For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భార్యభర్తలు ఉద్యోగస్తులైతే?కమ్యూనికేషన్ ఎలా ఉండాలి?

By Mallikajuna
|

చాలా మంది వ్యక్తులకు ఎవరితో ఎలా సంభాషించాలో తెలియదు. ఈ నైపుణ్యం లేకుండా, ఒక వ్యక్తి సన్నిహిత సంబంధంలో విఫులుడు అవుతాడు. తామంతట తాము వ్యక్తపరచుకోలేకపోవడం మరియు మరొకటి వినడంలో సామర్థ్యంలేకపోవడం వల్ల సాన్నిహిత్యం సాధించలేడు. మీ సంభాషణలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా , ఒకరికోసం ఒకరు ఎక్కువ సమయం కేటాయించడం ద్వారా, ఇద్దరి వ్యక్తుల మద్య గౌరవప్రధమైన సంబంధం ఏర్పడుతుంది. తక్కువ సమయం ఉన్నాకూడా, ఒకరికోసం ఒకరు ఇష్టంగా ఉన్నట్లైతే, ఇద్దరూ కలిసి కెరీర్ ను చేరుకోగలుగుతారు.

ఓపెన్ గా, నిజాయితీగా, మరియు పాజిటివ్ కమ్యూనికేషన్ ఒక ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన సంబంధం నిర్మించడానికి ఒక బలమైన పునాది వంటిది. చివరకు, కొన్ని జంటల మద్య వాదనలు మరియు విబేధాలుకు కారణం వారి మంది మంచి కమ్యూనికేషన్ లేకపోవడమే . కొన్ని జంటలు తరచూ వాదిస్తూ మరియు ముందు, వెనక చూడకుండా కలహానికి దిగుతుంటారు, అటువంటప్పుడు ఏదీ పరిష్కారం అవ్వదు లేదా భాగస్వామి సంతృప్తి పడడు. కనీసం ఒక్కరైనా వెనుకకు తగ్గడం చాలా ముఖ్యం మరియు పరిస్థితిని మరింత సానుకూలంగా అర్ధం చేసుకోవడం వల్ల మీరు వారితో మాట్లాడనికి సహాయపడుతుంది.

ఉద్యోగంచేసే భార్యాభర్తలు ఎదుర్కొనే ప్రధానసమస్యలు:క్లిక్ చేయండి


వ్యక్తిగత మరియు సంబంధిత వృత్తిపరమైన ఉద్యోగాల వల్ల ఒకరితో ఒకరు సమయం గడపడానికి సమయం దొరకకపోవడం వల్ల ఆ ప్రభావం కమ్యూనికేషన్ కొరవడుతుంది . దీనికంటే, ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడపదల్చుకొన్నట్లైతే , మీ సంబంధం మరింత కాలం కొనసాగుతుంది. ఒక సంబంధం బలపడాలన్నా , ఎక్కువ కాలం నిలబడాలన్నా కనీసం వారంలో ఒకరికోసం ఒకరు కొంత సమయం ఖర్చుచేయాలి. అప్పుడే ఈ సున్నితమైన పరిస్థితి వ్యవహరించడంలో పరిపక్వత చూపించాలి. ఇద్దరి మద్య గ్యాప్ ను పూడ్చాలంటే వారంల కొంత విలువైన సమయాన్ని ఒకరికోసం ఒకరు టైమ్ ను వెచ్చించాలి. పనిచేసే జంటల మద్య సంబంధం మరింత బలోపేతం కావాలంటే...

Improving Communication Among Working Couples

1.వినడం :

ఒక మంచి సంబంధం వినడం మీదనే ఆధారపడి ఉంటుంది, క్రమంగా వినడం వల్ల మంచి కమ్యూనికేషన్ ఏర్పడుతుంది. ఇద్దరూ వ్యక్తులుఒకే సమయంలో మాట్లాడటం కుదరదు, కాబట్టి ఒకరు మాట్లాడేటప్పుడు మరొకరు వినడం చేయాలి. అయితే, అన్ని సమయాల్లో ఒకే వ్యక్తి మాట్లాడటం వల్ల సంబందంలో అది ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి పార్ట్నర్ ఎవరు మాట్లాడినా, ఒకరు మాట్లాడేటప్పుడు మరొకరు శ్రద్దగా వినాలి.

