For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అక్షయ త్రితీయ పూజ జరుపుకోవడానికి మంచి సమయం & సంబంధించిన కధలు

హిందూ పంచాంగం ప్రకారం ఈ పండుగ వైశాఖ మాసం లో శుక్ల పక్షం మూడో రోజున ఈ పవిత్రమైన రోజు నిర్వహిస్తారు. ఈ ఆర్టికిల్ లో, అక్షయ త్రితీయ పూజ నిర్వహించుకోవడానికి మంచి సమయం ఏది, దీని ప్రాముఖ్యతకు సంబంధించిన కొన

By Lekhaka
|

( 28 వ తేదీ ఏప్రిల్ ) ఉదయం 10.29 నుండి మధ్యాహ్నం 12.36 గంటల లోపు ఈ సంవత్సరం అక్షయ త్రితీయ జరుపుకోవడానికి మంచి ముహూర్త౦. అంతేకాకుండా, ఈ రోజు ప్రత్యేకతను వివరించే కొన్ని కధల గురించి కూడా చదివి తెలుసుకోండి.

“అక్షయ” అంటే 'ఎప్పటికీ నిలిచిపోయేది’. భారతదేశంలో అనేక పండుగలు గొప్ప ఉత్సాహంతో, ఆనందంతో జరుపుకుంటారు. అత్యంత పవిత్రమైన, గౌరవప్రదమైన పండుగలలో ఒకటైన అక్షయ త్రితీయ లేదా అఖా తీజ్ ను హిందువులే కాకుండా, జైనులు కూడా జరుపుకుంటారు.

ఒకే ప్రముఖ్యతతో వివిధ రాష్ట్రాలలో జరుపుకునే ఒకేఒక పండుగ ఇది. భారతదేశం గురించి మాట్లాడేటపుడు, ఇది ఎంత గొప్ప స్థానాన్ని సంపాదించుకుంది అంటే “భిన్నత్వంలో ఏకత్వం” స్థానాన్ని పొందింది.

పండుగల విషయానికి వస్తే, ఈ మాట చాల స్పష్టమైనది అని తెలుస్తుంది. అక్షయ త్రితీయ వివిధ రాష్ట్రాలలో వివిధ పేర్లతో పిలువబడుతుంది. దీన్ని చత్తీస్ఘడ్ లో అక్తి అని, గుజరాత్, రాజస్తాన్ లో అఖా తీజ్ అని పిలుస్తారు.

హిందూ పంచాంగం ప్రకారం ఈ పండుగ వైశాఖ మాసం లో శుక్ల పక్షం మూడో రోజున ఈ పవిత్రమైన రోజు నిర్వహిస్తారు. ఈ ఆర్టికిల్ లో, అక్షయ త్రితీయ పూజ నిర్వహించుకోవడానికి మంచి సమయం ఏది, దీని ప్రాముఖ్యతకు సంబంధించిన కొన్ని కధలను మేము ఇక్కడ పొందుపరిచాము. చదివి మరిన్ని విషయాలు తెలుసుకోండి.

అక్షయ త్రితీయ కు మంచి ముహూర్తం:

అక్షయ త్రితీయ కు మంచి ముహూర్తం:

ఈ సంవత్సరం (ఏప్రిల్ 28 శుక్రవారం) ఉదయం 10.29 నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం 6.55 నిమిషాల వరకు ఉంది. ఈ పండుగ జరుపుకోడానికి చాలా సమయం ఉంది.

పూజకు మంచి సమయం

పూజకు మంచి సమయం

తిథి శనివారం వరకు ఉంది, పూజకు ముహూర్తం కేవలం 2 గంటల 6 నిమిషాలకు పొడిగించబడింది. ఇది ఏప్రిల్ 28 న ఉదయం 10.29 నుండి ప్రారంభమై అదే రోజు 12.36 వరకు ఉంది.

