For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహాభారతంలో అత్యంత అందమైన మహిళలు

By Super
|

భారతదేశంలో మహాభారతం బాగా ప్రాచుర్యం పొందిన ఇతిహాసం. ఆశాశ్వతమైన మానవ శరీరం గురించీ, మంచి మరియూ చెడు కర్మలు వాటి అనుసారం నుంచి వచ్చే ఫలితాలు ఈ ఇతిహాసంలో అత్యంత అద్భుతంగా వివరించబడ్డాయి.

అర్జునుడి గురించి మీకు తెలియని 10 రహస్య విషయాలు

మహాభారతంలో మేధస్సు, ధైర్యం, సౌందర్యం కలగలిసిన ఎన్నో ఉత్తమమైన స్త్రీ పాత్రలు మనకి కనపడతాయి. ఈ స్త్రీ పాత్రలు ఎంత ఉత్తమమైనవంటే వారిని చూసి నేటి స్త్రీలు కూడా శౌర్య పరాక్రమాలతో ఎలా జీవించాలో తెలుసుకోవచ్చు.

రామాయణంలో రావణుని భార్య యొక్క ఆశ్చర్యమైన కథ

ఆనాటి పురుషాధిక్య సమాజంలో నిర్భయంగా తమ గళాన్ని వినిపించిన స్త్రీ పాత్రలని చూస్తే వీరు అసలు ఆ కాలంలో పుట్టవలసినవారు కాదు అనిపిస్తుంది. ఈ పాత్రలు మనకి నిర్భయంగా భావాన్ని వ్యక్తం చేయడాన్ని, ధైర్యం, విశ్వాసాన్ని, అంకితభావాన్ని నేర్పుతాయి. మహాభారతంలో అత్యంత అందమైన, అధ్భుత మేధస్సు, సౌందర్యం కలగలిసిన 10 మంది స్త్రీ పాత్రల గురించి తెలుసుకుందాము.

1.ద్రౌపతి:

1.ద్రౌపతి:

మహాభారతంలో పది అందమైన స్త్రీలలో ద్రౌపతి లేదా పాంచాలి తప్పక ఉండి తీరుతుంది. పాంచాల దేశపు మహారాజయిన ద్రుపదుని కుమార్తె ఈమె. మహాభారతం రెండో సగంలో ఆమె పోషించిన పాత్ర శ్లాఘనీయం. అర్జునుడు ఆమెని స్వయంవరంలో గెలిచినా చివరికి ఐదుగురు పాండవులకీ ఉమ్మడి పత్ని అయ్యింది ఈమె. ద్రౌపతి ఎప్పుడూ నమ్మి పూజించే శ్రీకృష్ణుడే ఈమెని నిండు కౌరవ సభలో వస్త్రాపహరణం సమయంలో అవమానం నుంచి గట్టెక్కించాడు.

2.అంబ:

2.అంబ:

కాశీని పరిపాలించే మహారాజుగారికి అంబ, అంబిక, అంబాలిక అని ముగ్గురు కుమార్తెలు. వారిలో అంబ పెద్దది. మహాభారతంలో అందమైన స్త్రీలలో ఒకరైన ఈమెకి ఆమె తండ్రిగారు స్వయంవరాన్ని ఏర్పాటు చేసారు. ఆ సమయంలో మహారాజు భారతదేశంలోని మహారాజులందరికీ ఆహ్వానాలు పంపి హస్తినాపుర మహారాజుకి పంపండం మరిచిపోయాడు. ఇది చూసి ఆగ్రహించిన భీష్ముడు తన మేనళ్ళుడైన విచిత్రవీర్యునికి అంబనిచ్చి పెళ్లి చేయదలచి అంబ, అంబిక, అంబాలిక ముగ్గురినీ అపహరించాడు. కానీ అప్పటికే స్వయంవరంలో తాను సాళ్వ మహారాజుకి మనసిచ్చానని అంబ ధైర్యంగా తన ప్రేమని భీష్ముని ముందు వ్యక్తపరచడం చూస్తే ఆ కాల పరిస్థితులకి ఇది చాలా ధైర్యమైన చర్య అని చెప్పచ్చు.

3.ఊర్వశి

3.ఊర్వశి

ఊర్వశి ఇంద్రుని దర్బారులో అందమైన నాట్యగత్తె. అర్జునుని మీద మనసుపడి అతనిని తన అందచందాలతో కవ్వించాలని చూసి భంగపడుతుంది. తనని తిరస్కరించాడని ఆగ్రహించిన ఊర్వశి అర్జునుడు తన మగతనం కోల్పోవాలని శపిస్తుంది. ఆ కాలంలోనే తనకి ఒక పురుషునిపై ఉన్న కామాన్ని ధైర్యం గా వ్యక్తపరిచిన స్త్రీ ఊర్వశి.

