For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దుర్గా పూజలో ప్రాతినిధ్యం వహించిన 9 ఆచారాలు:నవరాత్రి స్పెషల్

|

ఎక్కువ మంది ప్రజలకు 'దుర్గ పూజ' గురించి తెలుసు, కానీ ఆ పూజలో ఇమిదిఉన్న ఆచారవ్యవహారాల గురించి తెలియదు. దుర్గపూజ నిర్వహించే సమయంలో జరిపే ప్రతి ఒక్క క్రియకు ఒక్కో ప్రాముఖ్యత ఉన్నది. మీరు నిజంగా ఒక నిర్దిష్ట మార్గంలో దుర్గపూజ ఎందుకు జరుపుకుంటాము?అది తెలుసుకోవాలనుకుంటే, అసలు ఈ పూజ వెనుక ఉన్న పౌరాణిక కథ తెలుసుకోవలిసిన అవసరం ఎంతైనా ఉన్నది. దుర్గ దేవి, ప్రతి సంవత్సరం ఆమెను భక్తులు సందర్శించడానికి ఆమె స్వర్గనివాసమైన, కైలాసం నుండి భూమిపైకి దిగివొస్తుంది.

దుర్గాదేవి తన పిల్లలైన దేవి లక్ష్మి, దేవి సరస్వతి, గణేషుడు మరియు కార్తీక్ తో వస్తుంది. దుర్గా పూజ నిర్వర్తించేపుడు జరిపే ఆచారవ్యవహారాలలో ఈ దేవుళ్ళు మరియు దేవతలు ఇమిడి ఉన్నారు. దేవి పక్ష లేదా ఈ పూజ కోసం జరిపే యజ్ఞాది కార్యక్రమాలు 10 రోజుల ముందు వొచ్చే మహాలయ నుండి ప్రారంభమవుతుంది. ప్రధాన పూజ నవరాత్రులలో 6వ రోజు, మహాషష్టి నుండి మొదలవుతుంది.

మహా అష్టమి సాయంత్రం గొప్పగా 'సంధి పూజ' నిర్వహిస్తారు. ఈ పూజ అష్టమి మరియు నవమి యొక్క సంధి తరుణంలో జరుగుతుంది. ఎంతో సరదాగా, ఉత్సాహంగా దుర్గా పూజను, దశమి లేదా దసరా రోజున జరుగుతుంది. దుర్గా పూజ సందర్భంగా 'సిందూర ఖేల', వివాహితులు అయిన మహిళలు సింధూరం తో దేవిని అలంకరిస్తారు మరియు ఈ సమయంలో ఒకరి మీద ఒకరు వసంతం చల్లుకుంటారు.

దుర్గపూజకు సంబంధించిన అన్ని ముఖ్యమైన ఆచారాలు క్రింద ఇవ్వబడ్డాయి. మీరు నిజంగా దుర్గ పూజను ఎందుకు జరుపుకుంటున్నాం అని తెలుసుకోవాలనుకుంటే , మీరు ఈ పూజ యొక్క ప్రాముఖ్యతను ఇక్కడ చదివి తెలుసుకోండి.

తర్పణం : మహాలయ

తర్పణం : మహాలయ

మహాలయ యొక్క అమావాస్యనుండి, దేవిపక్షం ప్రారంభమవుతుంది. ఈ రోజు నుండి దుర్గదేవి కైలాసం నుండి ఆమె ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఈ రోజున, ప్రజలు చనిపోయిన తమ పూర్వీకులు మరియు వెళ్ళిపోయిన వారి పేరున నీటితో తర్పణాలను వొదులుతారు. జ్ఞాపకార్థంగా జరిపే పవిత్రమైన ఈ చర్యతో దుర్గా పూజ ఉత్సవాలు ప్రారంభం అవుతాయి.

