For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మన ఇండియాలో బాగా ప్రసిద్ది చెందిన మూఢనమ్మకాలు

|

మూడనమ్మకాలకు మన ఇండియా పెట్టింది పేరు, ప్రతి సంస్కృతి, మతం మరియు ప్రాంతాల వారిగా వారికి తగ్గ విధంగా కొన్ని మూఢనమ్మకాలను కలిగి ఉన్నారు.

అందులో కొన్ని మూఢనమ్మకాలకు కొన్ని సైటిఫిక్ కారణాలు కూడా ఉన్నాయి, వాటిలో కొన్నినిజంగా సిల్లీగా అనిపిస్తాయి. దేశవ్యాప్తంగా ఉన్నఆధునీకరణ మరియు కొత్త జనరేషన్ వారు కూడా ఇటువంటి పిచ్చి మూడనమ్మకాలను నమ్ముతున్నారు. ఇలా మూడ నమ్మకాలతో పల్లెలు, గ్రామాల్లోనే కాదు, పట్టణాల్లో కూడా ఎక్కవుగా ప్రబలుతున్నాయి.

అటువంటి మూఢనమ్మకాలను మీరు నమ్మతారో లేదా అనుసరిస్తారో లేదా అది వేరే విషయం. అయితే మనలో కొంత మంది ఇటువంటి మూఢనమ్మకాలను రోజులో లేదా డేలైఫ్ లో నమ్మేవారిని మాత్రం ఏం చేయలేం. అలా సిల్లీగా అనిపించి కొన్ని మూఢనమ్మకాలను కొన్ని సామాజిక చిక్కులను కలిగి ఉన్నాయి.

మరి మన ఇండియాలో ఉండే పాపులర్ ఇండియన్ మూఢనమ్మకాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి...

ఒక్క రూపాయి ప్రభావం:

ఒక్క రూపాయి ప్రభావం:

ఒక్క రూపాయిని మన భారతీయ సంస్కృతిలో ఒక పవిత్రమైనదిగా భావిస్తారు. భారతదేశంలో వివాహాలు మరియు ఇతర వేడుకలలో 101, 501, 1001 ఇలా ఒక్కరూపాయిని చేర్చి గిఫ్ట్ గా ఇవ్వడం ఒక సంప్రదాయ పద్దతిగా ఉన్నది. అయితే, ఎల్లప్పుడూ బేసి సంఖ్యకు ఒక రూపాయి చేర్చి అధివడం ఒక సంప్రదాయంగా నమ్ముతారు. ఇది ఎంత వరకూ నిజమో?

నిమ్మకాయలు-పచ్చిమిర్చిని కుట్టి వ్రేలాడదీయడం:

నిమ్మకాయలు-పచ్చిమిర్చిని కుట్టి వ్రేలాడదీయడం:

ఇండియాలో చాలా ఇల్లలో ప్రధాన ద్వారం వద్ద ఇలా పచ్చిమిర్చి మరియు నిమ్మకాయలను వ్రేలాడదియ్యడంను గమనించి ఉంటారు. ఇంటికి ద్రుష్టి తగలకుండా ఇలా కట్టడం చాలా మందిలో ఉన్న ఒక మూఢనమ్మకం. అందులోనే పచ్చిమర్చిని ఏడు తీసుకోవడం ప్రత్యేకత. దీన్ని ఒక మ్యాజికల్ నెంబర్ గా తీసుకుంటారు. ఇది ఇంటికి మంచి చేస్తుందని నమ్ముతారు.

బ్లాక్ క్యాట్ :

బ్లాక్ క్యాట్ :

మన ఇండియాలో ఉన్న మరో మూఢనమ్మకం ఎదురుగా నల్లపిల్ల అడ్డువచ్చినా లేదా ఎదురు వచ్చిన అపశకునంగా నమ్ముతారు. ఇది చాలా ప్రదేశాల్లో ఒక మూఢనమ్మకంగా బలంగా స్థిరపడిపోయింది. ఈ మూడనమ్మకాన్నిచాలా మంది అనుసరిస్తుంటారు. మనం ఎక్కడికైన బయలుదేరినప్పుడు నల్లపిల్లి అడ్డువస్తే అది చెడు జరుగుతుందని, ఏదో హానీ తలపడబోతున్నదని నమ్ముతారు.

దురదృష్టమైన శనివారం:

దురదృష్టమైన శనివారం:

చాలా మంది శనివారంను శనిదేవునికి ఇష్టమైన దినంగా నమ్ముతారు. శనివారం ప్రయాణం చేయడం అనుకూలమైనది కాదు భావిస్తారు. అలాగే ఏ పవిత్రమైన వేడకైన శనివారం జరుపుకోవడానికి ఇష్టపడరు. ఏ శుభకార్యాన్ని నిర్వహించరు.

వారి కళ్ళు చాలా చెడు అంటుంటారు:

వారి కళ్ళు చాలా చెడు అంటుంటారు:

మన ఇండియాలో మరో ముఖ్యమైన మూఢనమ్మకం కొందరి కళ్ళు చెడుకలిగిస్తాయని అంటుంటారు. అలా చెడు కళ్ళు'చూపు స్వభావం ఉన్నవారు ఉద్దేశ్యపూర్వకంగా చూడకపోవచ్చు. కానీ అలా జరగడం ఉద్దేశపూర్వకంగా జరగదు. కానీ దీన్ని ఒక మూఢనమ్మకంగా అనుసరిస్తుంటారు. ఎదువారి చూసి అసూయ పడటం లేదా ఎక్కువగా ప్రశంసించడం ద్వారా ఎదుటి వ్యక్తికి చెడు జరగడం లేదా జబ్బు పడటం జరుగుతుందని నమ్ముతారు.

