For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇండియాలో అత్తగారిని సమస్యగా భావించడానికి కారణాలేంటి ?

By Swathi
|

పెళ్లి అనగానే అమ్మాయిలకు ముందుగా గుర్తొచ్చేది అత్తగారు. ఎందుకంటే.. అమ్మస్థానంలో ఉండబోయే అత్త తమను ఎలా చూసుకుంటుంది ? ఎలాంటి సందర్భంలో ఎలా రియాక్ట్ అవుతుందన్న భయం వెంటాడుతూ ఉంటుంది. అలాగే పూర్వం నుంచి అత్తగారంటే పెద్ద సమస్యగా భావిస్తూ వస్తున్నారు మన ఇండియన్స్. వంటలు, పనుల విషయంలో తమని పదే పదే కింఛపరుస్తారనే అభిప్రాయం చాలా మందిలో ఉంది.

కానీ అందరు అత్తగార్లు అలానే ఉంటారని చెప్పలేం. కొంతమంది కోడళ్లను తమ కూతుళ్ల మాదిరిగానే చూసుకుంటారు. చాలా గౌరవం ఇవ్వడం, ప్రేమగా మాట్లాడటం, అన్ని విషయాల్లోనే అత్తాకోడళ్లు చాలా సర్దుకుపోయే తత్వం కలిగినవాళ్లూ ఉన్నారు. అయితే చాలామందికి అత్తగారంటే.. అత్తగారే.. ఆమె సమస్యే అన్న అభిప్రాయం ఉంది.

Why Are Indian Mother-In-Law's So Problematic

అయితే కొడుకు పెళ్లి అయిన తర్వాత కోడలితో సర్దుకుపోయే అత్తలు చాలా తక్కువమందని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. కొడుకుకి సంబంధించిన ప్రతి విషయంలో తలదూరుస్తూ ఉంటారని తేల్చాయి. ఇండియాకి చెందిన ఎక్కువమంది అత్తలకు ఆలోచనా శక్తి తక్కువగా ఉండటం వల్లే.. కోడళ్లు వాళ్లను భరించడం కష్టంగా భావిస్తున్నారట.

ఇప్పుడు భారతీయ అత్తలు కోడళ్లకు ఎలాంటి సందర్భంలో కష్టంగా, సమస్యగా మారుతున్నారో తెలుసుకుందాం. అలాగే ఇండియాకి చెందిన అత్తలు మాత్రమే ఎందుకు సమస్యగా మారుతున్నారో తెలుసుకుందాం..

కొడుకు దొంగిలించబడ్డాడనే అభిప్రాయం
తన కొడుకుని తన ఇంటి నుంచి దొంగిలించారనే అభిప్రాయం తల్లులకు ఉండటం వల్ల వాళ్లు సమస్యగా మారుతున్నారు. పెళ్లి తర్వాత వాళ్లు కొడుకుతో మునపటిలా దగ్గరగా ఉండలేకపోతున్నామనే అసూయ వల్ల వాళ్లు సమస్యగా మారుతున్నారు.

Why Are Indian Mother-In-Law's So Problematic

కొడుకు బాధ్యత మారడం వల్
అత్తలు అత్యంత సమస్యగా మారడానికి ముఖ్య కారణం వాళ్ల కొడుకులు తమను, తమ ఇంటిని, బాధ్యతలను, ప్రాముఖ్యతలను మార్చుకున్నారనే అభిప్రాయం వల్ల. తల్లిదండ్రుల కంటే.. భార్య విషయంలోనే ఎక్కువ ఫోకస్ ఉండటం వల్ల అత్త సమస్యగా మారుతోంది.

తల్లితో తక్కువ సమయం
పెళ్లి తర్వాత వాళ్ల కొడుకు తల్లితో గడిపే సమయం తగ్గుతుంది. దీనివల్ల తల్లులు సమస్యగా మారుతున్నారు. ఇలాంటి మార్పులు తల్లులలకు కష్టంగా ఉంటుంది. దీనివల్ల కోడళ్లపై ఈ ప్రతాపం చూపిస్తారు. కొడుకు నుంచి అటెన్షన్ పొందడం కోసం ఇలా ప్రవర్తిస్తారు.

Why Are Indian Mother-In-Law's So Problematic

ఒంటరిగా ఫీలవడం
తన కొడుకు జీవితంలోకి మరో వ్యక్తి రావడం వల్ల తాము ఒంటరిగా ఫీలవుతారు. అలాంటప్పుడు వాళ్ల విషయంలో చాలా వ్యతిరేక ఆలోచనలు వస్తాయి. అలాగే కొడుకు వైవాహిక జీవితంలో జోక్యం చేసుకోవడం వల్ల.. కొడుకు, కోడలు సమస్యగా భావిస్తారు.

English summary

Why Are Indian Mother-In-Law's So Problematic

Why Are Indian Mother-In-Law's So Problematic. Mother-in-laws, don't we all have a problem with them? Well, it is said that most of the Indian mother-in-laws out there are considered to be the problematic ones.
Story first published:Monday, May 30, 2016, 15:41 [IST]
Desktop Bottom Promotion