For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భార్య గురించి భర్త ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు

By Swathi
|

భార్యను చూసుకునే విధానాన్ని బట్టి మీ మీద ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. మీరు ఎలాంటి మగవాళ్లో అర్థమవుతుంది. మీ జీవిత భాగస్వామిని ప్రేమించడం ఎంత ముఖ్యమో విలువ ఇవ్వడం కూడా అంతే ముఖ్యమైనది. అప్పుడే మీ వైవాహిక జీవితం కలకాలం అన్యోన్యంగా ఉంటుంది. అప్పుడే మీ జంట చూడముచ్చటగా ఉంటుంది.

మీపై వర్ణించలేని, బయటపెట్టలేనంత ప్రేమించే వ్యక్తి, మీ గురించే అనుక్షణం కేర్ తీసుకునే భార్య గురించి భర్త ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా.. మీకు తోడూ నీడగా ఉండే భార్యకు తగిన స్థానం ఇవ్వాలి. మీరిద్దరూ ఒకే టీం అని గుర్తించాలి. కాబట్టి ప్రతి విషయాన్ని ఇద్దరూ చర్చించుకోవడం, మాట్లాడుకోవడం చాలా ముఖ్యమైనది.

What A Husband Needs To Know About His Wife

భార్యను సంతోషపెట్టడం, తన సంతోషం కోసం పాటు పడటం చాలా ముఖ్యమని భర్తగా గుర్తించాలి. కాబట్టి భార్య గురించి భర్త తెలుసుకోవాల్సిన ఖచ్చితమైన విషయాలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఇష్టాయిష్టాలు తెలుసుకోవడం

ఇష్టాయిష్టాలు తెలుసుకోవడం

భర్తగా భార్య ఇష్టాయిష్టాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆహారం, కలర్, సినిమాలు, ఫ్రెండ్స్, బుక్స్, డ్రెస్, ప్రదేశాలు, సెంటిమెంట్స్, రొమాంటిక్ ఎక్స్ పెక్టేషన్స్ ఇలా.. ప్రతి ఒక్కటీ తెలుసుకోవడం చాలా అవసరం. అలాగే మీ భార్యకు ఏది నచ్చదో తెలుకుని.. ఆ పనికి దూరంగా ఉండటం కూడా చాలా అవసరం.

MOST READ:ఉన్నట్టుండి ఇబ్బంది పెట్టే హార్ట్ బర్న్ నివారించే ఎఫెక్టివ్ రెమిడీస్..!MOST READ:ఉన్నట్టుండి ఇబ్బంది పెట్టే హార్ట్ బర్న్ నివారించే ఎఫెక్టివ్ రెమిడీస్..!

రక్షణగా ఉన్నానన్న భావన

రక్షణగా ఉన్నానన్న భావన

భార్య ఫీలింగ్స్ అర్థం చేసుకోవడం భర్తకు చాలా ముఖ్యం. తన ఫిజికల్, ఎమోషనల్ ఫీలింగ్స్ ని, అవసరాలను తీర్చడం చాలా అవసరమని సైకాలజిస్ట్ లు చెబుతున్నారు. ఒక చిన్న టెక్ట్స్ మెసేజ్.. మీరు ఆమెను ఎంతగా ప్రేమిస్తున్నారు, ఎంతగా కేర్ తీసుకుంటున్నారు, ఎంత రక్షణ కల్పిస్తున్నారు అనేది వివరిస్తుంది. అలాగే ఫోన్ చేయడం వల్ల కూడా తనను చాలా సంతోషపెడుతుంది.

గౌరవం

గౌరవం

మీ జీవితంలో భాగమైనందుకు మీరు తనను ఎంతగా గౌరవిస్తున్నారనేది చాలా ముఖ్యం. మీ స్నేహితుల ముందు, అలాగే.. మీరు వ్యక్తిగతంగా ఉన్నప్పుడు మీ నుంచి గౌరవం చాలా అవసరం.

హెల్ప్

హెల్ప్

తనపై పని ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఎవరైనా సహాయం చేస్తే బావుంటుందని భావిస్తుంది. అలాంటప్పుడు మీరు కాస్త హెల్ప్ చేస్తే.. చాలా రిలాక్స్ ఫీలవుతుంది.

డ్రీమ్స్

డ్రీమ్స్

మీ భార్య కలలు, ఆశయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. అలాగే.. అవసరమైతే.. మీరు సలహాలు, సూచనలు అందివ్వాలి.

కొంత సమయం

కొంత సమయం

మీ భార్యతో ఒంటరిగా రొమాంటిక్ డిన్నర్ ప్లాన్ చేయండి. వీకెండ్ లో ట్రిప్స్, మూవీస్ ప్లాన్ చేస్తే.. తనకు మీరు ఎంత ప్రత్యేకమో అర్థమవుతుంది. అలాగే తనపై మీకు ఎంత ప్రేమ ఉందన్న విషయాన్ని.. చెప్పడం ద్వారా మీ రిలేషన్ మరింత స్ట్రాంగ్ అవుతుంది.

MOST READ:సెక్స్ లో ఎక్కువ సేపు పాల్గొనాలంటే ఈ 40 రకాల ఆహారాలు అవసరం MOST READ:సెక్స్ లో ఎక్కువ సేపు పాల్గొనాలంటే ఈ 40 రకాల ఆహారాలు అవసరం

మీ ప్రాధాన్యత

మీ ప్రాధాన్యత

మీ జీవితాంతం మీతో గడపాల్సిన.. మీ జీవితాంతం మీకు తోడుగా ఉండే భార్యకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం చాలా అవసరం. అలాగే ఇద్దరూ ఒకరి ఇష్టాలు ఒకరు తెలుసుకుని.. సంతోషంగా గడపడం వల్ల.. ఇద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది.

English summary

What A Husband Needs To Know About His Wife

What A Husband Needs To Know About His Wife. It is often said that the way you treat your wife determines the kind of man you are.
Desktop Bottom Promotion