For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లైఫ్ ని లవ్ చేయడానికి పెళ్లి చెప్పే ముచ్చట్లేంటి ?

By Swathi
|

జీవితంలో అత్యంత సంతోషం కలిగించడంలోనూ, అత్యంత బాధ కలిగించడంలోనూ పెళ్లి ప్రధాన పాత్ర పోషిస్తుంది. అది వాళ్ల రిలేషన్ ని బట్టి.. ఆనందమా, బాధాకరమా అనేది నిర్ణయించబడుతుంది. ఇద్దరి మధ్య సంబంధం సానుకూలంగా ఉంటే... ఎనలేని సంతోషం.. అదే బంధం బలహీనంగా ఉంటే.. బాధాకరం. చాలా ఒత్తిడికి లోనయ్యే సందర్భం.

పెళ్లి అనేది జీవితంలో ముఖ్యమైన సంబంధం. వివాహం ద్వారా అనేక లైఫ్ లెసెన్స్ నేర్చుకుంటాం, నేర్పుతుంది. మన గురించి, మన భాగస్వాముల గురించి, మన జీవితం గురించి లెక్కలేనన్ని పాఠాలు నేర్పేది ఏడడుగుల బంధం. జీవితంలో పెళ్లి నేర్పే పాఠాలేంటి ? మన జీవితాన్ని గడపడానికి సత్తాని, లైఫ్ ని లవ్ చేయడానికి పెళ్లి చెప్పే ముచ్చట్లేంటి ?
తెలుసుకుందామా..

పెళ్లి చాలా నేర్పుతుంది

పెళ్లి చాలా నేర్పుతుంది

చాలా మంది 20లలో పెళ్లి చేసుకుంటారు. వివాహం తర్వాత చాలా బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది. సర్దుకుపోవాల్సి రావడం, పిల్లలను ఎలా పెంచాలి ? వర్క్ ఎలా మ్యానేజ్ చేయాలి ? ఇలాంటి ఎన్నో బాధ్యతలను వివాహ బంధం నేర్పుతుంది.

కాంప్రమైజ్

కాంప్రమైజ్

యంగ్ గా ఉన్నప్పుడు ఏ మాత్రం కాంప్రమైజ్ అవడం అలవాటు ఉండదు. తల్లిదండ్రులను ఎదిరించి అయినా.. కావాల్సింది పొందేతత్వం ఉంటుంది. కానీ.. పెళ్లి తర్వాత కాంప్రమైజ్ తప్పనిసరి. ఎవరైనా ఏదో ఒకసారి భాగస్వామి కోసం తప్పకుండా కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది.

చక్రం లాంటిది

చక్రం లాంటిది

పెళ్లి అనేది చక్రం లాంటిది. ఎందుకంటే.. సంతోషకరమైన సందర్భాలు, బాధాకరమైన సందర్భాలు రెండూ ఉంటాయి. కష్టాలు, సుఖాలు, సమస్యలు అన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కష్టాలు వచ్చినప్పుడు తమ మ్యారేజ్ లైఫ్ బాగోలేదని ఎప్పుడూ ఆలోచించకండి.

వాటిని పరిష్కరించే మార్గాలు అన్వేషించాలి.

అర్థం చేసుకోవడం

అర్థం చేసుకోవడం

ఇద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి. మీ భాగస్వామి ఫ్రెండ్స్, ఫ్యామిలీని గౌరవించాలి. అలాగే.. మీరు మాత్రమే కాదు.. తనకు కావాల్సిన వాళ్లు ఉన్నారని గుర్తుంచుకోవాలి. పెళ్లి తర్వాత పార్ట్ నర్ తోనే కాకుండా.. ఫ్రెండ్స్ తో కూడా గడపడానికి సమయం, అంగీకారం ఇవ్వాలి.