రావి చెట్టు:

రావి చెట్టు:

ఇండియాలో చాలా ప్రదేశాల్లో రావి చెట్టు దెయ్యాలు మరియు ఆత్మలు నివాసం ఉండే చెట్టుగా నమ్ముతారు. ఈ మూఢనమ్మకంలో ఎంత నిజం ఉంది? సాధారణంగా రాత్రుల్లో రావిచెట్టు ఎక్కువగా కార్బన్ డై ఆక్సైడ్ ను విడుదల చేస్తుంది. ఇది ఏ మానవుడికైనా చాలా ప్రమాదకరమైనది. ఆ చెట్టుక్రింది నిద్రించినా లేదా నిలబడినా వారికి అసౌకర్యంగా అనిపిస్తుంది. ఇది తెలియని వారు చాలా మంది రావి చెట్టు దెయ్యాల చెట్లుగా భావిస్తూ మూఢనమ్మకాలను అనుసరిస్తుంటారు.

గోళ్ళు కట్ చేసుకోవడం:

గోళ్ళు కట్ చేసుకోవడం:

మరో మూఢనమ్మకం, వారంలో ప్రత్యేకమైన రోజుల్లో మాత్రమే గోళ్ళు కట్ చేయాలని భావిస్తుంటారు. అలాగే సాయంత్రంలో గోళ్ళు కట్ చేయకూడదని కూడా నమ్ముతారు. ఇంకా మంగళ వారం, గురువారం మరియు శనివారాల్లో గోళ్ళు కట్ చేయకూడదని ప్రగాఢ విశ్వాసం కలిగి ఉంటారు. ఇలా చేయడం వల్ల చెడు జరుగుతుందని చాలా మంది నమ్ముతారు.

రుతుక్రమంలో అపోహలు:

రుతుక్రమంలో అపోహలు:

ప్రతి ఒక్క మూఢనమ్మకంలోనూ మహిళల యొక్క రుతుక్రమం లేదా నెలసరి సంబంధించి ఉంటుంది . అంతే కాకుండా పీరియడ్స్ లో ఉన్న మహిళలను అపరిశుభ్రమైనవారిగా లేదా మలినాలతో ఉన్నవారిగా భావిస్తారు. ఎవరైతే రుతుక్రమంలో ఉంటారో వారిని వంటగది మరియు పూజగదిలోకి అనుమతించరు అంతే కాదు, కొన్ని ప్రత్యేకమైన పనులను కూడా చెయ్యడానికి వారిని అనుమతించరు. రుతుక్రమంలో ఉన్న మహిళ ముఖం చూడటం వల్ల చెడు జరుగుతుందని మూఢనమ్మకం కూడ ఉన్నది. అందుకే రుతుక్రమంలో ఇతరులకు కనబడకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి గదుల్లో వారిని ఉండనిస్తారు.

చంద్రగ్రహణం ఎఫెక్ట్:

చంద్రగ్రహణం ఎఫెక్ట్:

అనేక మూఢనమ్మకాల్లో ఇది ఒకటి. హిందూ మతం పురాణాల ప్రకారం, గ్రహణం రోజున, సూర్యుడు లేదా చంద్రుడు చూడరాదని నమ్ముతారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలను భయట తిరగనివ్వరు. పుట్టి శిశువు ఎటువంటి సమస్యలు లేకుండా పుట్టాలంటే చంద్ర మరియు సూర్య గ్రహణం రోజుల్లో బయటకు పంపరు. ఇది ఒక బలమైన మూఢనమ్మకంగా మన ఇండియాలో పురాతన కాలం నుండి ఉంది. గ్రహణం రోజు ఆహారం వండటం కానీ, లేదా తినడం కానీ చేయకూదని భావిస్తారు. కొన్ని ప్రాంతాలల్లో తులసి మొక్క యొక్క ఆకును ఆహార పదార్థాల మీద ఉంచడం వల్ల ఎటువంటి దోషం ఉండదని నమ్ముతారు.

వితంతువు:

వితంతువు:

మరో బాధకరమైన మూఢనమ్మకం భారతదేశంలో ఇప్పటికీ చాలా ప్రబలంగా ఉన్నది వితంతువు. భారతదేశంలో వితంతువులను జంతువుల కంటే దారుణంగా వ్యవహరిస్తారు. వితంతువులు ఎటువంటి ఆభరణాలు ధరించడానికి అనుమతి లేదు మరియు ఆమె జీవితాంతం తెల్ల దుస్తులు మాత్రమే ధరించాలని నియమ నిబంధనలు పెడుతుంటారు. అలాగే ఆమె కారం ఆహారాలు తినకూడదు మరియు శాఖాహారం మాత్రమే తినాలనే నిబంధనలు కూడా ఉన్నాయి. మరో బాధాకరమైన విషయం వితంతువు ముఖం చూడటం దురదృష్టముగా భావిస్తుంటారు.

English summary

10 Popular Indian Superstitions

India has always been a land of superstitious people. Every culture, religion and region have their own sets of superstitions. Though some superstitions have scientific reasons attached to them, most of them seem extremely silly.
Desktop Bottom Promotion