ఐశ్వర్యానికి అధిపతియైన కుబేరుని ఎలా పూజిస్తే అష్టఐశ్వర్యాలు పొందుతారు..?

ఐశ్వర్యానికి అధిపతియైన కుబేరుని భక్తితో పూజించుకునేవారికి సకల సంపదలతోపాటు ఆయురారోగ్యభాగ్యాలు కలుగుతాయని గట్టి విశ్వాసం. మరి కుబేరున్ని ఎలా పూజిస్తే అదృష్టం వరిస్తుందో తెలుసుకుందాం..

Posted By:
Subscribe to Boldsky

సహజంగా మనకు కుబేరుడనగానే వేంకటేశ్వరస్వామికి అప్పిచ్చిన వాడిగానే తెలుసు..! వెంకటేశ్వరుని అంతటివానికే అప్పిచ్చాడంటే ధనానికి తక్కువవాడు కాదని. డబ్బున్న మారాజుల్ని కుబేరులతో పోలుస్తాం. సిరి సంపదలకు, నవ నిధులకు అధిపతి అయిన కుబేరుడు ఉత్తర దిక్పాలకుడు. అథర్వణ వేదం ప్రకారం ఈయన గుహ్యాధిపుడు. కుబేరుడు అనగా అవలక్షణమయిన (లేదా అవలక్షణాలున్న) శరీరము కలవాడు (బేరము అంటే శరీరము) అని అర్థము.

పేరుకి తగ్గట్టుగానే ఈయన పొట్టిగా , పెద్ద కుండ వంటి పొట్టతో, మూడు కాళ్ళు, ఒకే కన్ను, ఎనిమిది పళ్ళతో ఉంటాడని ముఖము ఎడమవైపుకి వాలినట్టు ఉంటుందనీ మన పురాణాలలో చెప్పబడింది.

శ్రీ శివ, మత్స్య, స్కాంద పురాణాల ప్రకారం, కుబేరుని శరీరం వినాయకుని పోలి ఉంటుందని చెప్పబడింది. కైలాసం వద్ద ఉండే అలకానగరం కుబేరుని నివాస స్థలం. విశ్రవునికి, భరద్వాజ మహర్షి తన కుమార్తె అయిన దేవవర్ణినికిచ్చి వివాహం జరిపించారు. వీరిరువురికీ పుట్టినవాడు వైశ్రవణుడు. ఈ వైశ్రవణుడే (విశ్రవుని కుమారుడు) కుబేరుడు.

హిందువులే కాక, బౌద్ధ, జైన మతాల వారు కూడా అధికంగా పూజించే దైవం కుబేరుడు. బౌద్ధులు ఈయనని వైశ్రవణుడు లేదా జంభాలుడు అని పిలుస్తారు. ఈ విశ్వంలో సంపద ఏదైనా ... అది ఏ రూపంలో వున్నా దానికి అధిపతి కుబేరుడే. పద్మ ... మహాపద్మ ... శంఖ ... మకర ... కచ్చప ... ముకుంద ... కుంద ... నీల ... వర్చస అనే 'నవ నిధులు' ఆయన అధీనంలో వుంటాయి. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అర్చావతారమైన శ్రీ వేంకటేశ్వరస్వామి కూడా తన వివాహానికి అవసరమైన ధనాన్ని ఈయన నుంచే అప్పుగా తీసుకున్నాడు. అలాంటి కుబేరుడి అనుగ్రహం లభిస్తే అంతకన్నా అదృష్టం ఏముంటుంది?


ఐశ్వర్యానికి అధిపతియైన కుబేరుని భక్తితో పూజించుకునేవారికి సకల సంపదలతోపాటు ఆయురారోగ్యభాగ్యాలు కలుగుతాయని గట్టి విశ్వాసం. మరి

కుబేరున్ని ఎలా పూజిస్తే అదృష్టం వరిస్తుందో తెలుసుకుందాం..

పూజగదిలో

స్నానపానాదులుగావించి మీ పూజగదిలో తూర్పువైపున కూర్చోవాలి. ఉదయాన్నే తలంటిస్నానం చేసి రాహుకాలం, యమగండాలు లేని సమయంలో పూజను ప్రారంభించాలి.

చెక్కతో చేసిన పీటపై

చెక్కతో చేసిన పీటపై పసుపు లేదా ఎర్రటి వస్త్రాన్ని పరచండి.పసుపుకుంకుమ, కొబ్బరికాయ, చందనం, అరటి ఆకు, మామిడాకులు, తమలపాకులు, ఫలపుష్పాలు, సాంబ్రాణి, కర్పూరం, నవధాన్యాలు, అరటిపండ్లను సేకరించుకోవాలి.

కలశాన్ని సిద్ధం చేసుకుని

తర్వాత కలశాన్ని సిద్ధం చేసుకుని, కలశం ఎదురుగా నెయ్యితో దీపాలు వెలిగించాలి. భూమి మరియు కలశాతన్ని పూజించాలి.

గణాధిపతిని

మొదట విఘ్నాలను తొలగించే గణాధిపతిని ధ్యానించి పంచామ్రుతంతో అభిషేకం చేయాలి.

కుబేరుని యంత్రం

కుబేరుని యంత్రం మరియు ధన్వంతరీ భగవానులను చిత్రపటాలను పూజలో ఉంచాలి. ధాన్యం మరియు బెల్లం నైవేద్యంగా అర్పించాలి.

బంగారు, వెండి నాణేలు,

బంగారు, వెండి నాణేలు, ఆభరణాలను శుభ్రంగా కడిగి పవిత్ర నీటితో స్నానం చేయించాలి.

అక్షతలతో పూజించండి.

కాంస్యం లేదా ఇత్తడి ఆభరణాలుంచి, కుంకుమ, సింధూరం, అక్షతలతో పూజించండి.

ఓం గం గణపతయే నమ:

ఐదు సార్లు ఓం గం గణపతయే నమ: అని జపించండి.

ఓం శ్రీ కుబేరాయ నమ:

ఓం శ్రీ కుబేరాయ నమ: , ఓం శ్రీ మహాలక్ష్మై నమ: అనే మంత్రాలను తులసిమాలతో 108సార్లు జపించాలి.

ఇంట్లో స్వస్తిక్ గుర్గునుంచండి.

ఇంట్లో స్వస్తిక్ గుర్గునుంచండి. ఈ పూజను సాయంత్రం నుంచి రాత్రి లోపల చేయవచ్చంటున్నారు జ్యోతిష్యులు.

English summary

How to Perform Kuber Puja for Wealth and Prosperity

Kuber Puja is associated with Lord Kuber, who is believed to be the wealth of God. This Puja is considered to be very fruitful for financial affluence and gaining materialistic comforts. Lord Kuber who is also known as Dhanapati is the son of sage Vishrava who is the son of Lord Brahma.
Please Wait while comments are loading...
Subscribe Newsletter