For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దుర్గాదేవి వాహనం ఈ ఏడాది అశుభ సంకేతాలను హెచ్చరిస్తోందా ?

By Swathi
|

ఎంతో పవిత్రంగా భావించే నవరాత్రుల సందడి మొదలైంది. తొమ్మిదిరోజులు జరుపుకునే ఈ సెలబ్రేసన్స్ లో దుర్గాదేవిని పూజిస్తారు. దుర్గా అమ్మవారిని ఈ నవరాత్రుల్లో ఒక్కో రోజు ఒక్కో రూపంలో తొమ్మి రూపాల్లో పూజిస్తాం.

ప్రతి ఏడాది దుర్గాదేవి వివిధ వాహనాలపై వస్తుంది. అంటే ఒక్కో వాహనానికి ఒక్కో సంకేతం ఉంటుంది. ఏ వాహనంపై వస్తే.. ఎలాంటి సందేశం వివరిస్తుంది అనేది ఆసక్తికరమైనది. అయితే హిందూ శాస్త్రాల ప్రకారం ఈ ఏడాది దుర్గాదేవి గుర్రాన్ని వాహనంగా ఎంచుకుంది.

దుర్గాదేవి గుర్రాన్ని వాహనంగా ఎంచుకోవడం వల్ల ఏం జరగబోతోంది ? ఏం సందేశాన్ని భక్తులకు ఇవ్వబోతోంది ? దుర్గమ్మ తల్లి గుర్రపు వాహనంపై రావడం మనుషులకు డేంజర్ సంకేతాలు ఇస్తోంది ? మన శాస్త్రాలు, పండితులు ఏం చెబుతున్నారు ?

హిందువుల నమ్మకాలు

హిందువుల నమ్మకాలు

హిందువుల ప్రకారం దుర్గమ్మ తల్లి ఒక్కో ఏడాది ఒక్కో వాహనంపై వస్తుంది. అలా రావడం వెనక ఆసక్తికరమైన సందేశం ఉంటుంది.

వాహనాలు

వాహనాలు

సాధారణంగా దుర్గాదేవి కీలక వాహనం సింహం. ఇది కాకుండా.. మిగిలిన వాహనాలపై రావడం వెనక ఆసక్తికర సంకేతాలున్నాయి. అలాగే అమ్మవారు ఒక రకమైన వాహనం వచ్చి.. మరో రకమైన వాహనంపై వెళ్తారు.

ఒకేవాహనం

ఒకేవాహనం

కానీ ఎప్పుడైతే.. రావడానికి, వెళ్లడానికి రెండింటికీ ఒకే వాహనాన్ని అమ్మవారు ఎంచుకున్నారు అంటే.. తీర్పు ఇవ్వబడిన రోజుగా పరిగణిస్తారు. దుష్ప్రభావాలకు సంకేతంగా భావిస్తారు.

ప్రభావం

ప్రభావం

అమ్మవారు రావడం, వెళ్లడం ఒకే వాహనంపై జరిగితే.. ప్రకృతి విపత్తులు, యుద్ధాలు, సామాజిక కలహాలు, మనుషుల్లో ఒత్తిడి.. ఎక్కువగా జరుగుతాయి. ఈ ఏడాది రావడానికి, వెళ్లడానికి ఒకే వాహనం గుర్రాన్ని ఎంచుకుంది.

చిక్కులు

చిక్కులు

అమ్మవారు ఏ వాహనంలో వస్తే.. ఎలాంటి ఫలితాలు, దుష్ర్పభావాలు ఉంటాయో.. తెలుసుకుందాం. అలాగే.. అమ్మవారు ఏ వాహనంపై వస్తే.. చిక్కులు తప్పవన్న సంకేతం సూచిస్తుందో తెలుసుకుందాం.

 ఏనుగు

ఏనుగు

దుర్గాదేవి ఏనుగుపై వస్తే.. సంపద, ప్రశాంతతకు సంకేతం. అదే అమ్మవారు రావడం, వెళ్లడం రెండూ.. ఈ వాహనంపైనే జరిగితే.. మీ జీవితంలో మంచి, ఆశీస్సులు, కష్టానికి తగిన ఫలితం, సంతోషం పొందుతారని సంకేతం.

