For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు తప్పనిసరిగా దర్శించవలసిన 9 దుర్గామాత ప్రతిమలు

|

మీరు కేవలం దుర్గదేవి యొక్క వివిధ రూపాలను సంతోషంగా ఆడుతూ, పాడుతూ దర్శించుకోవాలంటే దుర్గపూజ సమయంలో మాత్రమే కుదురుతుంది. ప్రధానంగా దుర్గామాత విగ్రహాలు సాంప్రదాయకంగా రెండు రకాలుగా ఉన్నాయి.

దుర్గామాతకు 'షోలా' లేదా థర్మోకోల్ తో అలంకరించినప్పుడు, ఆ అలంకారాన్ని 'షోలార్ సాజ్ ' అని పిలుస్తారు. దుర్గామాతను వెండి వస్త్రాలతో అలంకరించినప్పుడు, ఆ అలంకారాన్ని 'దాకేర్ సాజ్ ' అని అంటారు. కానీ ఈ రోజుల్లో, ప్రయోగాత్మకంగా అనేక రకాల దుర్గామాత ప్రతిమలు లేదా విగ్రహాలు ఉన్నాయి.

ఎక్కువగా దుర్గ ప్రతిమకు ఒక థీమ్ ఆధారంగా దాని రూపాన్ని నిర్ణయిస్తుంటారు మరియు అలాగే ఆ ప్రతిమను ఉంచిన ప్రదేశం యొక్క మొత్తం వాతావరణాన్ని కూడా దానికి అనుగుణంగా తీర్చిదిద్దుతారు. బోల్ద్స్కి మీకు తొమ్మిది రకాల. దుర్గ విగ్రహాలను ఇక్కడ వివరిస్తున్నది. చదవండి.

షోలార్ సాజ్

షోలార్ సాజ్

దుర్గామాత ప్రతిమ సంప్రదాయబద్ధంగా 'షోలార్ సాజ్' లో అలంకరించబడి ఉంటుంది. దేవత మరియు తెల్లని థర్మోకోల్ బట్టలలో దేవత రూపం మరియు అసురుల యొక్క ఆకుపచ్చ రంగు, వర్ణనాతీతం.

పాట్ ఎర్ ఠాకూర్

పాట్ ఎర్ ఠాకూర్

ఈ దుర్గ విగ్రహం కుండల రూపంలో రూపొందించబడింది. బెంగాలీ లో, ఈ రూపాన్ని 'పాట్ ER ఠాకూర్ 'గా పేర్కొంటారు. ఈ దేవత ప్రతిమ బంకమట్టితో తయారు చేస్తారు మరియు ఫ్లాట్ గా ఉన్న కుండల ఆకారంలో డిజైన్ చేస్తారు .

వెదురు దేవత

వెదురు దేవత

ఇక్కడ దుర్గాదేవిని వెదురు కర్రలు మరియు ఎండుగడ్డితో అలంకరిస్టారు. దేవతకు ఈ రకమైన గ్రామీణ శైలి అలంకరణ చాలా ఖర్చుతో కూడినది మరియు అయినప్పటికీ ఈ అలంకరణ కళాత్మకంగా ఉంటుంది.

గిరిజన దేవత

గిరిజన దేవత

ఈ సందర్భంలో,, దేవత దుర్గను గిరిజన శైలిలో అలంకరిస్టారు.. ఆమెకు చీరను ఒక 'సంతాల్ ' స్త్రీకి కట్టినట్లుగా ధరింపచేస్తారు. తలకు కూడా బెంగాల్ గిరిజన ప్రాంతాల నుంచి వచ్చిన వారికి లాగానే ధరింపచేస్తారు.

వారియర్ దేవత

వారియర్ దేవత

ఈ దుర్గప్రతిమ యుద్ధం కోసం సిద్ధంగా ఉన్న యోధురాలుగా ఉంటుంది. ఒక్క దుర్గామాతే కాదు, ఆమె పిల్లలు, లక్ష్మి, సరస్వతి, గణేష్, కార్తిక్ కూడా యుద్ధం కోసం సిద్ధమైనట్లుగా అలంకరింపచేస్తారు .

దాకేర్ సాజ్

దాకేర్ సాజ్

ఈ సంప్రదాయ దాకేర్ సాజ్ అలంకరణను బల్లపరుపుగా ఉన్న వెండి షిల్లింగులతో అలంకరిస్తారు. ఈ అలంకరణ శైలిలో దుర్గాదేవత ముగ్ధమనోహరంగా కనిపిస్తుంది.

మానవత్వానికి

మానవత్వానికి

దేవతదుర్గను ఇక్కడ మానవ రూపంలో అలంకరిస్తారు. ఈ వేదికలో ఒక ప్రసిద్ధ సామాజిక కార్యకర్త అయిన మదర్ థెరిసా శిల్పం కూడా ఉన్నది.

కులో మరియు కోరి

కులో మరియు కోరి

దుర్గాదేవతను ఒక 'కులో' లేదా ఒడ్ల నుండి బియ్యం వేరుచేయాతానికి ఉపయోగించే ఒక గడ్డి ట్రే లోపల లేదా ఒక 'కోరి' లేదా (నాణెం) లో పొందుపరుస్తారు.. ఈ రకమైన అలంకరణలో బెంగాల్ గ్రామీణ జీవితం నుండి శైలీకృత అంశాలు ప్రతిబింబిస్తాయి.

కోనో ఏక్ ఘన్యెర్ బోధు

కోనో ఏక్ ఘన్యెర్ బోధు

ఇక్కడ, దేవత దుర్గను బెంగాల్ లోని గ్రామీణ వివాహిత మహిళలాగా అలంకరిస్తారు. ఆమెకు బెంగాలీ స్టైల్ లో ఎర్ర అంచుతో ఉన్న ఎరుపు తెలుపు రంగులతో ఉన్న చీర ధరింపచేస్తారు మరియు ఆమె 10 చేతులకు ఎరుపు మరియు తెలుపు నత్తగుల్ల షెల్ గాజులు ధరింపచేస్తారు.

English summary

9 Types Of Durga Idols You Must See

Durga Puja is the time when you go pandal hopping just to gaze at the different forms in which the Goddess Durga has been portrayed. There are basically two types of Durga idols traditionally.
Desktop Bottom Promotion