For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆలుమగల మధ్య మనస్పర్ధలకు వాట్సాప్ ఎలా కారణమవుతోంది.. ??

By Swathi
|

వాట్సాప్.. !! ఇది పాత ఫ్రెండ్స్, కొలీగ్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరితోనూ రిలేషన్ పెంచుకోవడానికి అందుబాటులో ఉన్న సోషల్ మీడియా. చాలా రోజుల క్రితం వాట్సాప్ లవర్స్ టచ్ లో ఉండటానికి మెసేజ్ లు చేసుకోవడానికి ఉపయోగించేవాళ్లు. వాళ్ల ప్రేమను వ్యక్తపరచడానికి ఇదో చక్కటి వేదికగా ఉంది. ఒకవేళ మీ బాయ్ ఫ్రెండ్ దూరంగా ఉన్నా.. ఆ మెసేజ్ లు చదువుకుని సంతోషపడటానికి ఉపయోగపడేవి.

మీ బంధాన్ని మరింత అన్యోన్యంగా మార్చే మ్యాజికల్ ఐడియాస్మీ బంధాన్ని మరింత అన్యోన్యంగా మార్చే మ్యాజికల్ ఐడియాస్

అయితే ఇది ఇప్పుడు అందరినీ ఎట్రాక్ట్ చేస్తోంది. మెసెజింగ్, గ్రూప్ చాటింగ్, కాలింగ్, పిక్చర్ షేరింగ్, వీడియో షేరింగ్.. ఇలా రకరకాల ఆప్షన్స్ ఉండటం వల్ల వాట్సాప్ కి క్రేజ్ పెరిగిపోయింది. ప్రతి ఒక్కరూ వాట్సాప్ లో అందుబాటులో ఉంటున్నాయి. అయితే కమ్యునికేషన్ పరంగా వాట్సాప్ బాగా ఉపయోగపడుతున్నా.. దీనివల్ల గొడవలు, మనస్పర్ధలు ఎక్కువవుతున్నాయి. రిలేషన్ లో సమస్యలు ఎదురవుతున్నాయి. అందమైన బాంధవ్యంలో వాట్సాప్ తీసుకొస్తున్న 10 చిక్కులేంటో ఇప్పుడు చూద్దాం..

పదే పదే మెసేజ్

పదే పదే మెసేజ్

వాట్సాప్ వాడుతున్నారంటే.. తన భాగస్వామి ప్రతి 15 నిమిషాలకు ఒకసారి మెసేజ్ చేయాలని కోరుకుంటున్నారు. ఎల్లప్పుడూ తమతో కాంటాక్ట్ లో ఉండాలని భావిస్తున్నారు. ఒకవేళ 15 నిమిషాలకు ఒకసారి మెసేజ్ చేయకపోతే.. తనతో కమ్యునికేట్ అవడం లేదని ఫీలవుతారు. దీనివల్ల ఇద్దరి మధ్య గొడవలు మొదలవుతున్నాయి.

బ్లూ టిక్ మార్క్స్

బ్లూ టిక్ మార్క్స్

ప్రస్తుతం వాట్సాప్ లో బ్లూ టిక్ మార్క్స్ చాలా కపుల్స్ మధ్య గొడవలకు కారణమవుతున్నాయి. మెసేజ్ చూశాక కూడా ఎందుకు రిప్లై ఇవ్వలేదు అంటూ ప్రశ్నలతో ఇరకాటంలో పెడుతున్నారు. దీనివల్ల కోపం, ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది. మీకు తెలుసా.. వాట్సాప్ కారణంగా కొంతమంది విడాకులు కూడా తీసుకున్నారు.. !

లాస్ట్ సీన్

లాస్ట్ సీన్

వాట్సాప్ లో మరో ప్రమాదం లాస్ట్ సీన్ అనే ఇండికేషన్. ఒక వ్యక్తి చివరిసారి ఎప్పుడు వాట్సాప్ చూశాడు అనే విషయం కూడా రకరకాల గొడవలకు కారణమవుతోంది. ఒకవేళ ఒక వ్యక్తి 6:15కి చివరిసారి వాట్సాప్ చూసి ఉంటాడు. ఇప్పుడు 6:16 అయిందంటే.. తను నాకు ఇంకా రిప్లై ఇవ్వలేదు అనే కోపం మొదలవుతుంది. ఇలాంటి అప్షన్ వల్ల వాట్సాప్ వాదనలు, బ్రేకప్స్ కి కారణమవుతోంది.

