For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ భర్త కోసం కావాల్సిన దానికన్న ఎక్కువే చేస్తున్నారనడానికి సంకేతాలివిగో..!

ఇద్దరూ కలిసి పని చేసుకుంటే ఆ ఆనందమే వేరు కదా. మీ మీ పాత్రలనీ మీరూ మీ భర్తా ఆనందంతో నిర్వర్తిస్తే జీవితం హాయిగా ఉండదూ?? అలా జీవితం ఉండాలంటే మీ భర్తని ఇంటి పనుల్లో భాగస్వామి చెయ్యాలి. లేకపోతే ...

|

మీరు ఎవరితో అయినా ప్రేమలో ఉంటే వారి కోసం ఏదైనా చేస్తారు. అలా చెయ్యడంలో ఆనందముంది. కానీ పెళ్ళి విషయానికొస్తే అవసరాలు, మీ అంచనాలు, మీ భాగస్వామి పాత్ర వీటి గురించి విడమరచి మాట్లాడుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే కాలం గడుస్తున్న కొద్దీ మీరు బాధితులుగా మారే ప్రమాదముంది.

అలా అని మీ భర్తతో మీరు పోట్లాడక్కర్లేదు. ఇంటి పనుల్లో తను కూడా భాగస్వామి అయ్యేటట్లు చెయ్యడమెలాగా??

Signs You're Doing Too Much For Your Husband

ఇద్దరూ కలిసి పని చేసుకుంటే ఆ ఆనందమే వేరు కదా. మీ మీ పాత్రలనీ మీరూ మీ భర్తా ఆనందంతో నిర్వర్తిస్తే జీవితం హాయిగా ఉండదూ?? అలా జీవితం ఉండాలంటే మీ భర్తని ఇంటి పనుల్లో భాగస్వామి చెయ్యాలి. లేకపోతే బాధ్యతంతా మీ నెత్తిన వేసుకుంటే అతను సోమరిగా అయ్యే అవకాశం ఉంది. కింద మేము కొన్ని ఉదాహరణలిచ్చాము చూడండి.

సంకేతం # 1

సంకేతం # 1

మీరు మీ ఉద్యోగంతో బిజీగా ఉన్నా సరే అతన్ని మీరు ఏ పనీ చెయ్యనీయరు.మీకు ఒంట్లో బాగోలేకపోయినా సరే అతనికి విశ్రాంతినిచ్చి పనులన్నీ మీరే చెస్తారు.మీ భర్తని ప్రేమించడంలో తప్పు లేదు కానీ బాధ్యతంతా మీ నెత్తినే వేసుకుని అతనికి మీరు తప్పుడు సంకేతమిస్తున్నారు. ఇలా చెయ్యడం ద్వారా అతన్నుంచి మీరేమీ ఆశించట్లేదనే సందేశం ఇచ్చిన వారవుతారు.ప్రతీసారీ పని చెయ్యమని మీ భర్తని బలవంత పెట్టక్కర్లేదు కానీ అవసరమైనప్పుడు మీకు అతని సహాయం అందేలా చూసుకోవాలి. ఈ విషయాన్ని సూటిగా చెప్పలి కూడా.

సంకేతం # 2

సంకేతం # 2

ఏ బంధంలోనైనా ఒకరు బాగ అకష్టపడీతే మరొకరు సోమరి అయ్యే అవకాశముంది.అందువల్ల మీ అంచనాలని మీ భర్తతో చర్చించడం చాలా ముఖ్యం.ఇల్లు శుభ్రపరచమనో లేదా మరేదైనా చెయ్యమనో ఊరికే సతాయించక్కర్లేదు కానీ ఇంటి పనుల్లో అతని పాత్ర కూడా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం.

సంకేతం # 3

సంకేతం # 3

మీ ఇద్దరి మధ్య వాదన వచ్చినప్పుడు అతను మీరు గతంలో చేసిన తప్పులని ఎత్తి చూపుతాడా??అందుకు బదులుగా మీరు ఏమీ చెప్పకుండా ఏకాంతంలో ఏడుస్తున్నారా??అయితే మీరు అతని కోసం చాలా చేస్తున్నారన్న మాట. గత తప్పులని మర్చిపోదామని మీరిద్దరూ ఒక ఒప్పందానికి రావాలి.ఇద్దరూ మరొకరి తప్పొప్పుల పట్టిక పెట్టుకుని వాదన వచ్చినప్పుడు వాటిని ఎత్తి చూపడం వల్ల వాదనలు ఎటూ తేలకుండా పరిస్థితి మరింత అధ్వానమవుతుంది.

సంకేతం # 4

సంకేతం # 4

మనిద్దరి మధ్యా దాపరికం ఉండకూడదూ అంటూ అతను మీ ఫేస్‌బుక్,మెయిల్ తదితర పాస్‌వర్డ్స్ తీసుకుంటున్నాడా??మీరు మీ పాస్‌వర్డ్స్‌ని ఇవ్వడంలో తప్పులేదు అలాగే అతనివి కూడా అడిగి తీసుకోండి.

సంకేతం # 5

సంకేతం # 5

తరచుగా ఆఫీసయ్యాకా స్నేహితులతో సరదాగా త్రాగుతూ గడిపి ఇంటికొస్తున్నాడా??అయితే మీరు అతనికోసం చాలా ఎక్కువే చేస్తున్నట్లు. మీరు కూడా అలా సరదాగా స్నేహితులతో గడపగలరనీ కానీ వైవాహిక బంధంతో ఒక్కటయ్యాకా కుటుంబంతో గడపడం ముఖ్యమని తెలియచెయ్యండి.స్నేహితులతో పార్టీలు వారానికో నెలకో ఒకసారి చేసుకోవడంలో తప్పు లేదు.

సంకేతం # 6

సంకేతం # 6

అతను డబ్బుని ఎలా ఖర్చు చేస్తాడు?? తన జీతంతో పాటు మీ జీతాన్ని కూడ వాడెస్తున్నాడా??అయితే మీరు అతనికోసం చాలానే చేస్తున్నట్లు.డబ్బులు ఎలా ఖర్చు పెట్టుకోవాలి అన్న దానిపై ఇద్దరూ ఒక అవగాహనకి రండి.లేకపోతే ఈ ఖర్చు పెట్టే అలవాటే భవిష్యత్తులో పెద్ద గొడవకి దారి తీస్తుంది.

సంకేతం # 7

సంకేతం # 7

మీ పిల్లల ఆలనా పాలనా ఎప్పుడూ మీరే చూసుకుంటున్నారా?? అయితే ఇది తప్పు.బాధ్యతలు పంచుకోవడానికి సిద్ధపడినప్పుడే భార్య భర్తలు ఇంకో ప్రాణికి జన్మనిస్తారనీ కావున తండ్రి పాత్రకి న్యాయం చెయ్యమని సున్నితంగా చెప్పండి.దీనివల్ల తండ్రిగా తన బాధ్యతలని మీ భర్త గుర్తెరగగలడు.

English summary

Signs You're Doing Too Much For Your Husband

Doing everything for your husband isn't a bad thing. But when your husband is lazy, your life might turn miserable later. Here are some signs...
Desktop Bottom Promotion