కాలపరంభో : మహాషష్టి

కాలపరంభో : మహాషష్టి

ఈ రోజున దుర్గాదేవి నైతిక ప్రపంచానికి చేరుకుంటుంది మరియు ఈ విశిష్టతకు గుర్తుగా , ఆమె ముఖం ఏ అలంకరణతో కప్పి ఉండదు.. కాలపరంభో పూజ నవరాత్రుల పూజ ప్రారంభానికి గుర్తన్న మాట మరియు తరువాత బోధన మరియు అధిబాస్ ఉంటుంది.

కోలా భోహ్ : మహాసప్తమి

కోలా భోహ్ : మహాసప్తమి

కోలా భోహ్, అరటి మొక్కతో రూపొందించి, దీనిని గణేషుని యొక్క వధువుగా పరిగణిస్టారు. ఆమెకు ప్రత్యూష వేళకు ముందు స్నానం చేయిస్తారు మరియు మహా సప్తమి రోజున గణేశుడి పక్కన ఉంచుతారు.

తొమ్మిది మొక్కల పూజ: మహాసప్తమి

తొమ్మిది మొక్కల పూజ: మహాసప్తమి

దుర్గ దేవతయొక్క తొమ్మిది రూపాలకు సంకేతాలుగా తొమ్మిది రకాల మొక్కలకు పూజలు ఈ మహాసప్తమి రోజున జరపటం మరొక సంప్రదాయం.

కుమారి పూజ: మహా అష్టమి

కుమారి పూజ: మహా అష్టమి

మహా అష్టమి రోజున, ఇంకా యుక్తవయస్సు చేరుకోని అమ్మాయిలను, దేవత యొక్క పవిత్ర రూపంగా పూజిస్తారు. కొన్ని పండాలలో, 7 నుండి 9 సంవత్సరాల మధ్య ఉన్న బాలికలను దేవతలుగా అలంకరించి పూజిస్తారు.

సంధి పూజ: మహానవమి

సంధి పూజ: మహానవమి

'సంధి పూజ', ఈ పూజ అష్టమి మరియు నవమి యొక్క సంధి తరుణంలో జరుగుతుంది ఈ పూజ దుర్గపూజకు ప్రధానమైనదిగా భావిస్తారు. అష్టమి చివరి 24 నిమిషాలు మరియు నవమి మొదటి 24 నిమిషాలు సందిఖంగా భావించబడుతుంది. ఈ సమయంలోనే దుర్గా దేవి క్రూరమైన రాక్షస జంట, చండో మరియు ముండాలను సంహరించింది.

సిందూర్ ఖేల : మహాదశమి

సిందూర్ ఖేల : మహాదశమి

పూజ చివరి రోజున భక్తులు దేవిని కన్నీళ్ళతో వీడ్కోలు పలుకుతారు. వివాహితులు అయిన మహిళలు దుర్గాదేవి జుట్టుకు సిందూర్ లేదా వసంతం పోస్తారు మరియు ఆమెకు స్వీట్లు సమర్పిస్తారు. దీనిని 'ఠాకూర్ బోరాన్' అంటారు. తరువాత, మహిళలు తమలో తాము వసంతంతో ఆడతారు , దీనిని 'సిందూర్ ఖేల' అంటారు.

విజయ దశమి : మహాదశమి

విజయ దశమి : మహాదశమి

దుర్గదేవత మరియు ఆమె కుటుంబం నీటిలో నిమజ్జనం అయిన తర్వాత, వారు కైలాసానికి తిరుగు ప్రారంభించినప్పుడు విజయ దశమి మొదలవుతుంది. మీరు మీ స్నేహితులను అభినందించటం, మీ పెద్దల ఆశీస్సులను తీసుకోవటం మరియు మీరు మీకన్నా చిన్నవారికి ఆశీర్వచనాలు అందించటం వంటివి ఈ విజయ దశమి రోజున చేస్తారు.

English summary

9 Rituals Associated With Durga Puja

Most people know about Durga Puja but not about the rituals involved in it. There is a significance of every single ritual that is practised during Durga Puja. If you really want to know why we celebrate Duja Puja in a particular way, then you need to understand the mythical story behind this worship. Goddess Durga descends from Her heavenly abode in Kailash to visit Her devotees on earth every year.
Desktop Bottom Promotion