For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రిలేషన్ షిప్ లో అసూయ పడుతున్నారనడానికి సంకేతాలివే

By Super
|

సంబంధాలలో అసూయ ఉన్నదనటానికి సంకేతాలు ఏమిటి? ఈ ప్రపంచంలో సగం సంబంధాలు అసూయతో ప్రభావితమై ఉన్నాయని మనందరికీ తెలిసిన విషయమే మరియు నిలబడతాయో, లేదో అని టాసు వేసుకోవలసిన పరిస్థితి ఎదురవుతున్నది. ఈ అసూయ అన్నది ఏ విధమైన సంబందాన్ని అయినా ప్రభావితం చేస్తుంది. మీపట్ల మీ భాగస్వామి మోసం చేస్తున్నది అనే అనుభూతి కలిగినప్పుడు మీరు వారిపట్ల అసూయను పెంచుకుంటారు. మీకు ప్రత్యేకము అనిపించిన దానికోసం ఎవరైనా పోటీ పడినప్పుడు వారిని మీరు ఒక ప్రత్యర్థిగా భావించవొచ్చు. మీ జీవిత భాగస్వామి వ్యతిరేక లింగానికి చెందిన వ్యక్తికి దగ్గరగా ఉన్నప్పుడు, మీరు చాలా అసౌకర్యంగా భావిస్తారు మరియు మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధంలో మీ స్థానాన్ని లాక్కున్నట్లుగా కనిపించవొచ్చు.

మీ జీవిత భాగస్వామి మరొకరితో స్నేహం కంటే ఎక్కువ ఏమీ లేదు అని మీకు హామీ ఇచ్చినా కూడా ఈ భావన వదిలించుకోవటంలో విఫలం చెందుతారు. అసూయ పూర్తిగా అనారోగ్యమేమి కాదు. ఇది ఆరోగ్యకరమైన స్థాయిలలో ఉంటే, అది సంబందాలలో మంచిదే. అసూయ అన్నది మీరు మీ భాగస్వామికి ఎంత కట్టుబడి ఉన్నారో చూపిస్తుంది. అసూయ నిర్ణీత స్థాయిని దాటినప్పుడు మాత్రమే విషపూరితమవుతుంది మరియు అప్పుడు మీ జీవిత భాగస్వామికి మీరు వదిలి వెళుతున్నారనే భావన కలగవొచ్చు.

Signs Of Jealousy In Relationships

రోజు ముగింపులో, అసూయను నిగ్రహించుకోవటం చాలా కఠినమైన పని మరియు దానిని చిగురించే దశల్లో నియంత్రించ లేకపోతే, ఇంతకాలం శ్రమించి నిలుపుకున్న, నిర్మించబడిన ఒక అందమైన బంధం విచ్ఛిన్నం కావచ్చు. ఇప్పుడు, మనం సంబంధాలలో అసూయ వలన ఏర్పడిన కొన్ని గుర్తుల గురించి మాట్లాడుకుందాం. వాటిని బాగా పట్టుకోండి.

Signs Of Jealousy In Relationships

మీకు ప్రాముఖ్యత ఇవ్వటంలేదనే అనుభూతి చెందటం
ఇది అసూయ యొక్క ప్రారంభ సంకేతాలలో ఒకటి. అందరూ మిమ్మలిని నిర్లక్ష్యం చేస్తున్నారన్న భావన మరియు అప్రధానంగా చూస్తున్నట్లుగా అనుభూతి చెందటం. మీ జీవిత భాగస్వామి వ్యతిరేక లింగ వ్యక్తికి దగ్గరగా ఉండటం చూసి, మీలో ఏదో తెలియని విసుగు మొదలవుతుంది. మిమ్మల్ని మీరు ఒక సంభావ్య భాగస్వామినేనా అని అనుమానించుకోవడం మొదలుపెడతారు. మీకు మీరే ప్రశ్నలాగా మిగులుతారు మరియు మీలో ఏమి లోపించిందా అని గొప్పగా ఆశ్చర్యపడుతుంటారు.

