For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాహుబలి నుండి మనం నేర్చుకోవాల్సిన 10 గుణ పాఠాలు..!!

|

దేశవ్యాప్తంగా ప్రజలు ఈ కధకు ఎందుకు అనుసంధానమయ్యారు? బహుశ ఇది మానవుని అనుబంధాల గురించి కాబట్టి అయి ఉండవచ్చు! ఇక్కడ ఈ కధ నేర్పిన కొన్ని అనుబంధ పాఠాలు ఇవ్వబడ్డాయి!

ప్రతి ఒక్కరూ బాహుబలి కధతో సంబంధం ఉండి ఉంటారు. దేశవ్యాప్తంగా ప్రజలు ఈ కధకు ఎందుకు అనుసంధానమయ్యారు? బహుశ ఇది మానవుని అనుబంధాల గురించి కాబట్టి అయి ఉండవచ్చు!

మదర్స్ డే స్పెషల్ : వెండితెరపై 'అమ్మ' ప్రేమ కురిపించిన నటీమణులకు జోహార్లు..!!మదర్స్ డే స్పెషల్ : వెండితెరపై 'అమ్మ' ప్రేమ కురిపించిన నటీమణులకు జోహార్లు..!!

ఇదంతా భావోద్వేగాలకు సంబంధించింది. ఇది మనిషి అనుకూల, ప్రతికూల ఆలోచనల గురించి తెలియచేస్తుంది. వ్యక్తి అనుబంధాలు చాలా సున్నితంగా, అందంగా ఉంటాయి; కానీ అహం, దురాశ కలిగి ఉంటే, ప్రతిదీ నాశనం అవుతుంది!


మనవ అనుబంధాలలో ప్రత్యేకంగా ఈ కధ ఏమి మీకు నేర్పుతున్దోనని ఆశ్చర్యపోతున్నారా? ఇక్కడ కొన్ని క్విక్ లెసెన్స్ ఉన్నాయి...

 మహిళలకు తమ భాగస్వామిని ఎంపిక చేసుకునే హక్కు ఇవ్వాలి

మహిళలకు తమ భాగస్వామిని ఎంపిక చేసుకునే హక్కు ఇవ్వాలి

ఈ కధలో శివగామి దేవసేన ఇష్టాలు లేదా కోరికలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకుండా తన కొడుకును పెళ్ళిచేసుకోమని బలవంతం చేయడానికి ప్రయత్నం చేసిన తరువాత మాత్రమే ఈ కధలో కష్టాలు ప్రారంభమయ్యాయి.

అమ్మాయిల ఇష్టాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకుండా తమకూతురిని ఎవరో ఒకరికి బలవంతంగా పెల్లిచేయడానికి ప్రయత్నించే తల్లిదండ్రులకు ఇది ఒక పాఠం.

అహం ఎలాంటి అనుబంధన్నైన నాశనం చేస్తుంది .

అహం ఎలాంటి అనుబంధన్నైన నాశనం చేస్తుంది .

శివగామి తెలివైన, సమర్ధవంతమైన మహిళ. అయినప్పటికీ, దేవసేన ఆమెను ఎదుర్కున్నపుడు, ఆమె తప్పులను ఎత్తి చూపినపుడు, ఆమె మనసు అహం ఆవహించి, బాహుబలి, దేవసేన ల అనుబంధాన్ని కత్తిరించింది.

న్యాయం అనే భావన అన్నిటికంటే గొప్పది!

న్యాయం అనే భావన అన్నిటికంటే గొప్పది!

అతని భార్య, తల్లి మధ్య వాదన జరిగినపుడు, బాహుబలి ఎవరో ఒకరికి మద్దతు ఇవ్వడానికి బదులు న్యాయాన్ని ఎంచుకున్నాడు.

పాఠం? ఎవరైనా వాదించుకుంటుంటే పక్కకు తప్పుకోవద్దు. పరిస్ధితులతో సంబంధం లేకుండా న్యాయం, ధర్మం వైపు నిలబడండి!

 ప్రేమ, కనికర౦ మాత్రమే మనసుని గెలుచుకుంటాయి; పదవి కాదు!

ప్రేమ, కనికర౦ మాత్రమే మనసుని గెలుచుకుంటాయి; పదవి కాదు!

భల్లాలదేవ శక్తివంతమైన సింహాసనాన్ని అధిష్టించినప్పటికీ, ప్రజలు బాహుబలిని మాత్రమే ప్రశంసించారు! కేవలం కనికరం మాత్రమే ఇతరుల మనసులో స్థానం సంపాదించుకుంటుంది అని తెలియచేసింది; పదవి, హోదా లేదా డబ్బు కాదు!

