For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రావణుడు రాక్షసుడని తెలుసు.. మరి ఎవరి భక్తుడో తెలుసా ?

By Swathi
|

చిన్నప్పటి నుంచి రావణుడు అంటే విలన్ అని మనందరికీ తెలుసు. రామాయణంలో రాముడి గురించి ఎంత తెలుసో.. రావణాసురుడి గురించి కూడా అంతే తెలుసు. రామాయణంలో రాముడు నాయకుడైతే... రావణుడు ప్రతినాయకుడు. ధర్మములలోగాని, నీతులలో గాని ఎవరూ తీసిపోరు.

READ MORE: వాలి అపహరణ నుండి సుగ్రీవుడు తన భార్యను ఎలా రక్షించుకొన్నాడు

రావణుడు లంకకు అధిపతి. ఈయనకు దశముఖుడు అంటే పది ముఖములు, దశగ్రీవుడు అంటే పది శీర్షములు, దశకంఠుడు అంటే పది గొంతులు కలిగినవాడని అనేక పేర్లు ఉన్నాయి. కైకసికి పుట్టిన తొలి కొడుకే రావణుడు. రావణునికి కుంభకర్ణుడు, విభీషణుడు అనే సోదరులతో పాటు శూర్పణఖ సోదరి కూడా వుంది.

READ MORE: రామాయణంలో రావణుని భార్య యొక్క ఆశ్చర్యమైన కథ

రావణాసురుడి భార్య మండోదరి. ఈమె పతివ్రత, మయుడి కూతురు. ఇంద్రజిత్తు, ప్రహస్థుడు, అతికాయుడు, అక్షయకుమారుడు, దేవాంతకుడు, నరాంతకుడు, త్రిశిరుడు అనే ఏడుమంది కొడుకులున్నారు. అయితే ఇలాంటి విషయాలన్నీ రామాయణం తెలిసిన ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటాయి. కానీ.. రావణుడి గురించి మిమ్మల్ని ఆశ్చర్యపరిచే మరిన్ని ఆసక్తికర విషయాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

రావణుడు, సీత

రావణుడు, సీత

రావణుడు సీతను అపహరించాడని ఎప్పుడూ చెబుతూ ఉంటాం. అయితే జైనుల సిద్ధాంతం ప్రకారం రామాయణంలో రావణుడు సీత తండ్రి అట. ఇదో ఆశ్చర్యకర విషయమే కదా.

తెలివి

తెలివి

పది తలలు ఉండటం వల్ల రావణుడిని దశగ్రీవ అని పిలుస్తారు. ఇది అతని గొప్ప తెలివి తేటలని సూచిస్తుంది. అంతేకాదు.. రావణుడు విద్యకు చాలా ప్రాధాన్యత ఇచ్చేవాడట.

రావణుడు, సైన్స్

రావణుడు, సైన్స్

రావణుడు సైన్స్, మెడిసిన్స్ స్కాలరట. ఎందుకంటే.. ఆ కాలంలోనే అతను పుష్పక విమానంలో తిరిగేవాడు. దీన్ని బట్టి రావణాసురుడికి సైన్స్ పై ఉన్న మక్కువ తెలుస్తోంది.

రావణుడి అందం

రావణుడి అందం

రావణుడికి నగలు, బట్టలు అంటే చెప్పుకోలేని అభిరుచి ఉండేదని తెలుస్తోంది. అలాగే అతను చాలా అందంగా ఉండేవాడని పురాణాలు చెబుతున్నాయి.

రుద్రవీణ

రుద్రవీణ

భారతదేశంలో శాస్త్రీయ పరికరాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగినది రుద్రవీణ. దీన్ని రావణుడే కనిపెట్టారని మీకు తెలుసా..

కులం

కులం

రావణుడు కులానికి వ్యతిరేకం. అతను కులాలు పట్టింపులు పాటించలేదని పురాణాలు చెబుతున్నాయి.

జ్యోతిష్యం

జ్యోతిష్యం

రావణాసురుడు జ్యోతిష్యంలో గొప్ప నిష్ణాతుడట. ఆయనను మాస్టర్ ఆస్ట్రాలజర్ అని పిలుస్తారు.

భర్త

భర్త

రావణుడికి రకరకాల పేర్లున్నాయి. అందులో ఒకటి దశనన్. రావణుడు మంచి సోదరుడిగా, ఆదర్శ భర్తగా గుర్తింపు పొందాడు.

శివ భక్తుడు

శివ భక్తుడు

రావణాసురుడు గొప్ప శివ భక్తుడు. రాత్రి, పగలు శివుడిని అమితంగా పూజించేవాడట.

మండోదరి

మండోదరి

హనుమంతుడి బలగం రావణుడి భార్య మండోదరితో అసభ్యంగా ప్రవర్తించిందని రామాయణంలోని కొన్ని సంస్కరణలు వివరిస్తున్నాయి. కానీ.. రావడణుడు ఎలాంటి అగ్నిపరీక్ష పెట్టకుండా.. ఆమెను అంగీకరించాడని చెబుతాయి.

భక్తులు

భక్తులు

రాముడికి ముల్లోకాల్లోనూ భక్తులున్నారు. ఆయన్ని దేవుడిగా పూజిస్తారని తెలుసు. కానీ.. రాముడితో పోరాడిన రావణుడికి కూడా భక్తులున్నారంటే నమ్ముతారా ? నిజమే భారతదేశంలోనూ, శ్రీలంక లోని కొన్ని ప్రాంతాల్లో రావణుడిని దేవుడిగా పూజిస్తారట.

Story first published: Tuesday, February 9, 2016, 17:35 [IST]
Desktop Bottom Promotion