For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెళ్లిలో వధూవరులు జీలకర్రబెల్లం పెట్టుకోవడం యొక్క ప్రాముఖ్యత

|

హిందు సాంప్రదాయంలో పెళ్లిలో వధూవరులు ఒకరిపై ఒకరు తలలపై జీలకర్ర, బెల్లం పెట్టుకుంటారెందుకు? మంత్రాలతో వధువరుల నెత్తి మీద జీలకర్ర, బెల్లం పెట్టేది శుభసూచికముతో పాటు శరీరంలో ఉన్న దోషాలు పోవాలని, జీలకర్ర, బెల్లంలా వారిరువురు కలసి మెలసి ఉండాలని. ఇద్దరితో పెట్టిస్తారు.

వధూవరులకు.. జీలకర్ర, బెల్లం కలిపిన మెత్తని ముద్దను శిరస్సు భాగంలో, బ్రహ్మరంధ్రం పైన ఉంచుతారు. ఒకరిపట్ల ఒకరికి అనురాగం కలగడానికి, భిన్నరుచులైన ఇద్దరూ ఏకం కావడానికి, పరస్పర జీవశక్తుల ఆకర్షణకు తోడ్పడేలా మనసు సంకల్పించటం దీని అంతరార్థం. ఈ సమయంలో ‘‘ఆభ్రాతృఘ్నీం వరుణ ఆపతిఘ్నీం బృహస్పతే లక్ష్యం తాచుస్యై సవితుస్సః'' వరుణుడు, సోదరులను వృద్ధిపరచుగాక. బృహస్పతి, ఈమెను భర్తవృద్ధి కలదిగా చేయుగాక. సూర్యుడు, ఈమెను పుత్రసంతానం కలదానిగా చేయుగాక'' అని అర్థం. ఇదే అసలైన సుముహూర్తం. వధూ-వరులను కళ్యాణ వేదికపై, తూర్పు-పడమర ముఖంగా కూచోబెట్టి, మధ్య ఉత్తర-దక్షిణ ముఖంగా తెరను అడ్డం పెట్టి, ఇరువురి చేతికి "జీల కర్ర- బెల్లం" కలిపిన ముద్దను ఇస్తాడు పురోహితుడు.

Importance Of Jeelakarra Bellam In Marriages

పెళ్ళిచూపుల కార్యక్రమం పూర్తి అయిన పిదప, అమ్మాయి-అబ్బాయిల జాతకాల ననుసరించి జ్యోతిష్యంలో అనుభవమున్న పండితులతో పెళ్ళికి తగిన ముహూర్తం నిర్ణయించ బడుతుంది. వారు నిర్ణయించిన ముహూర్తానికి వరుడు-వధువు ఒకరి తలపై ఇంకొకరు "జీలకర్ర-బెల్లం" పెట్టడం జరుగుతుంది. నిజానికిదే సుముహూర్తం (జీల కర్ర-బెల్లం శిరస్సుపై వుంచడం). మంగళ వాయిద్యాలు మోగిస్తుంటే, పురోహితుడు మంత్రాలు చదువుతుంటే, గౌరీ దేవిని ధ్యానించుకుంటూ వధువు, వరుడు ఏక కాలంలో నిర్ణయించిన ముహూర్తానికి ఒకరి శిరస్సు మీద మరొకరం (బ్రహ్మ రంధ్రం మీద) జీల కర్ర-బెల్లం కలిపిన ముద్దను వుంచుకుంటారు. సుముహూర్త కాలంలో పెద్దల ఆశీర్వాదాన్ని పొందుతారు.

Importance Of Jeelakarra Bellam In Marriages

జీల కర్ర-బెల్లం ముద్దను వధూవరులు పెట్టుతున్న సమయంలో, పురోహితుడు చదివిన మంత్రానికి, "వరుణుడు, బృహస్పతి, మీకు శాశ్వతమైన స్థానాన్ని ఇచ్చెదరు గాక ! అగ్ని దేవతలు మిమ్ములను దీవించెదరు గాక ! పంచభూతాలు స్థిరంగా వుండు గాక ! ఈ సుముహూర్తం మీకు శుభ ముహూర్తం అగుగాక !" అని అర్థం వస్తుంది. జీల కర్ర-బెల్లం మిశ్రమంలో పరస్పరాకర్షణ వుంటుందని మన పెద్దలు చెప్పడమే కాకుండా, శాస్త్రజ్ఞులు కూడా అంగీకరించారు.

Importance Of Jeelakarra Bellam In Marriages

వరుడు వధువు ముఖాన్ని సుముహూర్త కాలంలో చూడటాన్ని సమీక్షణం లేక నిరీక్షణం అంటారు.
కళ్యాణవేదిపైన వధువు తూర్పు ముఖంగా, వరుడు పశ్చిమ ముఖంగా కూర్చుంటారు. వీరిద్దరి మధ్యగా తెల్లని తెరను ఉంచుతారు. వధూవరుల చేతిలో జీలకర్ర బెల్లం మెత్తటిపొడిగా నలిపి ఉండగా చేసి సిద్ధంగా ఉంచుతారు. సకల మంగళవాద్యాలు మోగుతూ ఉండగా, ముత్తైదువులు మంగళములైన గీతాలను ఆలపిస్తుండగా, వేదఘోషల మధ్య శుభ ముహూర్తసమయంలో తెరను తొలగిస్తారు.

అప్పుడు వరుడు తన ఇష్ట దేవతను ధ్యానిస్తూ వధువు కనుబొమ్మల మధ్యభాగాన్ని చూస్తాడు. జీలకఱ్ఱ బెల్లాని ఆమె నడినెత్తిన బ్రహ్మరంధ్రముపైన ఉంచుతాడు. అలాగే, వధువు కూడా తన ఇష్టదేవతా ధ్యానంతో పెండ్లికొడుకు కనుబొమ్మల మధ్య చూసి అతడి నడినెత్తిన జీలకఱ్ఱ ముద్దను ఉంచుతుంది.

జీలకఱ్ఱ - బెల్లం :ఈ రెండిటి కలయిక వలన కొత్త శక్తి పుడుతుంది. నడినెత్తిన బ్రహ్మరంధ్రంపైన ఆ ముద్దను పెట్టిన తరువాత వధూవరులకు ఇద్దరికీ ఒకరిపైన ఒకరికి స్థిరమైన దృష్టి కేంద్రీకరణ జరుగుతుంది అని పెద్దలు చెబుతారు. వైజ్ఞానికులు కూడా సైన్సు పరంగా ఈ విషయాన్ని అంగీకరించారు. శుభమైన లక్షణాలలో కలిసిన అనురాగమయమైన ఆ మొదటి దృష్టి వారి మధ్య మానసిక బంధాన్ని క్షణక్షణానికి పెంచుతుందిని విశ్వసిస్తారు.

English summary

Importance Of Jeelakarra Bellam In Marriages

Positive Electric charge emanates when cumin seeds and jaggery are combined and a paste made of it, as is happened when the glass rod rubbed with silk cloth (In the case of glass rod, electrons are loosely bounded compared to silk cloth and hence it loses electrons &get positive charge and it gets the ability to attract the nearby particles). In the crown of the head, a subtle or esoteric aperture will be there.
Story first published: Wednesday, January 28, 2015, 18:05 [IST]
Desktop Bottom Promotion