For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు సూపర్ కోడలని, అనిపించుకోవాలనుకుంటున్నారా?

By Super
|

మహిళలకు పెళ్లి తర్వాత ఒక పెద్ద సవాల్ వంటిది . భర్తతో పాటు, అత్త మామలు, వారి ఇంట్లో ఇతర కుటుంబ సభ్యులతో కలిసిపోవడం అనేది కొంచెం కష్టమైన పనే. ఈ విషయంలో పాట్నర్స్ ఇద్దరికీ వర్తిస్తుంది. అయితే ఎక్కువగా ప్రభావితం అయ్యేది మాత్రం మహిళలే.

కొన్ని పరిశోధలన ప్రకారం పెళ్లి తర్వాత మహిళలు వారి అత్తగారి వల్ల సమస్యలను ఎదుర్కోవడం అనేది సహాజం. పెళ్ళైన తర్వాత తల్లి, భార్య మద్య భర్త కూడా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. అయితే తెలివిగల, లేదా సమర్థులు చాలా తెలివిగా నడిపిస్తుంటారు. అత్తగారు చెప్పడు మాటలు లేదా ప్రోద్బలంతో సమస్యలు మరియు ఆందోళనలను ఎదుర్కోవల్సి వస్తుంది. అయితే వాటిని అనుకూల వైఖరిగా మార్చుతకొని సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లైతే మీకు ఎటువంటి సమస్య ఉండదు. ముఖ్యంగా మహిళలు మీ తల్లిదండ్రులలాగే, భర్త యొక్క తల్లిదండ్రులు కూడా, కాబట్టి, పెద్దవారికి మర్యాద ఇవ్వడం చాలా అవసరం మరియు ముఖ్యం కూడా..

మీ అత్తగారితో మీ సంబంధాన్ని బలపరుచుకోవడానికి కొన్ని చిట్కాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

అనుకూల వైఖరి కలిగి ఉండాలి:

అనుకూల వైఖరి కలిగి ఉండాలి:

ఒక కోడలిగా ఉండటం అనేది మీకు కొత్తగా ఉండవచ్చు. అదే విధంగా అత్త పాత్ర కూడా ఆమెకు కొత్తగా ఉండవచ్చు. కాబట్టి, ఆమెతో ఉన్నప్పుడు, ఎప్పుడూ ఆమెకు అనుకూలంగా ఉండాలి. అత్తలు ఎప్పుడూ అన్నింటిలోనూ వారే బెస్ట్ అని అనుకుంటారు. ఆమెకు సరిపోయే విధంగా ఉండాలని ప్రయత్నిస్తుంటారు.

సమానత్వం:

సమానత్వం:

మీ తల్లిలాగే మీ అత్తను కూడా సమానంగా చూసుకోవాలి. ఉదాహరణకు మీరు మీ అమ్మకు బర్త్ డే గిఫ్ట్ కొనిచ్చినప్పుడు, మీ అత్తగారి పుట్టిన రోజుకు కూడా మీరు బహుమతిని అందివ్వండి. మీకు పిల్లలున్నట్లైతే, మీ అమ్మను సందర్శించినట్లే, మీ అత్తగారిని కూడా సందర్శించాలి.

సున్నితత్వం:

సున్నితత్వం:

సహజంగా మహిళలు వారి జీవితంలో చాలా సున్నిత స్వభావం కలిగి ఉంటారు . ముఖ్యంగా మహిళ అత్తపాత్రను పోషించినప్పుడు తన కొడకు ఎప్పుడూ తను చెప్పినట్లే తనకు మాత్రమే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండాలని కోరుకుంటుంది.

అందువల్ల చాలా మంది అత్తలుకోడలిని తనకు పోటీగా భావిస్తుంది. ముఖ్యంగా ఒక్కసంతామే ఉన్నట్లైతే ఇటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. వారి చెప్పినట్లే నడుచుకోవాలి. వారికి నచ్చినట్టే ఉండాలి, అనే చాధస్తాలు ఎక్కువగా ఉంటాయి. వారే కోడలి కంటే ఎక్కువ అన్నట్లుగా ప్రవర్థిస్తారు. ఉదాహరణకు : అత్త తన కొడుకు తను చేసే వంటలను చాలా మెచ్చుకొనే వాడని, ఇప్పుడు నీ వంటను అంతగా ఇష్టపడటం లేదనో లేదా అత్తగారి వంటను తప్పుపట్టడం వల్లన ఈ పరిస్థి ఆమెను మరింత బాధకలిగిస్తుంది.