ప్రజలు మీ మనసుని విషం చేయవచ్చు

ప్రజలు మీ మనసుని విషం చేయవచ్చు

శివగామి వంటి తెలివైన వ్యక్తీ కూడా తప్పుదారి పట్టింది. ఆమె మనసు తన భర్త, కొడుకు వల్ల విషంతో నిండిపోయింది (దానివల్ల ఆమె ఒక మంచి మనిషిని చంపాలనే నిర్ణయం తీసుకుంది!)

ప్రతికూల ఆలోచనలు ఉన్న ప్రజలు ఎవరి మనసునైనా కలుషితం చేస్తారు.

వారి మాటలు వినాశకరంగా ఉంటాయి. ప్రతికూల స్వభావం కల వారికి దూరంగా ఉండండి!

 స్త్రీలు మంచి పాలకులు!

స్త్రీలు మంచి పాలకులు!

స్త్రీలు మంచి నిర్వాహకులు. శివగామి పరిపాలనకు ముందు ప్రజలు ‘మాహిష్మతి’ రాజ్యంలో చాలా సంతోషంగా ఉన్నారు. భాల్లాలదేవ ఆ పదవిని చేపట్టిన తరువాత, ఆరాజ్యం గౌరవాన్ని కోల్పోయింది! పాఠం? సరే, మహిళలు తమ ఉద్యోగాల్లో మంచిని పొందడానికి వీలు కల్పించేవారు.

పదవి కోసం ప్రజలు దురాశతో క్రూరమైన పనులు చేస్తారు

పదవి కోసం ప్రజలు దురాశతో క్రూరమైన పనులు చేస్తారు

వెనుకబాటుతనం, కష్టాలు, యుద్ధాలు ఈ కధలో జరిగిన అన్ని విషాదాలూ ప్రజలు దురాశతో అధికారాన్ని పొందడానికి కారణమయ్యాయి.

మనం దీని నుండి ఏమి నేర్చుకోవాలి? దురాశ కేవలం కష్టాలను శ్రుష్టిస్తుంది. మనం దేనికి అర్హులం కామో దానికి ఎగబడకుండా శాంతి మాత్రమే రక్షిస్తుంది.

తోబుట్టువుల మధ్య శత్రుత్వం పునాదులను కాల్చేస్తుంది!

తోబుట్టువుల మధ్య శత్రుత్వం పునాదులను కాల్చేస్తుంది!

ఈకధ ఇద్దరు పోరాడుకునే సోదరుల చుట్టూ నడుస్తుంది. సోదరుల మధ్య ఆరోగ్యకరమైన పోటీ పర్లేదు; కానీ అది శత్రుత్వంగా మారితే, చివరికి తోబుట్టువులు శత్రువులుగా మారితే, ఒకరినోకరిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది!

గుడ్డినమ్మకం ఎవరినైనా కత్తిపోటు పొడుస్తుంది

గుడ్డినమ్మకం ఎవరినైనా కత్తిపోటు పొడుస్తుంది

చివరికి హీరో బాహుబలి కూడా కత్తిపోటుకు గురయ్యాడు. ఎందుకు? గుడ్డి నమ్మకం!

పాఠం ఏమిటి? సరే, మీరు ఎవరినైనా గుడ్డిగా నమ్మేటపుడు వారి మనోభావాలను తెలుసుకోండి.

మీ పాపాలు మిమ్మల్ని అంతం చేయడానికి వెనక్కు తిరిగి వస్తాయి!

మీ పాపాలు మిమ్మల్ని అంతం చేయడానికి వెనక్కు తిరిగి వస్తాయి!

మానవ సంబంధాలలో దేన్నీ ఒప్పందంగా తీసుకునే అవసరం లేదు. మీరు ఇప్పుడు

ఎవరినైనా బాధపెడితే, ఏదోకరోజు, అదే మీకు జరుగుతుంది!

భాల్లాలదేవ నాశనం అయింది అలాగే. కధ చివరలో అతను నాశనం అవడానికి ప్రధాన కారణం అతని క్రూరమైన పనులే.

English summary

10 Relationship Lessons We Can Learn From Bahubali

Why did people all over the country get connected to this story? Maybe, because it is all about human relationships! Here are some relationship lessons this story teaches us!
Desktop Bottom Promotion