తెలుపు వర్ణం వినాయకుడి విగ్రహం లేదా ఫోటోని పూజిస్తే ఏమవుతుంది ?

సరైన ప్లేస్ లో వినాకుడి విగ్రహం పెట్టుకుంటే.. సంతోషం, సక్సెస్, సంపద జీవితంలో పొందుతారు. మరి ఎలాంటి విగ్రహం, ఎక్కడ పెట్టుకోవాలో చూద్దామా..

Posted By:
Subscribe to Boldsky

వినాయకుడినే గణపతి, గణేశుడు, బొజ్జ గణపయ్య అని పిలుస్తారు. ఆది దేవుడిగా, మొదట పూజలు అందుకునే దేవుడిగా వినాయకుడికి హిందూ సంప్రదాయంలో చాలా ప్రాధాన్యత ఉంది. భక్తులు కోరుకునే సంపద, శ్రేయస్సు అందించే గొప్ప దేవుడు వినాయకుడు.

ganesh idol

హిందూ పురాణాల ప్రకారం.. ఏ పూజ అయినా, ఎలాంటి కార్యమైనా.. ముందుగా వినాయకుడిని పూజించడం ఆనవాయితీ. చాలామంది ఇంట్లో లేదా ఆఫీస్ లో వినాయకుడి విగ్రహం పెట్టుకుంటూ ఉంటారు. అయితే.. అయితే చాలామందికి ఎలాంటి విగ్రహం లేదా ఎలాంటి ఫోటో లేదా ఏ రంగు విగ్రహం, ఎక్కడ పెట్టుకోవాలి అనే విషయం తెలియదు.

సరైన పద్ధతిలో, సరైన వాస్తు ప్రకారం వినాయకుడి విగ్రహం లేదా ఫోటోని పెట్టుకోవడం వల్ల.. పాజిటివ్ ఎనర్జీ మరింత పెరుగుతుంది. ఆ దేవుడి అనుగ్రహం మరింత మిన్నగా ఉంటుంది. సరైన ప్లేస్ లో వినాకుడి విగ్రహం పెట్టుకుంటే.. సంతోషం, సక్సెస్, సంపద జీవితంలో పొందుతారు. మరి ఎలాంటి విగ్రహం, ఎక్కడ పెట్టుకోవాలో చూద్దామా..

ఆఫీస్ లో

ఆఫీస్ లో నిలబడి ఉండే వినాయకుడి విగ్రహాన్ని పెట్టుకోవాలి. ఇలాంటి విగ్రహం వర్క్ ప్లేస్ లో పెట్టుకోవడం వల్ల వర్క్ విషయంలో ఎనర్జీ, ఉత్సాహం పెరుగుతాయి.

కూర్చున్న వినాయకుడు

కూర్చుని, తొండం ఆయన ఎడమ చేతివైపు తిరిగి ఉన్న వినాయకుడి విగ్రహం పెట్టుకుంటే.. సక్సస్ తో పాటు, అదృష్టం మీ సొంతమవుతుంది.

సంతోషం

సంతోషం, ప్రశాంతత, ఐశ్వర్యం పొందాలనుకునేవాళ్లు తెలుపు వర్ణంలోని వినాయకుడి విగ్రహాన్ని లేదా ఫోటోని ఇంట్లో పెట్టుకోవాలి.

పూజ గదిలో

మీ పూజ గదిలో కేవలం ఒక వినాయకుడి విగ్రహాన్ని మాత్రమే పెట్టుకోవాలి. రెండు లేదా అంత కంటే ఎక్కువ వినాయకుడి విగ్రహాలను పెట్టుకుంటే.. ఆయన భార్యలైన రిధి, సిద్ధిలకు ఆగ్రహం వస్తుంది.

అభివృద్ధి పొందాలనుకునేవాళ్లు

తమలో వృద్ధిని కోరుకునే వాళ్లు, సంపద పెరగాలని కోరుకునేవాళ్లు.. ఎరుపు, ఆరంజ్ కలిసిన (రెడిష్ ఆరంజ్) కలర్ వినాయకుడి విగ్రహాన్నిపూజించాలి.

వాస్తు దోషం

ఇంట్లో వాస్తు దోషంతో బాధపడేవాళ్లు.. వినాయకుడు, స్వస్తిక్ కలిసి ఉండే విగ్రహాన్ని లేదా ఫోటోని ఇంట్లో పెట్టుకోవాలి. అప్పుడు ఎలాంటి వాస్తు దోషమైనా తొలగిపోతుంది.

ఎలుక

వినాయకుడి వాహనం అయిన ఎలుక వినాయకుడి విగ్రహంతో పాటు ఉండేలా జాగ్రత్తపడాలి. ఇలా వినాయకుడితో పాటు, ఎలుక ఉన్న విగ్రహం ఇంట్లో పెట్టుకుంటే.. చాలామంచిది.

గరిక

వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన గరిక గడ్డిని.. వినాయకుడి విగ్రహానికి ప్రతిరోజూ సమర్పించాలి. ఇలా చేస్తే మీ కోరికలు నెరవేరుతాయి. అలా ఓం గం గణపతయే నమ: అని మంత్రం జపించాలి.

English summary

10 Important Things To Check Before Placing Ganesha's Idol At Home or Office

10 Important Things To Check Before Placing Ganesha's Idol At Home or Office. If you are wondering which type of Ganesha idol is the best for you or which one to be kept at workplace, click on the following slides.
Please Wait while comments are loading...
Subscribe Newsletter