For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దీపావళి రోజే ఎందుకు దీపాలు వెలిగిస్తాం ? క్రాకర్స్ పేల్చుతాం ?

దీపావళి సాధారణంగా.. అక్టోబర్, నవంబర్ నెల మధ్యలో ఎప్పుడైనా రావచ్చు.

By Nutheti
|

దీపాల పండుగ దీపావళి అనగానే చిన్నా పెద్దా అందరికీ ఉత్సాహమే. రకరకాల పూలతో అలంకరణలో.. దీపాల వెలుగులో మిరుమిట్లు గొలుపుతూ ఇల్లంతా శోభాయమానంగా ఉంటుంది. పండగ రోజూ ప్రతి ఇల్లు కొంగొత్త శోభతో మెరిసిపోతుంది.

భారతీయ సంప్రదాయంలో దీపావళిని చాలా ప్రత్యేక పండుగగా జరుపుకుంటాం. ఈ పండగ సందర్భంగా టపాకాయలు పేల్చడం, లక్ష్మీ పూజలు నిర్వహించడంలో ప్రపంచమంతా మునికి తేలుతుంది.

READ MORE: దీపావళికి ఈ హెయిర్ స్టైల్స్ ఆకర్షణీయం&సురక్షితం

దీపావళి సాధారణంగా.. అక్టోబర్, నవంబర్ నెల మధ్యలో ఎప్పుడైనా రావచ్చు. ఈ పండుగను హిందూ లునార్ క్యాలెండర్ డిసైడ్ చేస్తుంది. దీపావళి వేడుకను హిందువులు, సిక్కులు, జైనులు జరుపుకుంటారు. ఈ పండుగ ప్రాసస్త్యం ఒక్కొరి పరిభాషలో ఒక్కోలా ఉంది. రకరకాల కారణాలు, ఇతిహాసాలు దీపావళి పండగ వెనక ఉన్నాయి. దీపావళి పండుగ జరుపుకోవడం వెనక ఉన్న ఆసక్తికర కారణాలు, నమ్మకాలేంటో.. చూద్దాం..

లక్ష్మీ దేవి పుట్టిన రోజు

లక్ష్మీ దేవి పుట్టిన రోజు

అష్టైశ్వర్యాలు ప్రసాదించే లక్ష్మీదేవి పుట్టిన రోజు కావడం వల్ల దీపావళిని సెలబ్రేట్ చేసుకోవాలని హిందువులు నమ్ముతారు. సముద్రగర్భంలోంచి కార్తీక అమావాస్య రోజు లక్ష్మీ దేవి పుట్టినట్టు పురాణాలు చెబుతున్నాయి. అందుకే దీపావళి రోజు లక్మీ పూజలు నిర్వహిస్తారు. అంతేకాదు అదే కార్తీక అమావాస్య రోజు లక్మీ విష్ణువుని పెళ్లి చేసుకుందని మరో కథ ఉంది. అందుకే వాళ్ల పెళ్లికి గుర్తుగా ఆ రోజు దీపాలతో ఇంటిని అలంకరించి అమ్మవారి అనుగ్రహం కోసం పూజలు నిర్వహిస్తారు.

పంట చేతికొచ్చిన సందర్భంగా

పంట చేతికొచ్చిన సందర్భంగా

దీపావళి పండుగ జరుపుకునే సమయానికి పంటచేతికి రావడంతో రైతులు ఆనందంలో మునిగిపోతారు. అక్టోబర్, నవంబర్ మధ్యలో దీపావళి వస్తుంది. అదే సమయంలో.. కొత్త బియ్యం అందుబాటులో ఉంటాయి. దీంతో రైతన్నలు ఆనందంగా పండుగ చేసుకుంటారు.

సిక్కులకు ప్రత్యేకం

సిక్కులకు ప్రత్యేకం

దీపావళి పండుగకు సిక్కులకు దగ్గర సంబంధం ఉంది. సిక్కుల మూడో గురువు అమర్ దాస్ ఈ దీపావళిని పరిచయం చేశారట. గురువు ఆశీస్సులు పొందేటప్పుడు దీపాలు వెలింగించడం ప్రారంభించారు. అలా దీపావళి పండుగ జరుపుకుంటున్నారు. అంతేకాదు 1577లో స్వర్ణ దేవాలయం శంకుస్థాపన జరిగిన రోజు కూడా కావడంతో.. సిక్కులు దీపావళి జరుపుకోవడానికి కారణమైంది.

పాండవులు తిరిగి వచ్చిన రోజు

పాండవులు తిరిగి వచ్చిన రోజు

మహాభారతం ప్రకారం కౌరవుల చేతిలో పరాజయం పొందిన తర్వాత పాండవులు 12 ఏళ్ల అగ్నాతం నుంచి కార్తీక అమావాస్య రోజు హస్తీనాపురం చేరుకున్నారట. అందుకు పాండవుల అభిమానులు, ప్రజలు సంతోషంతో.. దీపావళి జరుపుకున్నట్లు ప్రశస్తి. అలా అప్పుడు ప్రారంభమైన దీపాల పండుగ ఇప్పటికీ కొనసాగుతోంది.

శ్రీ కృష్ణుడు నరకాసురుడిని వధించిన రోజు

శ్రీ కృష్ణుడు నరకాసురుడిని వధించిన రోజు

విష్ణువు శ్రీ కృష్ణుడిగా అవతరించి.. నరకాసురుడిని వధించి.. 16 వేల మంది మహిళలను రక్షించిన రోజుగా దీపావళిని జరుపుకుంటారు. నరకాసురుడి నుంచి బయటపడినందుకు సంతోషంగా.. రెండు రోజులు దీపావళి పండుగ చేసుకుంటున్నాం. మరో కథ ప్రకారం శ్రీ కృష్ణుడి భార్య సత్యభామ నరకాసురుడిని ఓడించినట్లు చెబుతోంది. చనిపోయేముందు నరకాసురుడు తన తప్పు తెలుసుకుని.. సత్యభామ నుంచి వరం కోరాడు. తన మరణాన్ని ప్రతి ఒక్కరు కాంతులు విరజిమ్మేలా జరుపుకోవాలని కోరుకున్నాడట. అందుకే ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో దీపావళిని నరక చతుర్ధశిగా పిలుస్తూ.. రెండురోజులు జరుపుకుంటారు.

సీతారాములు అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు

సీతారాములు అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు

14 ఏళ్ల వనవాసం తర్వాత సీతారాములు అయోధ్య తిరిగి వచ్చిన సందర్భంగా కార్తీక అమావాస్యను దీపావళిగా జరుపుకుంటున్నాం. తమకు ప్రియమైన రాజు అయోధ్యకు రావడంతో ప్రజలంతా టపాకాయలు కాల్చి పండుగ జరుపుకున్నారు.

ఇలా కారణాలు, కథలు దీపావళి పండుగ గురించి వివరిస్తున్నాయి. ఈ పండుగను దీపావళి లేదా నరక చతుర్ధశి లేదా దీవాలీ అని పిలుస్తారు.

English summary

Interesting reasons why Deepavali is celebrated in telugu

Deepavali, the festival of lights, is one of the most significant festivals in Indian culture. It sees millions across the world attend to firework display and prayers.
Desktop Bottom Promotion