For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సిరిసంపదలు పొందాలంటే దీపావళి రోజు ఏ రాశి వాళ్లు ఏం చేయాలి ?

By Nutheti
|

దీపావళి పండుగంటే.. దీపాలు, క్రాకర్స్. ఈ దీపావళి రోజు లక్ష్మీదేవిని పూజించడం హిందువుల సంప్రదాయం. ఎందుకంటే.. దీపావళి రోజు అంటే కార్తీక అమావాస్య రోజు లక్ష్మీదేవి సముద్రగర్భంలోంచి పుట్టిందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి లక్ష్మీ దేవి పుట్టిన సందర్భంగా.. ఆ రోజు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ప్రతి ఇంట్లో లక్ష్మీ పూజలు చేసుకుంటారు.

READ MORE: ఏ రాశి అబ్బాయితో మ్యారేజ్ లైఫ్ సంతోషంగా ఉంటుంది ?

మరో వృత్తాంతం ప్రకారం లక్ష్మీదేవి కార్తీక మాసం ప్రారంభంలో అంటే అమావాస్య రోజు విష్ణుమూర్తితో వివాహం జరిగిందని చెబుతుంది. ఈ సందర్భంగా ఇల్లంతా దీపాలు వెలిగించి ఆ లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నట్లు ప్రతీతి.

పర్వదినాన ప్రతి ఒక్కరు ఉదయాన్నే లేచి స్నానాలు చేసి పూజలు నిర్వహించుకుని.. తమ కోర్కెలు తీర్చమని నైవేద్యాలు నివేదిస్తారు. అయితే ఏ రాశి వాళ్లు ఎలాంటి పూజ, నైవేద్యం సమర్పించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. మీ రాశిని బట్టి సిరులు కురిపించే లక్ష్మీదేవి అభయం పొందడానికి ఏం చేయాలో తెలుసుకోండి.

మేష రాశి

మేష రాశి

మేషరాశి వాళ్లు లేత సాండల్ వుడ్ రంగు లేదా శాఫ్రాన్ రంగు వస్ర్తం తీసుకుని దీపావళి రోజు మీ బీరువా లాఖర్ లో ఉంచడం వల్ల మీకు, మీ కుటుంబానికి శ్రేయస్సు పెరుగుతుంది.

వృషభం

వృషభం

దీపావళి రోజు రాత్రి ఆవు నెయ్యితో రెండు దీపాలు వెలిగించి ప్రశాంతంగా ఉన్న ప్రదేశంలో ఉంచి.. మీ కోరికను దేవుడికి తెలపాలి.

మిధునం

మిధునం

దీపావళి రోజు లక్ష్మీ దేవికి పూజలు నిర్వహించి పీచుతో ఉన్న కొబ్బరికాయను తీసుకుని మీ కోరిక విన్నవించుకోవాలి. తర్వాత ఎర్రటి వస్ర్తంలో దానిని చుట్టి మీకు నచ్చిన ప్రాంతంలో పెట్టుకోవాలి. మీ కోరిక తీరిన తర్వాత ఆ కొబ్బరికాయను లక్ష్మీదేవి దేవాలయంలో సమర్పించాలి.

కర్కాటకం

కర్కాటకం

కర్కాటక రాశి వాళ్లు దీపావళి పండుగ రోజు పసుపు రంగు వస్ర్తాన్ని త్రిభుజాకారంలో చుట్టు విష్ణువు ఆలయంపైన కట్టాలి. అది ఎగిరినట్లల్లా మీకు లక్ పెరుగుతూ ఉంటుంది మళ్లీ దీపావళి ఇది కొనసాగుతూ ఉంటుంది.

సింహ రాశి

సింహ రాశి

దీపావళి రోజు సింహరాశి వాళ్లు రాత్రిపూట నెయ్యితో వెలిగించిన దీపాన్ని ముఖద్వారం దగ్గర పెట్టాలి. ఆ దీపం మళ్లీ సూర్యోదయం వరకు వెలుగుతూ ఉంటే.. మీ శ్రేయస్సు మరింత పెరుగుతుంది.

కన్యా రాశి

కన్యా రాశి

మీరు డబ్బును సేవ్ చేయలేకపోతుంటే.. దీపావళి రోజు శ్రీపాల్ ను ఎరుపు రంగు వస్ర్తంలో చుట్టి లాఖర్ లో పెట్టుకోవాలి.

తులారాశి

తులారాశి

ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే.. తామర కాండాన్ని దీపావళి రోజు రాత్రి లక్ష్మీదేవి పాదాల చెంత ఉంచి.. మీ కోరిక అమ్మవారికి తెలిపి, పూజలు చేశాక ఆ తామక కాండాన్ని ఎరుపు రంగు వస్ర్తంలో చుట్టు మీరు డబ్బులు పెట్టే ప్రాంతంలో పెట్టుకోవాలి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి

ఆర్థిక పరిస్థితులు బాగోలేక చాలా అసంతృప్తిగా ఉన్నట్లైదే.. దీపావళి రోజు రెండు అరటి మొక్కలను ఏదో ఒక ఆలయం ముందు నాటాలి. తర్వాత రోజు ఆ మొక్కలను గమనిస్తూ ఉండాలి. అయితే ఆ చెట్టుకి పండ్లు కాసినా.. వాటిని తినకూడదు, వాడకూడదు.

ధనుస్సు

ధనుస్సు

ధనస్సు రాశి వాళ్లు తమలపాకు తీసుకుని దానిపై కుంకుమతో శ్రీ అనే మంత్రం రాసి.. జాగ్రత్త పరచాలి. తర్వాత రోజు ఆ ఆకుని జంతువుకి తినిపించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

మకరం

మకరం

మకర రాశి వాళ్లు అనుకున్న రీతిలో డబ్బును పొదుపు చేయలేకపోతుంటే.. దీపావళి రోజు ఎరుపు రంగు వస్ర్తంలో శ్రీపాల్ ను చుట్టి లాకర్ లో పెట్టుకుంటే మంచిది.

కుంభం

కుంభం

దీపావళి రోజు రాత్రికి కొబ్బరి చిప్పలో నెయ్యివేసి దీపం వెలిగిస్తే మీరు డబ్బులు పొందుతారు. ఆర్థికరంగంలో ఉన్నవాళ్లుకు ఇది మంచి ఫలితాన్నిస్తుంది.

మీనం

మీనం

దీపావళి పండుగ రోజు నుంచి లక్ష్మీదేవి ఆలయంలో సుగంధం సమర్పిస్తూ వస్తే.. మంచిది. కొన్ని రోజులపాటు ఈ నియమం పాటించడం వల్ల త్వరలోనే ఐశ్వర్యవంతులవుతారు.

English summary

Deepawali forecasts for different signs in telugu

Deepawali forecasts for different signs.
Story first published: Monday, November 9, 2015, 17:14 [IST]
Desktop Bottom Promotion