శివాలయంలో ఇష్టమొచ్చినట్లు ప్రదక్షిణ చేస్తే కష్టాలు తప్పవు...!!

దేవాలయానికి వెళ్తే ప్రదక్షిణలు చేయడం మామూలే. అయితే శివాలయం చుట్టూ మాత్రం మిగతా ఆలయాలకు చేసే పద్ధతిలో ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే... శివుడు దేవదేవుడు. అంటే... దేవుళ్లకే దేవు

Posted By:
Subscribe to Boldsky

దేవాలయాలంటేనే ప్రశాంతతకు చిహ్నాలు, అక్కడికి వెళ్తే మనస్సుకు ప్రశాంతత కలగడమే కాదు, ఆ పరిసరాల్లో ఉండే పాజిటివ్ శక్తి మనలోకి ప్రవేశిస్తుంది. దీంతో కొత్త ఉత్సాహాం వస్తుంది. అయితే ఎవరు ఏ దేవాలానికి వెళ్లినా దైవాన్ని దర్శించుకోవడానికి ముందు ఖచ్ఛితంగా ప్రదక్షిణలు చేస్తారు. కొందరు తమ వీలును బట్టి ఎక్కువ ప్రదక్షిణాలు చేస్తే , మరికొందరు 3 ప్రదక్షిణాలే చాలని చెప్పి అనంతరం దైవ దర్శనం కోసం వెళ్తుంటారు. ఈ క్రమంలో వేరే ఏ దేవుడి గుడికైనా వెళ్లినప్పుడు భక్తులు అలా తమ వీలును బట్టి ప్రదక్షిణలు చేయవచ్చు. కానీ శివాలయానికి వెళ్ళినప్పుడు మాత్రం అలా చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి.

దేవాలయానికి వెళ్తే ప్రదక్షిణలు చేయడం మామూలే. అయితే శివాలయం చుట్టూ మాత్రం మిగతా ఆలయాలకు చేసే పద్ధతిలో ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే... శివుడు దేవదేవుడు. అంటే... దేవుళ్లకే దేవుడు. కాబట్టి... ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శివుడి ఉన్నతత్వాన్ని తక్కువ చేసినట్టు అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. శివాలంలో ప్రదక్షిణలు చేయడం గురించి కొన్ని వాస్తవాలు తెలుసుకుందాం..

పరమేశ్వరుడి తలపై నుండి జాలువారే గంగ...

అదేవిధంగా... పరమేశ్వరుడి తలపై నుండి జాలువారే గంగ... గుడిలోని శివలింగాన్ని అభిషేకించి, పీఠం కిందుగా ఏర్పాటు చేసిన కాలువగుండా బయటకు ప్రవహిస్తూ ఉంటుందని అంటారు. ప్రదక్షిణలు చేసేటప్పుడు ఆ గంగను దాటాల్సి వుంటుంది. పవిత్ర గంగను దాటడం సరికాదనే ఉద్దేశంతో ప్రత్యేకమైన ప్రదక్షిణ విధానాన్ని ఏర్పరిచారని పండితులు చెబుతున్నారు.

శివాలయ ప్రదక్షిణా విధానం: చండీ ప్రదక్షిణం లేదా సోమసూత్ర ప్రదక్షిణం:

మిగిలిన దేవాలయాలలో వలే ఈశ్వరుని దేవాలయంలో ప్రదక్షిణ చేయకూడదు. దానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది. దీనిని చండీ ప్రదక్షిణమని, సోమసూత్ర ప్రదక్షిణమని కూడా అంటారు.

 

లింగ పురాణంలో ఈ విధానం గురించి స్పష్టంగా పేర్కొనబడింది..!

నందీశ్వరుని (ధ్వజస్థంభం)వద్ద ప్రారంభించి - ధ్వజస్థంభం దగ్గర నుండి చండీశ్వరేని దర్శించుకుని, అక్కడ నుండి మళ్లీ వెనకకు తిరిగి ధ్వజస్థంభం దగ్గరకు వచ్చి ...ప్రదక్షిణ మొదలు పెట్టి సోమసూత్రం (అభిషేకజలం బయటకు పోవుదారి )వరకు వెళ్ళి వెనుకకు తిరిగి మరలా ధ్వజస్థంభం దగ్గర ఒక్క క్షనం ఆగి అదేవిధంగా సోమసూత్రం వరకు రావాలి. అక్కడి నుండి... ప్రదక్షిణ మొదలు పెట్టి, సోమసూత్రం (అబిషేక జంల బయటకు పోవుదారి) వరకు వెళ్ళీ వెనుకకు తిరిగి మరలా ద్వజస్థంభం దగ్గర ఒక్క క్షణం ఆగి అదేవిధంగా సోమసూత్రం వరకూ రావాలి. అక్కడి నుండి...తిరిగి ధ్వజస్థంభం దగ్గరకు వస్తే ఒక్క ప్రదక్షిణ పూర్తి అవుతుంది.

 

లింగ పురాణంలో

వెనుదిరిగి నందీశ్వరుని వద్దకు చేరుకుంటే ఒక ‘‘శివ ప్రదక్షిణ '' పూర్తి చేసినట్లు. శివ ప్రదక్షిణలో సోమసూత్రాన్ని దాటరాదు. (సోమసూత్రం దగ్గర ప్రమథ గణాలు కొలువై ఉంటాయంటారు. అందుకే వారిని దాటితే తప్పు చేసినవారమవుతాం) . కొద్దిగా సాధాన చేస్తే ఇది పెద్ద కష్టం కాదు.

ఒక ప్రదక్షిణం మనం సాధారణంగా చేసే పదివేల ప్రదక్షిణాలతో సమానం

ఇలా చేసే ఒక ప్రదక్షిణం మనం సాధారణంగా చేసే పదివేల ప్రదక్షిణాలతో సమానమని లింగ పురాణంలో పేర్కొనబడినది. ఇలా మూడు సార్లు ప్రదక్షిణాలు చేయాలి. ఈ రోజుల్లో ప్రదక్షిణం అంటే ఒక అరగంట ఎక్సర్ సైజ్ చేస్తే మంచిది కదా అనే జనరేషన్ తయారయింది.

కానీ ప్రదక్షిణం చేసేటప్పుడు..

కానీ ప్రదక్షిణం చేసేటప్పుడు..మనస్సు, తనువు అన్నీ భగవంతునిపై లగ్నం చేయడం వల్ల ప్రదక్షిణం శరీరంలోని , మనస్సులోని బాధలను హరించివేస్తుంది. అందువల్ల కేవలం శారీరరకంగానే కాక ఆధ్యాత్మికంగా , వ్యక్తిగతంగా ఉఛ్ఛస్థితికి చేరుకోవచ్చు.

మెడిటేషన్ కంటే ఇది చాలా ఉత్తమం.

ప్రస్తుతం మనం చేసే నాన్ డూయింగ్ మెడిటేషన్ కంటే ఇది చాలా ఉత్తమం. గుడిలో ఉండే పాజిటివ్ వైబ్రేషన్స్ మనలోని శక్తిని మెరుగుపరుస్తుంది. మనస్సును ఉల్లాసపరుస్తుంది. అది ఏ ఆలయంలో ప్రదక్షిణ అయినా సరే...

English summary

How to perform Chandi Pradakshina in Lord Shiva Temple..!

How to perform Chandi Pradakshina in Lord Shiva Temple..!,It is very common that we perform circumambulations (Pradashina -going around the temple) around the sanctum sanctorum (Garbhagudi). Going around temple infuses us with the divine cosmic energy that resides in the permises.
Story first published: Tuesday, November 15, 2016, 16:00 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter