For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ లవ్ ని ఇలా డిఫెరెంట్ గా ఎక్స్ ప్రెస్ చేస్తే మరింత స్ట్రాంగ్ అవుతుంది..!

ప్రేమను వ్యక్తపరచుకోవడానికి అనుసరించే ఇలాంటి వివిధ రకాల పద్దతుల వల్ల ఒకరిపై మరొకరికి గౌరవం, అభిమానం..వంటివి పెంపొందుతాయి. ఫలితంగా వారి అనుబంధం కలకాలం నిలిచిపోతుంది. కావాలంటే ఈ చిన్న చిట్కాలను మీరు కూడ

|

ప్రేమికులైనా, దంపతులైనా...ఒకరిలో దాగున్న ప్రేమను మరొకరికి తెలియజేసుకుంటేనే ఆ బంధం మరింత బలపడుతుంది. 'గుండెల్లో ఏముందో...కళ్లల్లో తెలుస్తుంది..' అన్నట్లుగా మనసులో దాగున్న ప్రేమను కంటి సైగల ద్వారానో, ఐలవ్వూ అనే చిన్న మాట ద్వారానో తెలియజేసుకోవడమే కాదు...అందుకు భిన్నంగా మరికొన్ని పద్ధతుల కూడా ఉన్నాయంటున్నారు రిలేషన్ షిప్ నిపుణులు. ప్రేమను వ్యక్తపరచుకోవడానికి అనుసరించే ఇలాంటి వివిధ రకాల పద్దతుల వల్ల ఒకరిపై మరొకరికి గౌరవం, అభిమానం..వంటివి పెంపొందుతాయి. ఫలితంగా వారి అనుబంధం కలకాలం నిలిచిపోతుంది. కావాలంటే ఈ చిన్న చిట్కాలను మీరు కూడా ప్రయత్నించవచ్చు..

పాటలతో :

పాటలతో :

పార్ట్నర్స్ తమ ప్రేమను వ్యక్తపరుచుకోవడానికి మాటలే కాదు, బోలెడన్ని పాటలు కూడా ఉన్నాయి...‘నేనంటే నాకు చాలానే ఇష్టం...నువ్వంటే ఇంకా ఇష్టం...ఏ చోటనైనా ఉన్నా నీకోసం...నా ప్రమే పేరూ నీలాకాశం’ అంటూ పార్ట్నర్స్ తమ కంటే మత భాగస్వామినే ప్రాణంగా ప్రేమిస్తున్నట్లు వారి గుండెలోతుల్లో దాగున్న ఆకాశమంత ప్రేమను ఇలా పాట రూపంలో వ్యక్తపరచవచ్చు. దీంతో పాటు ఇలాంటి మనసుకు హత్తుకునే పాటకు ఇద్దరూ కలిసి ఓ స్టెప్ కూడా వేస్తే ...? అదిపోతుంది. అంతే మీ ప్రియమైన వారి మోహంలో కనిపించే ఆనందం చూసి మీరూ ఎంతగానో మురిసిపోవచ్చు. భార్యాభర్తలిద్దరూ తమ భాగస్వామిపై ఉన్న ప్రేమను ఇలా పాట రూపంలో తెలియజేసుకుంటే ఎంతో ముచ్చటగా ఉంటుంది.

ముద్దు..మురిపెం:

ముద్దు..మురిపెం:

పార్ట్నర్స్ ఇద్దరి మద్య రొమాన్స్ కు ఉండే స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే దంతపతులిద్దరూ ఒకరిపై ఒకరికి ఉన్న గాఢమైన ప్రమేను తెలియజేసుకోవడానికి రొమాన్స్ ఓ వారధిలాంటిది. మరి, అందులో ముద్దులు కౌగిలింతలదే కీలకపాత్ర.

