For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పార్వతీ పరమేశ్వరుల వివాహం వెనక ఉన్న ఆసక్తికర కథేంటి ?

By Swathi
|

అర్ధనారీశ్వరులైన శివపార్వతుల వివాహం వెనక ఉన్న ఆసక్తికర కథ మీకు తెలుసా ? వీళిద్దరి వివాహం ఎప్పుడు, ఎక్కడ, ఎవరి సమక్షంలో జరిగిందో తెలుసా ? శివుడు, పార్వతుల వివాహం చాలా విభిన్నంగా జరిగింది. వీళ్ల వివాహానికి సంబంధించిన గుర్తులు ఇప్పటికీ ఉన్నాయట.

శివుడు యొక్క 19 అవతారాలు మీకు తెలుసా?

పరమేశ్వరుడు వివాహమాడిన పార్వతికి ఇది రెండో జన్మ అని మీకు తెలుసా ? అవును.. శివుడికి తన భార్యపై ఉన్న ప్రేమా, ఆప్యాయతల కారణంగా.. ఆ దేవి మళ్లీ జన్మెత్తింది. మరి శివుడికి పార్వతి తన ముందు జన్మలై ఎందుకు దూరమైంది ? మళ్లీ ఎందుకు జన్మించి.. తన శివుడికే భార్య అయింది ? తెలుసుకోవాలంటే.. ఈ ఆసక్తికర కథ తెలుసుకోవాల్సిందే..

సతీ

సతీ

సతీదేవి తనను తాను బలి ఇచ్చుకుంది. అప్పుడు తాను ఎంతగానో ప్రేమించే తన భార్య లేకపోవడంతో శివుడు చాలా దిగ్బ్రాంతికి లోనయ్యాడు. దీంతో ఈ ప్రపంచంతో బంధాన్ని తెంచుకుని.. ఎవరితోనూ సంబంధాలు లేకుండా.. హిమాలయాలకు వెళ్లిపోయాడు. అక్కడే ధ్యానం చేసుకుంటూ కాలం గడుపుతూ ఉన్నాడు.

సతీదేవికి విన్నపం

సతీదేవికి విన్నపం

సన్యాసిగా మారిన శివుడిని మళ్లీ ఈ ప్రపంచంలోకి రావడానకి దేవుళ్లందరూ.. ఆదిశక్తి అయిన సతీదేవిని మళ్లీ జన్మించాలని ప్రార్థించారు.

పార్వతి పుట్టుక

పార్వతి పుట్టుక

దేవుళ్ల విన్నపంతో.. సతీదేవి పార్వతిగా జన్మించింది. హిమాలయాల రాజు హిమవంతుడు, భార్య మీనవతిలకు పార్వతి బిడ్డగా జన్మించింది.

పార్వతి పుట్టుక

పార్వతి పుట్టుక

ఒకరోజు పార్వతీ దేవి తాను ఎందుకు పుట్టిందనే విషయంతోపాటు, శివుడిని పెళ్లి చేసుకోవడం గురించి తన తల్లిదండ్రులకు వివరించింది.

శివుడిని

శివుడిని

క్రమం తప్పకుండా.. రోజూ పార్వతిని సన్యాసిగా మారి ధ్యానంలో ఉన్న శివుడిని చూసేది. ఆమె మళ్లీ తనకోసం వచ్చిందని శివుడు గ్రహిస్తాడని ఆశగా ఎదురుచూసేది.

పశ్చాత్తాపం

పశ్చాత్తాపం

పార్వతి దేవి శివుడిని పెళ్లి చేసుకోవాలని.. ఇంట్లో నుంచి వచ్చేస్తుంది. తాను ఉన్నట్టు, శివుడి కోసమే ఎదురుచూస్తున్నట్టు శివుడికి తెలపడానికి ఎంతగానో ప్రయత్నించింది. కానీ.. ఫలితం లేకపోవడంతో.. గౌరీ కుంద్ లో తపస్సు చేయడం మొదలుపెట్టింది.

కఠిన నియమాలతో

కఠిన నియమాలతో

ఆహారం, నీళ్లు ఏమీ తీసుకోకూండా చాలా కఠిన నియమాలతో తన పేరుని అపర్ణాగా మార్చుకోవడానికి చాలా ఏళ్లు తప్పస్సు చేసింది.

శివుడి పరిపూర్ణత

శివుడి పరిపూర్ణత

పార్వతీ దేవిని అనుగ్రహించిన శివుడు.. తన ధ్యానాన్ని వీడి వచ్చేశాడు. తనను చాలా కాలం వేచి ఉండేలా చేసినందుకు పార్వతిని శివుడు క్షమాపన కోరాడు.

శివపార్వతుల పెళ్లి

శివపార్వతుల పెళ్లి

పార్వతీదేవి తల్లిదండ్రులను తమ పెళ్లికి ఒప్పించాలని తిరిగి వస్తుండగా.. త్రియుగినాయణ గ్రామానికి దగ్గరలో వాళ్ల వివాహానికి అంగీకారం లభించింది. ఈ గ్రామం ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ సమీపంలో ఉంది. త్రి అంటే మూడు, యుగి అంటే యుగాలు, నారాయణ అంటే విష్ణువు అని అర్థం. ఇక్కడ విష్ణు భక్తులు ఉంటారు. అందుకే అక్కడ విష్ణుమూర్తి ఆలయం ఉంటుంది.

శివపార్వతుల పెళ్లిలో విష్ణువు

శివపార్వతుల పెళ్లిలో విష్ణువు

శివుడి వివాహం గురించి తెలిసిన విష్ణువు, బ్రహ్మ ఈ వివాహ మహోత్సవానికి వచ్చారు. మరో విశేషం ఏంటో తెలుసా ? ఈ వివాహ కార్యక్రమాలన్నింటినీ.. విష్ణువు చూసుకుంటే.. వివాహంలో పండితుడిగా బ్రహ్మ వ్యవహరించారు.

బ్రహ్మశిల

బ్రహ్మశిల

ఈ వివాహానికి ముందు శివుడు, విష్ణువు, బ్రహ్మ ఆలయానికి దగ్గరలోని చిన్న గుంతలలో స్నానాలు ఆచరించారట. అందుకే వాటికి రుద్ర కుంట, విష్ణు కుండ, బ్రహ్మ కుండ అని పేర్లు వచ్చాయి. అలాగే.. ఈ వివాహ మహోత్సవం సమయంలో.. బ్రహ్మ మంత్రాలు చదవుతూ.. బ్రహ్మ శిలను ఏర్పరచినట్లు ఆధారాలున్నాయి. ఈ ఆలయానికి వచ్చే సందర్శకులు.. ఇక్కడ ఉన్న బూడిదను పార్వతీపరమేశ్వరుల ఆశీర్వాదంగా భావిస్తూ తీసుకెళ్తారు.

శివపార్వతుల వివాహం

శివపార్వతుల వివాహం

త్రియుగినారాయణ ఆలయం శివ పార్వతుల పెళ్లికి వేదికగా మారింది. పార్వతీ పరమేశ్వరుల పెళ్లి సమయంలో వెలిగించిన అగ్నిగుండం ఇప్పటికీ వెలుగుతూనే ఉందట.

English summary

How Lord Shiva married Goddess Parvati ?

How Lord Shiva married Goddess Parvati ? After Sati immolated herself, Lord Shiva was unable to contain his grief for the loss of his beloved wife. In this grief-stricken phase, he lost interest in the worldly affairs, and retired himself in the mountains, in meditation and austerity.
Story first published:Monday, May 2, 2016, 14:03 [IST]
Desktop Bottom Promotion