For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ భార్య సంపాదన మీ సంపాదన కన్నా ఎక్కువ ఉంటే మీరేం చేయాలి?

By Super
|

కాలం మారిన ఈ ఆధునిక సమాజంలో కూడా, భారతీయులలో చాలామంది స్త్రీల కన్నా పురుషుల సంపాదన ఎక్కువ ఉండాలని కోరుకుంటున్నారు. కానీ కొన్ని విషయాలలో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూనే ఉన్నాయి.

మీ భార్య మీ కంటే ఎక్కువ సంపాదిస్తున్నప్పుడు, మీరు ఇబ్బందిపడనవసరంలేదు మరియు మీరు న్యూనతాభావంతో అసలు ఉండనవసరంలేదు.

READ MORE: వర్కింగ్ ఉమెన్స్ కు తక్షణ శక్తినిచ్చే 20 ఎనర్జిటిక్ ఫుడ్స్

వైవాహిక జీవితం అంటే ఇద్దరి మధ్య ప్రేమ మరియు అవగాహన మీద ఆధారపడి ఉంటుంది. ఆమె అన్ని కోణాల్లో మిమ్మలిని అంగీకరించినప్పుడు అప్పుడు ఈ సంపాదన, జీతాలు ఇవేవి నిజంగా సమస్య కాదు.

భార్య భర్త కంటే ఎక్కువ సంపాదిస్తున్నప్పుడు, ఎవరు కూడా వారిని చిన్నచూపు చూసే వారుండరు.

READ MORE: ఉద్యోగం చేసే మహిళల కోసం 20 బెస్ట్ ఫిట్ నెస్ చిట్కాలు

ఇప్పుడు, ఇక్కడ మంచి కోణంలో ఈ వివాదాన్ని పరిశీలించేందుకు కొన్ని మార్గాలు ఇస్తున్నాము. చూడండి.

పాత్రలు పోషించటంలో మార్పులు (జండర్ రోల్)

పాత్రలు పోషించటంలో మార్పులు (జండర్ రోల్)

కాలంతో పాటు చాలా విషయాలు మారుతున్నాయి. ఈ రోజుల్లో, కొన్ని పాత్రలు నిర్దిష్టంగా ఒక లింగవర్గానికే చెందటం లేదు. మీ భార్య మీ తక్కువ ఆదాయంతో సమర్థించుకోలేనప్పుడు, అది ఒక సమస్యగా మారినప్పుడు కూడా, మీ ఒక్కరి ఆదాయం మీద ఆధారపడటం తప్పు. మీ పురుష ఆధిక్యతే మీ అధిక ఆదాయం అని గుర్తించుకోవటం తప్పు.

డబ్బు ఒక్కటే ధ్యేయం కాదు

డబ్బు ఒక్కటే ధ్యేయం కాదు

డబ్బు ఒక్కటే మీ ఇద్దరిమధ్య సంబంధాన్ని నిర్ణయించే కొలమానం కాదని తెలుసుకోండి. డబ్బు అన్నది జీవితంలో కేవలం ఒక భాగం.

విషయాలు పంచుకోవటం

విషయాలు పంచుకోవటం

అవసరమైతే, నిజంగా ఇంటిపనులలో ఆమెకు సహాయం చేసి మీ భార్యతో సహకరించటానికి ప్రయత్నించండి.

బిగ్ పిక్చర్ చూడండి

బిగ్ పిక్చర్ చూడండి

మీరు ఒక్క నిముషం ఆలోచించుకుంటే, మీ వివాహ బంధంలో ఉన్న లక్ష్యం, మీ భాగస్వామి మరియు పిల్లలు మరియు మీ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తిస్తూ సంతోషంగా జీవించడానికి మీ భాగస్వామి యొక్క సంపాదన కూడా తోడ్పడుతుంది అని గ్రహించవచ్చు. మీరు అలా ఆలోచించుకున్నప్పుడు , మీరు మీ తక్కువ సంపాదన గురించి భయపడనవసరం లేదు.

డబ్బును అర్థం చేసుకోండి

డబ్బును అర్థం చేసుకోండి

డబ్బు అన్నది ఒక అవసరం. డబ్బు లేకపొతే, జీవితం నిలిచిపోతుంది. అవును, డబ్బు తప్పనిసరిగా సమాజంలో మీ పరపతిని నిర్వచిస్తుంది మరియు అది కొన్ని మానవ సంబంధాలను కూడా సంరక్షిస్తుంది. మీ భార్యది డబ్బుతో నిండిన మనసు కానప్పుడు, అప్పుడు మీరు ఈ డబ్బుతో నడిచే ప్రపంచం గురించి ఆందోళనపడనవసరం లేదు.

ఇరుగుపొరుగు గురించి చింతించకండి

ఇరుగుపొరుగు గురించి చింతించకండి

భార్య భర్త కంటే ఎక్కువ సంపాదిస్తున్నప్పుడు, మీ చుట్టూ ఉన్నవారు మిమ్మలిని మానసికంగా బలహీనపరచటానికి ప్రయత్నిస్తారు కానీ పర్వాలేదు , వారిని పట్టించుకోవద్దు. వారి అభిప్రాయాలు మిమ్మలిని ఏమి నాశనం చేయలేవు. ఆ విషయాలను పట్టించుకోకుండా మీరు మీ భార్యతో సంతోషంగా ఉండండి.

English summary

What To Do When Your Wife Earns More: Relationship in Telugu

What To Do When Your Wife Earns More. Most of the Indians are still stuck up in the time when men were supposed to earn more than women. Well, things have changed. When your wife earns more than you, you don't need to feel embarrassed and you don't need to feel inferior.
Desktop Bottom Promotion