పరశురాముని జననం

పరశురాముని జననం

అక్షయ త్రితీయ ప్రాధాన్యత గురించి మాట్లాడేటపుడు, ఇది పరశురాముని పుట్టినరోజని మన మనసులో మొదటగా ఆలోచన రావాలి. ఈయన విష్ణుమూర్తి ఆరవ అవతారం, ఈయన 21 సార్లు విరుద్ధమైన పాలకుల నుండి ప్రపంచాన్ని విముక్తిని చేసారు.

మహాభారతం ప్రారంభంలో:

మహాభారతం ప్రారంభంలో:

అక్షయ త్రితీయ ఎంత పవిత్రమైన రోజంటే ఈరోజే వేద వ్యాసుడు మహాభారతాన్ని చెప్తుంటే వినాయకుడు రాయడం ప్రారంభించాడు. ఈరోజు భారతదేశంలో ఎంత పవిత్రమైన, సాంప్రదాయ గ్రంధాలూ ప్రారంభమైన రోజు, ఇది ఖచ్చితంగా ఒక గౌరవప్రదమైన, పవిత్రమైన రోజు.

పాండవుల విజయాన్ని సూచిస్తుంది

పాండవుల విజయాన్ని సూచిస్తుంది

అక్షయ త్రితీయ, మహాభారతానికి సంబంధించిన మరో కధ ఉంది. అక్షయ త్రితీయ రోజు పాండవులు ఒక చెట్టుకింద ఖగోళ ఆయుధాలను కనుక్కున్నారు, వీటి సాయంతోనే పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులను ఓడించారు.

కుబేరుడి రోజు:

కుబేరుడి రోజు:

అక్షయ త్రితీయ ఎంత పవిత్రమైనది అంటే ఈరోజే అనేక పురాణాలూ పేర్కొనబడ్డాయి. శివపురాణం ప్రకారం, కుబేరుడు శివుని వరంతో ఎంతో సంపదను పొందిన రోజు ఇదే, అంతేకాకుండా లక్ష్మీ దేవితో కలిసి సంపాదకు నిలయమయ్యాడు కూడా.

బంగారం కొనడానికి ప్రాముఖ్యత:

బంగారం కొనడానికి ప్రాముఖ్యత:

ప్రజలు వ్యాపారంతో అనుసంధానించబడడం కోసం ఈ అక్షయ త్రితీయ ఒక ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ పవిత్రమైన రోజున బంగారం, వెండి కొనడంకూడా చాలా ప్రముఖమైనది. అక్షయ త్రితీయ రోజు బంగారం కొంటె సంవత్సరం మొత్తం కొత్తగా, ఆనందంగా ఉంటారనే ప్రాముఖ్యతను నమ్మడమైనది.

కొత్త శకానికి ప్రారంభం:

కొత్త శకానికి ప్రారంభం:

పురాణాల ప్రకారం,అక్షయ త్రితీయ త్రేతా యుగానికి లేదా శ్రీరాముని యుగానికి ప్రారంభం అని కూడా చెప్పబడింది. ‘ధర్మం' ని అనుసరించే ప్రజల శకం అని కూడా అంటారు.

అందువలన, అక్షయ త్రితీయ ప్రత్యేకమైన రోజు ఎలాంటి పని ప్రారంభించినా మీ జీవితం చాలా విజయవంతంగా, ఆనందంగా ఉంటుంది. ఈరోజు ఏపని ప్రారంభించినా, దేవతల దీవెనలు పొందుతారు, జపం, దానం-పుణ్యం, పిత్రుతర్పణాలు మొదలైన సంప్రదాయాలు చేయడం వల్ల ప్రజలు జీవితాంతం సుఖ శాంతులతో జీవిస్తారు.

English summary

Best Time To Perform The Akshaya Tritiya Puja & Stories Related To It

"Akshaya" means 'everlasting'. There are several occasions in India that are celebrated with great pomp and show. Akshaya Tritiya, or Akha Teej, is one of the most sacred and pious occasions that is celebrated by not only the Hindus, but also Jains.
Desktop Bottom Promotion