2. ఎక్స్ ప్రెషన్:

ఎక్స్ ప్రెషన్ విషయానికి వచ్చనప్పుడు వారి ఆలచనలు మరియు ఫీలింగ్స్ ను నేచురల్ గా ఎక్స్ ప్రెస్ చేయడం అనేది ప్రతి ఒక్కరి రాదు. అందుకోసం ప్రారంభంలో మీరు కొంత ప్రయత్నం చేయాలి. అప్పుడే మీరు సహజంగా మరియు సులభంగా ఎక్స్ ప్రెస్ చేయగలుగుతారు. సాధ్యమైనంత మాట్లాడేటప్పుడు మీరు ఓపికగా వినడానికి ఇది మంచి సమయం. మీ గురించి మాట్లాడేటప్పుడు , ఆరోజు పనిగురించి లేదా కొన్ని సంఘటనల గురించి మాట్లాడటానికి ఎంచుకొని ప్రారంభించవచ్చు.

3.నిజాయితీ

మీ భాగస్వామితో కేవలం కమ్యూనికేషన్ కు మాత్రమే విలువ లేదు . మీ భావనలు మరియు మీ ఆలోచనలు కమ్యూనికేట్ చేసేటప్పుడు నిజాయితిని కనబరచడం ముఖ్యం. అందువల్ల, మీరు నిజాయితీగా ఉండటం మంచిది మరియు నిజం మాట్లాడటం వల్ల అది ఎంత హార్డ్ గా ఉంటుందో అనికోకూడదు. సంబంధం ఏ రహస్యాలు మరియు అసత్యాలు లేనప్పుడు విషయాలు చాలా సాధారణంగా మరియు అన్ కాంప్లికేటెడ్ గా ఉంటాయి.

4. ఏకాగ్రత

కొన్ని సార్లు సాధరన సంభాషణలు, వాదనలు ఒక భయంకరమైన పోరాటాలకు దారితీయవచ్చు. కాబట్టి, ప్రతి యొక్క భాగస్వామికి మాట్లాడేటప్పుడు వారి మీద దృష్టి పెట్టడం మరియు వారి మాటలను జాగ్రత్తగా వినడం ముఖ్యం . ఇది బోరింగ్ గా లేదా మీ అభిరుచికి ఆసక్తికరంగా లేనప్పుడు, మీ భాగస్వామిని మర్యాదపూర్వకంగా వేరే ఏదైనా మాట్లాడమని అడగవచ్చు.

5. మర్యాద మరియు సపోర్ట్

ఒక వివాహ సంబందంలో అత్యంత వాదనలు మరియు పోరాటాలు ఒకరి మీద ఒకరికి గౌరవం లేకపోవడం కారణం చేత జరగుతాయి. కొన్ని సార్లు వారి పట్ల సరిగా ప్రేమ చూపించకపోవడం లేదా సరిగా మాట్లాడకపోవడం వల్ల వారిని నిర్లక్ష్యం చేస్తున్నారనే భావన మీ భాగస్వామిలో ఏర్పడవచ్చు. కాబట్టి, ఒకరికొకరు మర్యాద మరియు సపోర్ట్ ఇచ్చిపుచ్చుకోవడం ముఖ్యం . అప్పుడు జీవితం మరియు కెరీర్ ముందుకు నడుస్తుంది.

English summary

Improving Communication Among Working Couples

Most people have never learned how to communicate. Without this skill, a person is handicapped in an intimate relationship. Without being able to express themselves and listen to another, partners cannot achieve intimacy.
Desktop Bottom Promotion