ఉదాహరణకు మీ పార్ట్నర్ ఏదో ఒక ప్రత్యేక సందర్బంలో మీకు నచ్చినట్లుగా అందంగా, ఆకర్షణీయంగా తయారయ్యారనుకోండి..అప్పుడు వారితో ‘నువ్వు బాగున్నావ్..'అంటూ సింపుల్ గా మాటలతో చెప్పి సరిపెట్టేయడం కాకుండా చెక్కిళ్లపై ఓ ముద్ద పెట్టి, గట్టిగా హగ్గివ్వండి...అంతే..! మీలో దాగున్న ప్రేమ వారికి ఇట్టే అర్థమైపోతుంది. కావాలంటే మీరూ ఈసారి ప్రయత్నించి చూడండి..

శ్రీమతి ..ఓ బహుమతి:

శ్రీమతి ..ఓ బహుమతి:

గుండె లోతుల్లో దాగున్న మధురమైన ప్రేమను తెలియజేసుకోవడానికి బహుమతులు ఓ మార్గం. కానీ చాలా మంది దంపతులు ఏ పుట్టిన రోజుకో లేదంటే మరే సందర్భంలోనో గానీ పరస్పరం బహుమతులిచ్ఛిపుచ్చుకోవడానికి అంతగా ఆసక్తి చూపించరు. ఇంకొదరికైతే ఎందుటివారు అడిగే దాకా అసలు బహుమతివ్వాలన్న ఆలోచనే రాదు. ఇలా అయితే ఒకరి మనసుల్లో ఉండే ప్రేమ మరొకరికి ఎలా అర్దం అవుతుంది. చెప్పండి. కాబట్టి బహుమతిలివ్వడానికి ప్రత్యేక సందర్భాలే ఉండాలని రూలేం లేదు. మీకు ఎప్పుడివ్వాలనిపిస్తే అప్పుడు మీ భాగస్వామికి నచ్చిన బహుమతితో వారిని సర్ ప్రైజ్ చేస్తే వారు మరింత సంతోషపడుతారు . ఇద్దరి మద్య అనుబంధం రెట్టింపు అవుతుంది.

హోం ట్రీట్ :

హోం ట్రీట్ :

మీ మనసుకు నచ్చిన వారిపై ఉండే ప్రేమను మీ పాకశాస్త్ర ప్రావీన్యంతోనూ వెల్లడించవచ్చు. అందుకే మీ భాగాస్వామి బయటి నుండి వచ్చే సరికి నచ్చిన ఆహార పదార్థాల్ని తయారుచేసి డైనింగ్ టేబుల్ పై అందంగా సర్దేయండి. మీరు అందంగా తయారై ఇద్దరూ కలిసి కూర్చొని ప్రమేగా కబుర్లు చెప్పుకుంటూ ఆరగించండి. అక్కడితో ఆగిపోతారా ఏంటి? మీ ప్రమేనంతా గోరుముద్దులగా కలిపి వారికి మీ చేత్తో స్వయంగా తినిపించండి.

ప్రేమ యాత్రలకు:

ప్రేమ యాత్రలకు:

ఎప్పుడూ ఇంట్లో ఉండే ఒకరికొకరు ప్రేమను తెలియజేసుకుంటారా? అలా కొద్ది రోజులు ప్రేమ యాత్రలకు వెళ్లొచ్చు కదా... అవునండీ ...ఈ బిజీ బిజీ లైఫ్ నుంచి కాస్త విరామం తీసుకుని, మీ భాగస్వామి కోసం వారికి నచ్చిన ప్రదేశాలనికి ఓ ట్రిప్ ప్లాన్ చేయండి. అక్కడి వారిని పలు విధాలుగా సర్ ప్రైజ్ చేయండం, నచ్చినవి కొని పెట్టడం, ఇద్దరూ మరింత దగ్గరవ్వడం...వంటవన్నీ చేస్తే ఇరువురి మధ్య అనురాగానికి అంతే ఉండదు. తద్వారా పార్ట్నర్స్ ఇద్దరు అనుబంధం స్ట్రాంగ్ అవుతుంది.

English summary

New Ways to Deepen Your Relationship Bond

Happy relationships shouldn’t be hard work! That’s one of the upbeat findings from my landmark study of marriage, which has been following 373 married couples since 1986
Story first published: Wednesday, December 7, 2016, 17:30 [IST]
Desktop Bottom Promotion