For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లవ్ వర్సెస్ అటాచ్మెంట్ ..!!

ప్రేమ వేరు అనుబంధం వేరు. ఒక్కోసారి ప్రేమ లేని అనుబంధాన్ని ప్రేమగా పొరబడే అవకాశం ఉంటుంది.ఒక వ్యక్తి తో అనుబంధం పెనవేసుకోవడంలో తప్పు లేదు అది మెల్లగా ప్రేమగా రూపాంతరం చెందితే ఆ ఇద్దరు వ్యక్తులూ గాఢంగా ప

By Lekhaka
|

ప్రేమ వేరు అనుబంధం వేరు. ఒక్కోసారి ప్రేమ లేని అనుబంధాన్ని ప్రేమగా పొరబడే అవకాశం ఉంటుంది.ఒక వ్యక్తి తో అనుబంధం పెనవేసుకోవడంలో తప్పు లేదు అది మెల్లగా ప్రేమగా రూపాంతరం చెందితే ఆ ఇద్దరు వ్యక్తులూ గాఢంగా పెనవేసుకుపోతారు.

అనుబంధాలు మనకి చాలా పాఠాలే నేర్పుతాయి.అనుబంధం మొదట్లో చాలా తీయగా ఉంటుంది.కానీ కాలం గడిచేకొద్దీ అదొక వ్యసనంగా మారి అభద్రతనీ,ద్వేషాన్నీ కలుగచేస్తుంది.అసలు ప్రేమకీ, ప్రేమలేని అనుబ్నధానికీ గల తేడాలేమిటో చూద్దామా.

ప్రేమ వర్సెస్ అనుబంధం ..!!

ప్రేమ వర్సెస్ అనుబంధం ..!!

1.మీరు ఎవరితో అయినా ప్రేమలో ఉంటే వారి మీద మీకు కేవలం అనుకూలా భావాలే ఉంటాయి.కానీ అది ప్రేమ లేని అనుబంధమయితే ఆ వ్యక్తి మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతారేమో అని ఒక రకమైన ఆందోళన, అభద్రత,భయం ఉంటాయి.

ప్రేమ వర్సెస్ అనుబంధం ..!!

ప్రేమ వర్సెస్ అనుబంధం ..!!

2.ప్రేమలో నిస్వార్ధత ఉంటుంది కానీ ప్రేమ లేని అనుబంధంలో స్వార్ధం దాగి ఉంటుంది.మీ భాగస్వామి ఎప్పుడూ మీ దగ్గరే ఉండాలనే గాఢమైన కోరిక ఉంటుంది ప్రేమ లేని అనుబంధంలో.

ప్రేమ వర్సెస్ అనుబంధం ..!!

ప్రేమ వర్సెస్ అనుబంధం ..!!

3.ప్రేమలో ఒకరకమైన సొబగు ఉంటుంది దాని వల్ల మీరిద్దర్రూ కూడా జీవితంలో ఎదగగలరు.కానీ ప్రేమ లేకపోతే మీ భాగస్వామి మీకు అంగుళం దూరం జరిగినా భరించలేరు.

ప్రేమ వర్సెస్ అనుబంధం ..!!

ప్రేమ వర్సెస్ అనుబంధం ..!!

4.ప్రేమలో మీకు స్వతంత్రత ఉంటుంది కాని అది ప్రేమ లేని ఒక అనుబంధం మాత్రమే అయితే నా భాగస్వామి నాకే సొంతమనే స్వార్ధం ఉంటుంది. వారు వేరెవరితో కాసేపు సమయం గడిపినా మీరు అభద్రతా భావానికి గురవుతారు.

ప్రేమ వర్సెస్ అనుబంధం ..!!

ప్రేమ వర్సెస్ అనుబంధం ..!!

5.ప్రేమ వల్ల మీరు మీ భాగస్వామి మీ పక్కన ఉన్న లేకపోయినా వారికోసం ఏమైనా చెయ్యాలనిపిస్తుంది కానీ అది కేవలం ప్రేమ లేని అనుబంధమే అయితే మీ భాగస్వామి మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా వారి కోసం ఏదైనా చెయ్యాలనిపిస్తుంది.

ప్రేమ వర్సెస్ అనుబంధం ..!!

ప్రేమ వర్సెస్ అనుబంధం ..!!

6.ప్రేమ వల్ల జీవితం ఆనందమయమవుతుంది కాని కేవలం అనుబంధమే అయితే కొంత కాలం తరువాత జీవితం దుర్భరమవుతుంది

English summary

Love Vs. Attachment

Sometimes, it is easy to confuse attachment with love. Though there is nothing wrong in getting attached, sooner or later, it is better to graduate to love as attachment binds us more.
Story first published: Saturday, February 4, 2017, 17:05 [IST]
Desktop Bottom Promotion