For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భార్య నిర్లక్ష్యం చేస్తుందని భర్తకు అనిపించినపుడు ఏమి చేయాలి

By Super
|

కొన్ని రోజుల తరువాత, మీ వైవాహిక జీవితం పాతదిగా అనిపించినపుడు, దానికి కారణాలు గుర్తించండి. మీరు నిర్లక్ష్యం చేస్తున్నారని మీ భర్తకు అనిపించినపుడు, పరిస్థితులు చేజారక ముందే శ్రద్ధ వహించండి.

వివాహారం అయిన తరువాత కూడా పురుషులకు ప్రేమ, శ్రద్ధ అవసరం. వారు వాటిని తగినంత పొందకపోతే, వారిని పట్టించుకోవడం లేదని భావిస్తారు. మీ భర్త కోపంతో మౌనంగా ఉండడం, ఎక్కువగా ఆలోచించడం వంటివి చేస్తుంటే, అది అసంతృప్తికి చిహ్నం.

అతను మీతో మనసువిప్పి మాట్లాడక పోయినా లేదా మీతో మాట్లాడకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నా, అతని నడవడిని మీరు గమనించడం అవసరం. సాధారణంగా, పురుషులు వారి అయిష్టాన్ని అనేక మార్గాలలో చూపిస్తారు.

మీరు అతని అవసరాలను నిర్లక్ష్యం చేస్తే, అతను ఒత్తిడికి గురౌతారు. పురుషుడు నిస్పృహ భావాలు కోల్పోయినపుడు, వైవాహిక జీవితానికి అది అంత మంచిది కాదు.

అందుకని, ప్రత్యేకంగా మీ భర్త మీరు నిర్లక్ష్యం చేస్తున్నారని భావించినపుడు ఒక భార్యగా అవసరమైన స్టెప్స్ తీసుకోవడం చాలా అవసరం. ప్రేమ అనేది ఎటువంటి ప్రయత్నం లేకపోయినా మిలియన్ సమస్యలను పరిష్కరిస్తుంది.

భర్త తనను నిర్లక్ష్యం చేస్తుందని భావించినపుడు ఏమి చేయాలి

What To Do When Husband Feels Neglected

సమయాన్ని కేటాయించడం
భర్త నిర్లక్ష్యం చేస్తుందని మానసికంగా బాధపదినపుడు ఒంటరిగా భావిస్తాడు. ఆ భావనలను అతనిలో పోవాలంటే మీరు అతనితో సమయాన్ని గడపడం మంచిది. మీ ఉద్యోగం లేదా ఎవైనా పనుల వల్ల మీరు కూడా తీరిక లేకుండా ఉంటే మీ భర్త తో గడపడానికి కొంత సమయం కేటాయించండి. అతను సంతోషపడతాడు.

అతన్ని కౌగిలించుకోండి
మాట్లాడుకోవడం తో పోలిస్తే శారీరిక సాన్నిహిత్యం చాలా మంచిది. మీరు మీ భర్తతో గడిపే అవకాశం వస్తే, ఒక కౌగిలితో మీ సంభాషణను ప్రారంభించండి.

ప్రేమను వ్యక్తపరచండి
భర్తను నిర్లక్ష్యం చేయడంలో కొన్ని గుర్తులు ఉన్నాయి. మీరు మీ భర్తను ఒకసారి గమనిస్తే, మీరు మీ ప్రేమను చూపడం ప్రారంభించినపుడు, మీరు అతన్ని ప్రేమిస్తున్నారని, శ్రద్ధ చూపిస్తున్నారని భావిస్తారు. ప్రేమను సరైన పద్ధతిలో వ్యక్తపరచక పోవడం వల్లే అనేక సమస్యలు ఎదురౌతున్నాయన్న మాట వాస్తవం.

విషయాలను పరిష్కరించుకోవడం
అన్ని అనుబంధాలలో, ఎప్పటికప్పుడు విషయాలను పరిష్కరించుకోవడం మంచిది. మీ భర్తే మీకు ముఖ్యం అనేది క్లియర్ గా తెలియచేయండి. దీనివల్ల అతను గొప్పగా భావిస్తాడు. పురుషుడు నమ్మితే, మీరు అతనిని విస్మరిస్తున్నరనే భావనను మానుకుంటాడు.

English summary

What To Do When Husband Feels Neglected

After sometime, when your marriage starts getting stale, try to search for reasons. If your husband feels neglected, it is time you pay attention before things go out of control.
Desktop Bottom Promotion