాలి అని హైరానా పడుతున్నారా ? వాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారా ? ఓకే టెన్షన్ అవసరం లేదు. మీ లవ్ ని పెళ్లి దాకా తీసుకెళ్లడానికి సింపుల్ అండ్ అమేజింగ్ ఐడియాస్ ఉన్నాయి. చాలాకాలంగా రిలేషన్ లో ఉన్న పార్ట్ నర్ తో లైఫ్ లాంగ్ గడపాలంటే నెక్ట్స్ లెవెల్ పెళ్లి. అయితే పేరెంట్స్ ఒప్పించడం అనేది కూడా బిగ్ టాస్క్.

భార్య గురించి భర్త ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు

మీరు ఎంచుకున్న, ప్రేమలో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అనేది అంత సులభం కాదు. ముఖ్యంగా ట్రెడిషన్స్, సెంటిమెంట్స్, సమాజం గురించి ఆలోచించే కుటుంబాలను ఒప్పించడం కొద్దిగా కష్టమైన పనే. దీనికి చాలా ఓర్పు అవసరం. ప్రేమలో పడ్డారంటే.. క్లాస్, క్యాష్ట్, మతం, కులం, ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్, స్టేటస్ ఏదీ పట్టించుకోరు.

మీ బంధాన్ని మరింత అన్యోన్యంగా మార్చే మ్యాజికల్ ఐడియాస్

ఇదే చాలామంది కుటుంబాలకు ప్రేమికులకు సమస్యగా మారేది. ఇలాంటప్పుడు చాలా జాగ్రత్తగా, ఆచితూచి అడుగేయాలి. ఈ విషయాన్ని మీ పేరెంట్స్ కి తీసుకెళ్లే విధానాన్ని బట్టి.. వాళ్లు స్పందిస్తారు. కాబట్టి.. మీ లవ్ మ్యారేజ్ కి తల్లిదండ్రులను ఒప్పించే.. సింపుల్ ఐడియాస్ మీకోసం..

నమ్మకం

నమ్మకం

మీ పేరెంట్స్ కి క్లోజ్ గా ఉండేవాళ్లలో నమ్మకం కుదర్చండి. మీ పేరెంట్స్ తో పాటు.. మీకు సపోర్ట్ చేసేవాళ్లు కంపల్సరీ ఉండాలి. మీ బ్రదర్స్ లేదా సిస్టర్స్, గ్రాండ్ పేరెంట్, మామయ్య లేదా అత్తయ్యా, లేదంటే మీ ఫ్యామిలీకి బాగా క్లోజ్ ఉండేవాళ్లలో మీపై నమ్మకం క్రియేట్ చేయాలి.

హింట్స్

హింట్స్

ఎంత వీలైత అంత, అన్ని సార్లు అరేంజ్ మ్యారేజ్ కంటే లవ్ మ్యారేజెస్ మంచివని మీ తల్లిదండ్రులకు హింట్ ఇవ్వండి. దీనివల్ల మీరు మీ పార్ట్ నర్ గురించి చెప్పినప్పుడు ఎక్కువ సర్ ప్రైజ్ అవరు. అర్థం చేసుకునే ఛాన్స్ ఉంటుంది.

మంచి ఫ్రెండ్ గా పరిచయం

మంచి ఫ్రెండ్ గా పరిచయం

ఫ్యామిలీ మొత్తం ఎక్కడైనా బయటకు వెళ్లినప్పుడు మీ పార్ట్ నర్ ని కలిసేలా ప్లాన్ చేయండి. అప్పుడు మీ భాగస్వామిని చాలా మంచి ఫ్రెండ్ గా మీ పేరెంట్స్ కి పరిచయం చేయండి. అప్పుడు ఇష్టాయిష్టాల గురించి, అలవాట్ల గురించి మాట్లాడుకునేలా జాగ్రత్త పడండి.

ఫ్రెండ్ గురించి

ఫ్రెండ్ గురించి

మీ సమయం, సందర్భం దొరికినప్పుడల్లా.. మీ ఫ్రెండ్ గురించి ప్రస్తావన తీసుకుని.. వాళ్ల గురించి మంచి విషయాలు మీ తల్లిదండ్రులకు చెప్పండి. దీనివల్ల వాళ్లపై మీ ఫ్యామిలీలో మంచి అభిప్రాయం ఏర్పడుతుంది.

వివరణ

వివరణ

ఇప్పుడు మీ నిర్ణయాన్ని మీ తల్లిదండ్రులకు చెప్పాల్సిన సమయం వచ్చింది. ఒకవేళ వాళ్లు మీ ప్రేమను తిరస్కరిస్తే.. వాదించకుండా.. ఎందుకు తిరస్కరిస్తున్నారనే విషయాన్ని గ్రహించండి. ఓర్పుగా విని.. వాళ్లు చెప్పే భయం, కారణాలపై వివరణ ఇవ్వండి.

అంచనావేయడం

అంచనావేయడం

ఎక్కువగా వాదించడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు. ప్రతి తల్లిదండ్రులకు వాళ్ల పిల్లల పెళ్లిపై అంచనాలుంటాయి. కాబట్టి.. దాని గురించి ఆలోచించడానికి వాళ్లకు కాస్త సమయం ఇవ్వాలి. వాళ్లకున్న సమస్యలు, సందేహాలను మీ పార్ట్ నర్ ని అడిగి పరిష్కరించుకోవాలి. అప్పుడే మీ లవ్ మ్యారేజ్ సక్సెస్ అవుతుంది.

లవ్ మ్యారేజెస్

లవ్ మ్యారేజెస్

మీ ఫ్యామిలీలో సక్సెస్ అయిన లవ్ మ్యారేజెస్ లిస్ట్ తయారు చేసి.. వాటి గురించి ప్రస్తావించండి. ఇలాంటి స్టోరీస్, ఉదాహరణలు వివరిస్తూ... మీ పేరెంట్స్ ని కన్వీన్స్ చేసే ప్రయత్నం చేయండి.

English summary

Ways To Convince Parents For A Love Marriage

Ways To Convince Parents For A Love Marriage. Here are some of the best tips to convince your parents for your marriage, have a look.
Story first published:Monday, May 23, 2016, 16:53 [IST]
Desktop Bottom Promotion