For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సీతారామ లక్ష్మణులు ఎలా చనిపోయారో తెలుసా ?

By Swathi
|

సాధారణంగా రామాయణం గురించి మాట్లాడినప్పుడు రావణాసురుడిని రాముడు చంపేయడంతోనే అయోధ్యకు మంచి రోజులు వచ్చాయి అంటుంటాం. అలాగే రావణాసురుడి మరణంతో.. అయోధ్య సంబరాల్లో మునిగిపోతుందని మనకు తెలుసు. ఆ తర్వాత ఏమయింది ? అసలు రాముడు, లక్ష్మణుడు, సీతకు ఏమవుతుంది ? వాళ్లు ఎలా చనిపోయారు ? అనేది మిస్టరీగానే మిలిగిపోయింది.

హనుమంతుడు రామభక్తుడని తెలుసు..రాముడితోనే యుద్ధం చేశాడని తెలుసా ?

రాముడు విష్ణువు అవతారమని మనకు తెలుసు. అలాగే లక్ష్మణుడి మరణం తర్వాత రాముడి జీవితం కూడా ముగిసిపోయిందనీ మనకు తెలుసు. మరి సీత, రాముడు, లక్ష్మణుడు ఎలా మరణించారు ? వీళ్ల మరణానికి కారకులు ఎవరైనా ఉన్నారా ? లేక యాదృశ్చికంగా జరిగిందా ? సీతారామ లక్ష్మణుల మరణం గురించి మీకు తెలియని విషయాలు ఇప్పుడు చూద్దాం..

సీత మరణం

సీత మరణం

యుద్ధం అయిపోయిన తర్వాత రాముడి అయోధ్యకు రాగానే అందరూ సంబరాలు చేసుకున్నారు. కానీ వెంటనే రావణుడి దగ్గర ఉన్నప్పుడు సీతాదేవి తన పవిత్రతను కోల్పోయిందని అందరూ అనుమానించారు.

సీత మరణం

సీత మరణం

ఈ అనుమానం రాగానే రాముడు సీతకు అగ్నిపరీక్ష పెట్టాడు. సీతాదేవి చాలా పవిత్రమైనదని తెలుపుతూ.. ఆమె అగ్నికి ఆహుతి కాలేదు.

అయోధ్య వదిలిపెట్టడం

అయోధ్య వదిలిపెట్టడం

ఇలా అగ్నిపరీక్ష పెట్టడంతో సీత అవమానానికి గురయై.. అయోధ్యను వదిలిపెట్టి వెళ్లిపోతుంది. ఆ తర్వాత సీతాదేవి వాల్మీకి ఆశ్రమంలో ఉంటుంది.

అయోధ్య పాలన

అయోధ్య పాలన

రాముడు అయోధ్యను పాలించుకుంటూ జీవితం గడుపుతూ ఉంటాడు. అదే సమయంలో తన గుర్రం తప్పిపోవడంతో.. దానికోసం అశ్వమేధ యాగం నిర్వహిస్తాడు రాముడు.

గుర్రం

గుర్రం

చివరికి ఆ గుర్రాన్ని అడవిలో ఇద్దరు పిల్లల దగ్గర ఉందని గుర్తిస్తారు. అప్పుడు ఆ పిల్లలను పట్టుకోవడానికి లక్ష్మణుడు, సుగ్రీవుడు, ఆంజనేయుడు ప్రయత్నించి విఫలమవుతారు. వాళ్లిద్దరూ ఎవరో కాదు రాముడి కొడుకులు లవ, కుషులు. కానీ వాళ్లు రాముడి పుత్రులని గుర్తించలేకపోతారు.

లవకుషులు

లవకుషులు

అప్పుడు వెంటనే లక్ష్మణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు రాముడి దగ్గరకు వెళ్లి తమను ఇద్దరు పిల్లలు ఓడించారని వివరిస్తారు. వెంటనే ఆ పిల్లలను చూడటానికి రాముడు అడవికి వచ్చిన సమయంలో సీత కనిపిస్తుంది.

మళ్లీ అనుమానం

మళ్లీ అనుమానం

ఆ ఇద్దరు పిల్లలు అయోధ్యలో జన్మించకపోవడంతో.. రాముడు మళ్లీ సీతను అనుమానిస్తాడు. రాముడు తనపై మళ్లీ అనుమానం వ్యక్తం చేయడంతో భరించలేకపోయిన సీత తన తల్లి అయిన భూదేవిని తనలో చేర్చుకోమని వేడుకుంటుంది. భూదేవి సంతోషంగా సీతను తనలో చేర్చుకుంటుంది. అలా సీతాదేవి జీవితం అయిపోతుంది.

లక్ష్మణుడి మరణం

లక్ష్మణుడి మరణం

ఒకసారి రాముడు ఏదో చర్చలో ఉంటాడు. ఆ సయమంలో ఎవరినీ లోపలికి అనుమతించకండని, లోపల చర్చ జరుగుతుందని ఆదేశిస్తాడు. ఎవరినైనా లోపలికి అనుమతిస్తే.. ఆ వ్యక్తిని చంపేస్తానని రాముడు హెచ్చరిస్తాడు.

దుర్వాస మహర్షి

దుర్వాస మహర్షి

అదే సమయంలో రాముడిని కలవడానికి దుర్వాస మహర్షి వస్తాడు. లక్ష్మణుడు అతన్ని అనుమతించడు. తనను లోపలికి అనుమతించకపోతే.. అయోధ్యను అగ్నికి ఆహుతి చేస్తానని మహర్షి హెచ్చరించడంతో.. లక్ష్మణుడు మహర్షిని లోపలికి అనుమతిస్తాడు.

కోపానికి గురైన రాముడు

కోపానికి గురైన రాముడు

దుర్వాస మహర్షి లోపలికి రావడంతో కోపానికి గురైన రాముడు.. ఎవరు లోపలికి అనుమతించారని బయటకు వచ్చి చూస్తాడు. లక్ష్మణుడని గుర్తించేలోపే.. లక్ష్మణుడు తాను అన్న మాట తప్పానని భావించి.. పక్కనే ఉన్న సరయు నదిలో దూకి తన జీవితం ముగించుకుంటాడు.

రాముడి మరణం

రాముడి మరణం

తన సోదరుడు మరణం చూసి భరించలేకపోయిన రాముడు కూడా వెంటనే అదే నదిలో దూకి చనిపోతాడు.

లవకుషులకు రాజ్యం

లవకుషులకు రాజ్యం

రాముడు పశ్చాత్తాపంతో.. తన రాజ్యాన్ని తన కుమారులు లవుడు, కుషులకు అప్పగించే వాళ్లే పాలించాలని నిర్ణయించాడట.

ఇలా సీతా రామ లక్ష్మణుల మరణం జరిగింది.

English summary

How did Rama, Sita and Laxman die?

How did Rama, Sita and Laxman die? Yes, gods are immortal but they too leave for their heavenly abode right? And when it comes to Ramayana, what happened to Rama, Laxman and Sita after the legend (as known to us) ended?
Story first published:Tuesday, May 24, 2016, 15:56 [IST]
Desktop Bottom Promotion