4.కుంతి

4.కుంతి

కుంతి మహాభారతంలో అందగత్తెలైన స్త్రీలలో ఒకరు. ఆమెకి వివాహానికి పూర్వమే సూర్యుని ద్వారా కర్ణుడు జన్మించాడు. కానీ ఈమె ఆటలాడుకుంటూ ఆకతాయితనమంతో సూర్యుడిని పిలిచి కొడుకుని పొందింది. కానీ ఆ తరువాత ఈ చర్య వల్ల తనకి తన కుటుంబానికి అప్రతిష్ఠ కలుగుతుందని భావించి ఆ పిల్లవాడిని ఒక బుట్టలో పెట్టి నదిలో విడిచిపెట్టేసింది.

5.గంగ:

5.గంగ:

శంతన మహారాజు మొదటి భార్య గంగ. ఈమె అందాన్ని చూసి మోహించిన శంతన మహారాజు తనని మనువాడాల్సిందిగా గంగని కోరతాడు. అయితే ఆమె 3 నిబంధనలతో శంతన మహారాజుని వివాహమాడుతుంది. అందులో మొదటి నిబంధన, తను ఎక్కడనుండి వచ్చింది ఇత్యాది వివరాలేమీ మహారాజు అడగకూడదు. రెండోది, తాను ఏమి చేసిన మహారాజు ఆమె చర్యలని అవి మంచివే అగు గాక లేదా చెడువే అగు గాక, ఆమె చర్యలని మన్నించాలి. ఇక మూడో నిబంధన, పై రెండింటిలో ఏ ఒక్క దానిని మహారాజు అతిక్రమించినా ఆమె మహారాజుని వదిలి వెళ్ళిపోతుంది.

6.ఉలూపి

6.ఉలూపి

ఉలూపి అందమైన నాగ కన్య. ఈమె అర్జునుని మోహించి అతన్ని వివాహమాడాలనుకుంటుంది. కొన్ని లేపనాల ద్వారా అర్జునుని స్పృహ కోల్పోయేట్లు చేసి అర్జునుని అపహరించి అప్పుడు తన మనసుని అర్జునునికి తెలియచేసింది.

7.సుభద్ర

7.సుభద్ర

బలరామ, శ్రీ కృష్ణుల సోదరి ఈమె. ఆమెని చూసి మోహించిన అర్జునుడు ఆమెని వివాహమాడాలనుకుంటాడు. బలరాముడు తన ప్రియ శిష్యుడైన దుర్యోధనునికి సుభద్రని ఇవ్వాలనుకుంటాడు. ఇది ఇష్టంలేని శ్రీ క్రిష్ణుడు ఆమెని అపహరించి తీసుకెళ్లమని అర్జునునికి ఉపదేశిస్తాడు.

8.సత్యవతి

8.సత్యవతి

సత్యవతి శంతన మహారాజు గారి రెండవ భార్య. ఈమె మత్స్యకారుల కుటుంబానికి చెందినది.ఆమె అందానికి, ఆమె నుండీ వెలువడే కస్తూరి పరిమళానికి మహారాజు ఆకర్షితుడయ్యి మనసు పారేసుకుంటాడు.తనకి పుట్టే కుమారులే సిఁహాసనాన్ని అధిరోహించేలా మహారాజునుండి వాగ్దానం తీసుకుని ఈమె మహారాజుని వరించింది.

9.గాంధారి

9.గాంధారి

సుబల మహారాజు కుమార్తె గాంధారి. ఈమె యవ్వనంలో మహాశివుడిని పూజించింది.అందువల్ల శివుడు ఆమెకు నూరుగురు కుమారులు కలిగేలా ఆశీర్వదించాడు.ధృతరాష్టృడిని వివాహమాడిన ఈమె భర్త గుడ్డివాడని తెలియగానే తాను కూడా కళ్ళకి గంతలు కట్టుకుని భర్తని అనుసరించింది.తన భర్త కోసమని స్వచ్ఛందంగా కంటి చూపుని జీవితాంతం త్యాగం చేసిన ఈమె మహాభారత అందగత్తెలలో ఒకతి.

English summary

9 Most Beautiful Women Of Mahabharata

9 Most Beautiful Women Of Mahabharata. Mahabharata is one of the most renowned epics of India. It conveys an extraordinary example of morality, the difference between the good and bad deeds and their outcomes.
Story first published: Thursday, February 18, 2016, 17:57 [IST]
Desktop Bottom Promotion