మర్యాద:

మర్యాద:

మీ అత్తగారికి మర్యాద ఇవ్వాలి. ఆమెను వయస్సైనదానిగా లేదా వైజర్స్ గా పరిగణించకూడదు. ఆమె జీవితంలో ఆమె ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని ఉండవచ్చు. నిజానికి, మీరు ఆమెతో మాట్లాడటం మరియు ఆమె యొక్కచిన్నతం గురించి, పెరుగుదల, పిల్లల, వారి పెరుగుదల , మరియు ఆమె యొక్క జీవితాననుభావాల గురించి అడిగి తెలుసుకోవాలి. ఆమె ఎప్పుడైతే ఆమె జీవితాన్ని మీతో పంచుకుంటుందో, అప్పుడు మీరంటే ఆమెకు ఇష్టం కలుగుతుంది. అది మీ ఇద్దరి మద్య సంబంధంను మరింత బలపడేలా చేస్తుంది.

ఎక్స్ పెక్టేషన్స్:

ఎక్స్ పెక్టేషన్స్:

మీరు పెళ్లి చేసుకొన్న తర్వాత వారి గురించి తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి, ప్రతి ఒక్క మహిళ కోడలిగా వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరితో ఆప్యాయతగా పలుకరించండి. వారి కుటుంబంలో ఏఒక్కరినీ బాధించకూడదు. వారికి కూడా మీరంటే ఏమిటో తెలుసుకోవడానికి కొంత సమయం ఇవ్వండి.

చురుకుగా ఉండాలి:

చురుకుగా ఉండాలి:

ఎప్పుడైతే మీ అత్తగారు ఇంట్లో ఉంటారో అప్పుడు మీరు కొంచెం చురుకుగా, చలాకీగా ఉండాలి. కూర్చొని మాట్లాడటం, ఆమె ఏపనిచేస్తున్నా చేదోడు వాదోడుగా సహాయపడటం, మరియు ఆమె మీరు చేసే వంటకాలకు సహాయం చేయాలని వచ్చినప్పుడు సంతోషంగా స్వాగతించడం. ఇలాంటి చిన్న చిన్న విషయాల వల్ల మీరిద్దరు మరింత బెటర్ గా ఒకరిగురించి ఒకరు తెలుసుకోగలుగుతారు, ఇద్దరి మద్య బందాలు కూడా బలపడుతాయి. ఒక వేళ మీరు ఆమెతో కూర్చోవాలని కోరికనప్పుడు, లేదా కాళ్ళు , చేతులు పట్టమన్నప్పుడు, మీ పనుల్లో మీ భర్త సహాయం కోరడంలో తప్పులేదు.

సమాచారం:

సమాచారం:

మీ అత్తగారి దగ్గరి నుండి సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి, ఆమెకు ఫోన్ చేయడం మరియు ఆమెకు కొన్ని ముఖ్యమైన ఈవెంట్స్ తెలియజేడం వంటివి చేయాలి. మీకు పిల్లులున్నట్లైతే, వారి ఫోటోలను మీ అత్తగారికి పంపివ్వడం చేయాలి. గ్రాండ్ మదర్స్ ఎప్పుడూ వారి గ్రాండ్ చిల్డ్రన్స్ ను చూడటానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు.

సలహా:

సలహా:

మీ అత్తగారికి కొన్ని సంవత్సరాల అనుభవం కలిగి ఉంటారు. ఆమె సలహా తీసుకోవడానికి వెనకాడకూడదు. ఆమె సలహాలను అంగీకరించకపోయినా మరియు ఆమె సలహాలను ఏమాత్రం పాటించకపోవచ్చు, కానీ, ఓపెన్ గా ఉండటం వల్ల వివిధ రకాల ఉపాయాలు మనలో మెదలుతాయి. వారి చెప్పే విషయాలు జాగ్రత్తగా వినాలి మరియు ఆమె మాటలకు మార్యద ఇవ్వాలి. వాటిని వ్యక్తిగతంగా తీసుకోకూడదు. ఆమె మీకు సహాయం చేయడానికి మాత్రమే ఉంటుందని గ్రహించాలి.

 పిల్లలు :

పిల్లలు :

మీ పిల్లల గురించి మీ అత్తగారు జాగ్రత్తలు తీసుకోవడానికి అంగీకరించండి. వారు వారి మనవళ్ళు, మనవారాళ్ళు, వారి సొంత బిడ్డలకంటే ఎక్కువ జాగ్రత్తగా చూసుకోగలుగుతారు. గారాభంతో వారి ముద్దచేసి పాడుచేసేది కూడా వారే. కాబట్టి, వారి బెడ్ టైమ్ లో వారివద్ద వదలడం చేయాలి .

కమ్యూనికేషన్:

కమ్యూనికేషన్:

ఇద్దరి మద్య కమ్యూనికేషన్ బాగుండాలి. కుటుంబం గురించి కుటుంబ సభ్యుల గూర్చిమాట్లాడటానికి ప్రయత్నించండి. మీతో ఎవరైనీ ఏమైనా చెప్పి బాధకు గురిచేసి ఉంటే దాన్ని మనస్సులో ఉంచుకొని బాధపడకూదు. మీ అత్తగారితో, భర్తతో మాట్లాడి పరిష్కరించుకోవడం వల్ల మనస్సు కుదుట పడుతుంది.

Story first published: Friday, November 28, 2014, 15:26 [IST]
Desktop Bottom Promotion