For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రతిరోజూ మీ భాగస్వామితో ఖచ్చితంగా మాట్లాడాల్సిన విషయాలు..!

ప్రతిరోజూ మీ పార్ట్ నర్ తో మాట్లాడుకోవడం అలవాటు కాదు. కొంతమంది కేవలం మంచి విషయాల గురించే మాట్లాడాలని లేదా రొమాంటిక్ ఐడియాస్ మాత్రమే భాగస్వామితో మాట్లాడాలని భావిస్తారు. కానీ ఇది వాస్తవం కాదు.

By Swathi
|

మీరు మీ భార్యతో ప్రతి విషయం షేర్ చేసుకుంటారా ? ఎలాంటి విషయాలు మాట్లాడతారు, ఎలాంటి విషయాలను గోప్యంగా ఉంచుతారు ? అసలు ప్రతిరోజూ మీ భార్యతో.. చర్చించుకునే సమయం ఉంటుందా ? కానీ.. మీ జీవిత భాగస్వామితో మాట్లాడటానికి సమయాన్ని ఖచ్చితంగా క్రియేట్ చేసుకోవాలి.

couple discussions

ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. మీతో లైఫ్ లాంగ్ ఉండే.. భార్య లేదా భర్తతో.. ప్రతి విషయం చర్చించాలి. అప్పుడే ఇద్దరి మధ్య మనస్పర్థలు దూరంగా ఉంటాయి. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. అలాగే రిలేషన్ లో నిషేధాలు అంటూ ఏమీ ఉండకూడదు. ఎలాంటి విషయమైనా మాట్లాడేలా ఉండాలి.

ప్రతిరోజూ మీ పార్ట్ నర్ తో మాట్లాడుకోవడం అలవాటు కాదు. కొంతమంది కేవలం మంచి విషయాల గురించే మాట్లాడాలని లేదా రొమాంటిక్ ఐడియాస్ మాత్రమే భాగస్వామితో మాట్లాడాలని భావిస్తారు. కానీ ఇది వాస్తవం కాదు. మీరు ప్రేమించే మీ భాగస్వామి దగ్గర కొన్ని విషయాలు ఖచ్చితంగా మాట్లాడాలి. నిజాయితీపైనే మంచి సంబంధం ఆధారపడి ఉంటుంది.

మరి మీ ఇద్దరి మధ్య ప్రేమను, బంధాన్ని బలపరిచే విషయాలేంటి ? ఎలాంటి విషయాలను ప్రతిరోజూ మీ భాగస్వామితో ఖచ్చితంగా మాట్లాడాలో తెలుసుకుందాం..

భవిష్యత్

భవిష్యత్

మీ భాగస్వామితో ప్రతిరోజూ ఖచ్చితంగా మాట్లాడాల్సిన విషయాల్లో మీ రిలేషన్ దీర్ఘకాలం ఉంటుందని.. భవిష్యత్ పై మీ అంచనాలను వివరించాలి. మీరు చేయాలనుకున్నవి, మీ లక్ష్యాలు, మీ కలల గురించి మాట్లాడాలి. ఇలా ఒకరికి ఒకరు చెప్పుకోవడం వల్ల.. ఇద్దరు కష్టపడి వాటిని సాధించవచ్చు.

కుటుంబ విషయాలు

కుటుంబ విషయాలు

ప్రతిరోజూ మీ పార్ట్ నర్ తో.. మీ కుటుంబం గురించి మాట్లాడటం కంపల్సరీ. ఫ్యామిలీతో ఎలాంటి సమస్య ఉన్నా.. మీ భాగస్వామితో.. ఖచ్చితంగా మాట్లాడాలి. మీ పార్ట్ నర్ సరైన వాళ్లు అయితే.. మీకు హెల్ప్ చేస్తారు. అలాగే మీ భాగస్వామి ఇష్టాల గురించి మాట్లాడం వల్ల.. వాళ్ల గురించి మరింత ఎక్కువ తెలుసుకోవచ్చు. అలాగే మీ పార్ట్ నర్ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ ఎలా ఉంటుంది అనేది మాట్లాడుకోండి.

ఆరోగ్యం

ఆరోగ్యం

ఒకవేళ మీకు అనారోగ్య సమస్య ఉన్నా, లేదా ఏ విషయం గురించైనా బాధపడుతుంటే.. లేదా ఆరోగ్యానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా.. మీ పార్ట్ నర్ తో పంచుకోవాలి. గుడ్, బ్యాడ్ టైమ్.. ఏదైనా పార్ట్ నర్ తో చర్చించుకోవడం చాలా అవసరం.

డబ్బు

డబ్బు

ఆర్థికపరమైన విషయాల గురించి ఖచ్చితంగా మీ భాగస్వామితో చర్చించాలి. మీరు ఇతరులకు ఇచ్చే డబ్బు గురించి లేదా ఇతరులతో తీసుకున్న డబ్బు గురించి వివరించాలి. ఏదైనా చేసేటప్పుడు, ఖర్చు చేసేటప్పుడు మీ భాగస్వామికి ఖచ్చితంగా వివరించాలి. ఇలాంటివి కలిసి నిర్ణయం తీసుకోవడం వల్ల ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది.

లైంగికత

లైంగికత

బెడ్ రూంలో జరిగిన ప్రతి విషయాన్ని మీ భాగస్వామితో ఖచ్చితంగా ప్రతిరోజూ చర్చించాలి. సెక్స్ అనేది భార్యాభర్తల మధ్య నిషేధమైనది కాదు. బెడ్ పై ఏది ఇష్టపడతారు, ఏది ఇష్టపడరు అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం.

లక్ష్యాలు

లక్ష్యాలు

మీ భార్యతో ప్రతిరోజూ చర్చించాల్సిన విషయాలలో ముఖ్యమైనది.. ఏది ఆసక్తికరమైనది వంటి చేయడం, గార్డెనింగ్, రాయడం, యోగా లేదా ఇతర ఏపనిని ఇష్టపడతారు అనేది తెలుసుకోవాలి. మీకు ఇష్టమైనవాటి గురించి మీ భాగస్వామి తెలుసుకుంటే.. చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే వ్యక్తిగతంగా, ఉద్యోగపరంగా ఎలాంటి లక్ష్యాలు సాధించాలి అనుకుంటున్నారో చెప్పాలి. ఇలా వీటన్నింటి గురించి మీ భాగస్వామితో ప్రతిరోజూ చర్చించుకుంటే.. మీ బంధం చాలా బలపడుతుంది.

English summary

6 Things You Should Discuss with Your Partner Every Day

6 Things You Should Discuss with Your Partner Every Day. In a relationship there should never be taboos, because you should be able to talk about any subject. It’s essential that you have common goals in mind to fight for each day.
Story first published: Thursday, October 20, 2016, 12:39 [IST]
Desktop Bottom Promotion