కార్తీక మాసంలో శివుడిని ఈ పువ్వులతో పూజితే పాపాలు, కష్టాలు తొలగిపోతాయి..!!

ఈ మాసం ప్రతిరోజు పుణ్య ఫలాలను అందించేదిగా చెప్పబడుతోంది. కార్తీక బహుళ అష్టమి శివారాధనకు మరింత విశేషమైనదని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ రోజున వివిధ రకాల పూలతో పరమశివుడిని పూజించడం వలన అనంతమైన

Posted By:
Subscribe to Boldsky

జీవితంలో తెలిసో .. తెలియకో చేసే కొన్ని పనులు పాపాలుగా వెంటాడుతూ ఉంటాయి. అటువంటి పాపాల వల్ల జీవితాంతం అష్టకష్టాలు పడే వారు కూడా ఉంటారు. అలాంటి పాపాలను హరించే మాసంగా కార్తీకమాసం కనిపిస్తుంది. ఈ మాసం శివకేశవులకు ఎంతో ప్రీతికరమైనది కనుక, దేవాలయాలు భక్తులతో సందడిగా కనిపిస్తుంటాయి .. దీపాల వెలుగులతో కళకళలాడుతుంటాయి.

ఈ మాసం ప్రతిరోజు పుణ్య ఫలాలను అందించేదిగా చెప్పబడుతోంది. కార్తీక బహుళ అష్టమి శివారాధనకు మరింత విశేషమైనదని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ రోజున వివిధ రకాల పూలతో పరమశివుడిని పూజించడం వలన అనంతమైన పుణ్య ఫలాలు లభిస్తాయి. ఇక కార్తీక బహుళ ఏకాదశిని 'రమా ఏకాదశి'గా పిలుస్తారు. ఈ రోజున విష్ణుమూర్తిని ఆరాధించి బెల్లం దానం చేయడం వలన సమస్త దోషాలు తొలగిపోతాయని అంటారు. కార్తీక బహుళ ద్వాదశి రోజున దూడతో కూడిన ఆవును పూజించడం వలన లభించే పుణ్యం, జన్మజన్మలకి వెంట వస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.
కార్తీక మాసంలో ఒక్కో రోజున ఒక్కో పుష్పంతో శివుడిని ఆరాధించడంలో ఈ క్రింది పుణ్య ఫలాలు పొందుతారు...

వివిధ రకాల పువ్వులతో శివ పూజ, వాటి వల్ల పొందే ఫలితం ...

లక్షపుష్పములతో

లక్షపుష్పములతో శివుని పూజించినచో సకల పాపములు నశించును. తక్కువ సంఖ్యతో పూజించిననూ ఫలం ఉంటుంది. లక్షసంఖ్య శీఘ్రఫలం. ఒకేసారి చేయలేకపోయినచో క్రమశః చేయవచ్చు.

సంపద కోరువారు

బిల్వపత్రము, కమలము, శతపత్రము, శంఖపుష్పము

మోక్షం కోరువారు

దర్భలతో, శమీ పత్రములతో, వర్తమాన ఋతువులో పుట్టిన పుష్పములతో

దీర్ఘాయువు కోరువారు -

దూర్వారముతో పూజ చేస్తే 

పుత్రుని అభిలషించువారు

ఉమ్మెత్త పూలతో(ఎర్ర కాడలు ఉన్నది శ్రేష్ఠం)

భోగమోక్షముల కొరకు

తులసీ దళములతో, ఎర్ర తెల్ల జిల్లేడు, శ్వేత కమలములతో

ధర్మానికి ద్రోహులైన శత్రు నాశనం కొకు

జపాకుసుమాలతో(ఎర్రగులాబీలు)

రోగనివారణకు

కరవీర(గన్నేరు)

వాహనలబ్ధికొరకు

జాజిపూలతో పూజించాలి

శుభలక్షణసంపన్నయైన భార్యను కోరువారు

మల్లెలతో పూజించాలి

సుఖసంపదలు

పారిజాతపుష్పములతో పూజించాలి

సర్వకామ్యములకొరకు

శంఖుపుష్పములతో పూజించాలి

అవిసె పుష్పములతో

అవిసె పుష్పములతో పూజించిన వాడు విష్ణుభగవానునకు ప్రియమైన వాడగును.

లక్షబిల్వ పత్రములను

లక్షబిల్వ పత్రములను శివునకు సమర్పించిన వానికి సకల కామ్య వస్తువులు ప్రాప్తించును.

చంపక(సంపెంగ), మొగలి పుష్పములు తప్ప

చంపక(సంపెంగ), మొగలి పుష్పములు తప్ప మిగతా పుష్పములన్నియు శివునకు సమర్పించవచ్చును.

క్రమంగా కోటి చేస్తే

క్రమంగా కోటి చేస్తే(వేటితోనైనా) జ్ఞానం వస్తుంది.

నేతితో అభిషేకం చేసినచో

నేతితో అభిషేకం చేసినచో మధుర కంఠధ్వని, వాక్కు, విద్య ప్రాప్తిస్తాయి.

English summary

Different Flowers Used to Worship Lord Shiva in Karthika masam

Every now and then when performing puja's, the flowers had a great significance.Although we are doing puja,may it be the lord,may it be the mother, while worshiping them, the flowers only had great significance.While there are so many means of items used to perform puja's,why we feel the flowers are so important? Many texts mention the importance of the flowers.
Please Wait while comments are loading...
Subscribe Newsletter