ఓడ

ఓడ

ఒకవేళ దుర్గాదేవి నీటి రవాణా వాహనమైన ఓడపై వస్తే.. వరదలు, మంచి పంటలకు సంకేతం. ఈ వాహనంపైనే రావడం, వెళ్లడం రెండూ జరిగితే.. మీరు కోరుకున్న ప్రతీది పొందేలా అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి.

పల్లకి

పల్లకి

నలుగురు మోస్తూ పల్లకిలో అమ్మవారు వస్తే.. అంటువ్యాధులు వ్యాప్తి చెందుతాయని సంకేతం. ఒకవేళ అమ్మవారు పల్లకిపైనే వచ్చి.. పల్లకిపైనే వెళ్తే.. మనుషులు ఒకరినొకరు సహాయపడతారు, అందరూ ఐక్యంగా ఉంటారని సంకేతం.

గుర్రం

గుర్రం

గుర్రంపై అమ్మవారు వచ్చారంటే.. చాలా విధ్వంసానికి సంకేతం. అలాగే.. ఈ వాహనంపైనే రావడం, వెళ్లడం జరిగిందంటే.. రాబోయే విధ్వంసానికి సంకేతం. అంటే ఈ ఏడాది మంచిది కాదని సూచిస్తోంది.

10 రోజుల నవరాత్రి

10 రోజుల నవరాత్రి

సాధారణంగా నవరాత్రి అంటే.. తొమ్మిది రోజులు ఉండేవి. కానీ ఈసారి పదిరోజులు ఉండబోతున్నాయి. విజయదశమి లేదా దసరా.. 11వ రోజు జరుపుకుంటున్నాం. అంటే.. ఇది చెడు సంకేతం.

రావడం వెళ్లడం

రావడం వెళ్లడం

అమ్మవారు రావడం, వెళ్లడం అనేది ఘటస్తాపన, విజయదశమి ఆధారంగా పరిగణలోకి తీసుకుంటారు.

విధ్వంసాన్ని ఎలా తగ్గించుకోవాలి

విధ్వంసాన్ని ఎలా తగ్గించుకోవాలి

హిందూ శాస్త్రాల ప్రకారం.. ఇలాంటి అపవిత్రమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు.. భక్తులు ఖచ్చితంగా ఈ మంత్రాన్ని స్మరించుకోవాలి. తమకు, తమ పిల్లలకు ఎలాంటి విధ్వంసం జరగకూడదని కోరుకోవాలి.

మంత్రం

మంత్రం

అమ్మవారు గుర్రంపై వచ్చేటప్పుడు.. ఈ మంత్రాన్ని స్మరించుకోవాలి. దినశశి సూర్య గర్జుధ శనిభౌమే తురంగమే, గౌరౌశుక్రేచ్ డోలాయాం బుధే నౌకప్రకీర్తిటట, గజెష్ జలదా దేవి శేక్రాభాంగ్ తురంగమే, నౌకాయాం కార్యసిద్ధిస్యాతా డోలాయాం మరంధ్వారవం..

అశుభమైన

అశుభమైన

హిందు పురాణాల ప్రకారం దుర్గా అమ్మవారు.. రావడం లేదా వెళ్లడం మంగళవారం లేదా శనివారం జరిగితే.. ఆమె గుర్రంపై వస్తుందని సంకేతం. అంటే.. అశుభమైన, అననుకూలమైనదిగా భావిస్తారు.

గుర్రంపై దుర్గాదేవి

గుర్రంపై దుర్గాదేవి

ఈ ఏడాది దుర్గాదేవి అక్టోబర్ 1, 2016న అంటే శనివారం వస్తోంది. అక్టోబర్ 11, 2016న మంగళవారం వెళ్తోంది. రెండు రోజులూ.. అశుభమైనవే కావడం వల్ల.. యుద్ధాలకు కారణమవుతుందని.. చాలా ఆందోళనకర వాతావరణం ఏర్పడింది.

English summary

Goddess Durga chose a Horse to be her Vahan this year. What Does it mean ?

Goddess Durga chose a Horse to be her Vahan this year. What Does it mean ? Every year Goddess Durga arrives on different vahans (mount) that symbolise a special message for the world.
Story first published: Wednesday, September 28, 2016, 15:34 [IST]
Desktop Bottom Promotion