అనుమానం

అనుమానం

నమ్మకం లేకుండా.. పెళ్లి బంధం శాశ్వతం కాలేదు. నమ్మకమే పునాది. మీ ఇద్దరి మధ్య బంధాన్ని ఎక్కువకాలం నిలబెట్టేది నమ్మకమే. ఎమోషనల్ ట్రస్ట్, సెక్సువల్ ట్రస్ట్, ఫైనాన్షియల్ ట్రస్ట్ ఇలా అన్ని విధాలుగా ఒకరిపై ఒకరు నమ్మకం కలిగి ఉండాలి. ఒకస్కారి అనుమానం మొదలైందంటే.. రిలేషన్ లో ప్రాబ్లమ్స్ మొదలైనట్టే.

ఎక్స్ పెక్టేషన్స్

ఎక్స్ పెక్టేషన్స్

మీ భాగస్వామి మీతో తరచూ పోట్లాడటం, వాదులాడటం, విసుక్కోవడం చేస్తోంది అంటే.. మీనుంచి చాలా ఎక్స్ పెక్ట్ చేస్తోందని అర్థం.

అంగీకరించకపోవడం

అంగీకరించకపోవడం

గొడవలకు దూరంగా ఉండటానికి ఏ ఒక్క జంట కూడా ఒక్కసారి కూడా, ఒక్క విషయంలో కూడా అంగీకారం తెలుపరు. వాదించుకోవడం, కోపపడటానికి బదులు నెమ్మదిగా చర్చించుకోవడం చాలా మంచిది. ఒకరినొకరు మాట్లాడటానికి అవకాశం కల్పించుకోవాలి.

చర్చించుకోవడం వల్ల గౌరవం కోల్పోయే ఛాన్స్ రాదని గుర్తుంచుకోవాలి.

క్షమించమని అడగడం

క్షమించమని అడగడం

సారీ చెప్పడంలో తప్పులేదని తెలుసుకోవాలి. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగినా, తప్పు జరిగినా.. వెంటనే సారీ చెప్పడం వల్ల.. సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు.

ఇద్దరికి చెందిన ఫంక్షన్స్ లో పాల్గొనడం

ఇద్దరికి చెందిన ఫంక్షన్స్ లో పాల్గొనడం

మీ పార్ట్ నర్ తన ఫ్యామిలీనో లేదా ఆఫీస్ కి సంబంధించిన ఫంక్షన్ కి రావాలని కోరినప్పుడు వెళ్లడం మంచిది. ఇలా ఇద్దరికీ సంబంధించిన పంక్షన్లలలో పాల్గొనడం వల్ల.. ఇద్దరి మధ్య రిలేషన్ మరింత హ్యాపీగా ఉంటుంది.

హ్యాపీనెస్

హ్యాపీనెస్

వివాహ బంధంలో వచ్చే ప్రతి విషయాన్ని హ్యాపీ ఎంజాయ్ చేయడం అలవరుకోవాలి. ప్రమోషన్స్, పిల్లలు, ఇల్లు కొనడం వంటి రకరకాల కోరికలు తీర్చుకునే దారిలోనే.. మ్యారేజ్ లైఫ్ ని ఆస్వాదించాలి. ప్రతి క్షణాన్ని హ్యాపీగా గడపాలి.

గుడ్ క్వాలిటీస్

గుడ్ క్వాలిటీస్

మీ భాగస్వామిలో ఉన్న మంచి లక్షణాలను అప్పుడప్పుడు గుర్తు చేసుకోండి. ఒకరినొకరు క్షమించుకోండి. ఒకరినొకరు గౌరవించుకోండి. మంచినే ఎక్కువగా తీసుకోవడం అలవాటు చేసుకోండి.

English summary

11 practical lessons that marriage teaches you about life!

11 practical lessons that marriage teaches you about life! Research shows that during every dimension of life, happiness is influenced by the quality of one’s marriage, while divorce is the second most stressful life event one can ever experience. A marriage is thus one of the most important relationships in life.
Story first published:Saturday, January 30, 2016, 16:45 [IST]
Desktop Bottom Promotion