Signs Of Jealousy In Relationships

మీరు నిరాశకు లోనయి విసుగు చెందుతుంటారు
క్రమంగా, మీ సందేహం నిరాశలోకి మారుతుంది. ఈ సమయంలో మీరు మీ జీవితభాగస్వామి లేదా భాగస్వామితో వాదనలు ప్రారంభిస్తారు. ఇది నిజానికి ఒక అసహ్యకరమైన దశ.

Signs Of Jealousy In Relationships

మీ భాగస్వామి పెరుగుదలను నియంత్రించాలానే కోరిక కలగటం
మీ భాగస్వామి ఇప్పటికీ మీ మాట వింటారో లేదో, మీరు అతనిని లేదా ఆమెను నియంత్రించడానికి ప్రారంభం చేస్తారు. ఎదుటి వ్యక్తి మీ మాటను శిరసావహిస్తే, మీకు ఒక వింత ఆనందం కలుగుతుంది. మీరు విజేతగా అనుభూతి చెందుతారు. ఎదుటి వ్యక్తి మీ మాటకి కట్టుబడి లేరు అంటే, మీరు అతనిని లేదా ఆమెను నిందించటం మొదలుపెడతారు.

Signs Of Jealousy In Relationships

మీరు శారీరక సాన్నిహిత్యాన్నికోల్పోతారు
మీకు మరియు మీ భాగస్వామికి మధ్య కెమిస్ట్రీ క్రమంగా తగ్గుతుంది. మీరు ఇకపై అతడిని లేదా ఆమెను గాని మీ చేదోడు వాదోడుగా చూడలేరు. ఇది చాలా ప్రమాదకరమైన దశ.

Signs Of Jealousy In Relationships

మీరు మీ జీవిత భాగస్వామిని ప్రతి విషయంలో ప్రశ్నించటం మొదలుపెడతారు
మీ సందేహాల కారణంగా చాలా ప్రశ్నలు అడుగుతుంటారు. మీ భాగస్వామి ఆలస్యం చేసినా లేదా ఫోన్లో మీకు తక్కువ వ్యవధిలో కలవకపోయినా మీ సందేహాలు పెరుగుతాయి మరియు మీరు అతనిని లేదా ఆమెను వంకరగా ప్రశ్నించటం ప్రారంభమౌతుంది. ఇది వివాహబంధంలో కలిగే అసూయ సంకేతాలలో ఒకటి.

Signs Of Jealousy In Relationships

మీరు మీ భాగస్వామి మీద గూఢచర్యం మొదలుపెడతారు
క్రమంగా, మీరు గూఢచర్యం మొదలుపెడతారు. మీరు రహస్యంగా అన్ని ప్రదేశాలలో మీ భాగస్వామిని అనుసరించటం లేదా ఆమె ప్రవర్తనను రహస్యంగా పరిశీలించటం. మీ గూఢచారితనం తప్పుగా భావిస్తే, మిమ్మలిని మోసం చేస్తున్నారు అని ముక్తాయింపు ఇచ్చుకుంటారు. మీరు మీ భాగస్వామి యొక్క ప్రతి చర్యను ద్రోహచర్యగా ఊహించుకునే ఈ దశ దురదృష్టకరమైనది. మీరు వివాహజీవితంలో కలిగే అసూయను అధిగమించడం ఎలా అని తెలుసుకోవాలి. వివాహితసంబంధాలు విలువైనవి మరియు అసూయ ప్రారంభమయినపుడు వారు జాగ్రత్తగా ఉండాలి.

English summary

Signs Of Jealousy In Relationships

What are the signs of jealousy in relationships? We all know the fact that jealousy is the reason why half of the relationships in this world get affected and go for a toss. It can impact any relationship in a big way.
Story first published: Wednesday, January 21, 2015, 17:44 [IST]
Desktop Bottom Promotion