ఆన్ లైన్

ఆన్ లైన్

కొంతమంది తన పార్ట్ నర్ వాట్సాప్ లో ఆన్ లైన్ లో ఉన్నాడా ? లేడా ? అని రోజంతా చెక్ చేస్తూ ఉంటారు. ఇలాంటి అలవాటు మీ భాగస్వామిని తీవ్ర ఇబ్బందికి గురిచేస్తుంది.

వర్క్

వర్క్

చీటికీ మాటికీ వాట్సాప్ లో మెసేజ్ లతో విసిగించడం వల్ల.. మీ పార్ట్ నర్ వర్క్ పై కాన్సంట్రేట్ చేయలేడు. దీనివల్ల ఒత్తిడి పెరిగి.. మీ రిలేషన్ పై ప్రభావం చూపుతుంది.

అపార్థాలకు

అపార్థాలకు

చాలా మంది తమ భాగస్వామితో ఎక్కువగా వాట్సాప్ లోనే కమ్యునికేట్ అవుతూ ఉంటారు. మరికొందరు తమ రిలేషన్ కి వాట్సాప్ లోనే ముగించేస్తుంటారు. టెక్ట్స్ మెసేజ్ ల ద్వారా అపార్థాలకు ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఫేస్ టు ఫేస్ మాట్లాడటం వల్ల ఏదైనా క్లారిటీ ఉంటుంది. మీరిద్దరి మధ్య రిలేషన్ బలపడటానికి అవకాశాలుంటాయి.

వాట్సాప్ లో ఎక్కువ సమయం

వాట్సాప్ లో ఎక్కువ సమయం

రియల్ లైఫ్ లో కంటే.. ఎక్కువ సమయం వాట్సాప్ లోనే గడుపుతూ ఉంటారు చాలా మంది. ఇది సరైన అలవాటు కాదు.

నిర్లక్ష్యం

నిర్లక్ష్యం

మీ భాగస్వామి మెసేజ్ లు చూసినప్పుడు లేదా వాళ్లు ఏదైనా అప్ సెట్ అయి మెసేజ్ పెట్టినప్పుడు కేవలం K అనే మెసేజ్ తో రిప్లై ఇవ్వడం వల్ల వాళ్లు మరింత అసౌకర్యానికి గురవుతారు. నిరుత్సాహపడతారు. అలాగే కొన్ని సందర్భాల్లో మెసేజ్ లు చూసి కూడా రిప్లై ఇవ్వకపోతే.. చాలా మనస్తాపానికి లోనవుతారు. కాబట్టి.. ఇలాంటి అలవాట్లు మీ రిలేషన్ ని దెబ్బతీస్తాయి.

స్టేటస్

స్టేటస్

కొంతమంది.. తమ మానసిక ఆలోచనలను వాట్సాప్ స్టేటస్ రూపంలో పెడతారు. తమ పార్ట్ నర్ కి డైరెక్ట్ గా చెప్పలేక ఇలా పెట్టడం సరైనది కాదు. కాబట్టి.. డైరెక్ట్ గా కమ్యునికేట్ అయితే.. ఇద్దరికీ.. బావుంటుంది. ఒక వేళ మీరు స్టేటస్ అప్ డేట్ చేసినా.. వాళ్లు చూశారా లేదా అన్నది తెలియక.. మీరు ఇంకా బాధపడాల్సి వస్తుంది.

హెల్తీ రిలేషన్

హెల్తీ రిలేషన్

ఎల్లప్పుడూ వాట్సాప్ లోనే మీ పార్ట్ నర్ టచ్ లో ఉండాలి అనుకుంటూ.. మీ రిలేషన్ స్పాయిల్ అవుతుంది. కాబట్టి.. కాసేపు మీ భాగస్వామితో గడపండి. ఇద్దరూ సరదాగా గడపండి. అలాగే రాత్రిపూట వాట్సాప్ కి గుడ్ బై చెప్పడం వల్ల మీ రిలేషన్ హెల్తీగా ఉంటుంది.

English summary

10 ways WhatsApp is killing your relationship

10 ways WhatsApp is killing your relationship. WhatsApp messaging, WhatsApp calling and all the other features may be taking a toll on your relationship! Read this to find out.
Story first published: Tuesday, April 26, 2016, 12:39 [IST]
Desktop Bottom Promotion